News


అమ్మకాల ఒత్తిడిలో మెటల్‌ షేర్లు

Wednesday 8th January 2020
Markets_main1578467826.png-30764

మార్కెట్‌ మిడ్‌సెషన్‌ కల్లా మెటల్‌ షేర్లు నష్టాలను ఎదుర్కోంటున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1.50శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.12:20నిల.కు ఇండెక్స్‌ క్రితం ముగింపుస్థాయి(2,785.90)తో పోలిస్తే 1.55శాతం నష్టంతో 2,742.80     వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌ జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేరు 3శాతం నష్టపోయింది. ఎన్‌ఎండీసీ, హిందూస్థాన్‌ కాపర్‌ షేర్లు 2.50శాతం, మెయిల్‌, ఏపిఎల్‌ అపోలో, హిందాల్కో షేర్లు 2శాతం నష్టపోయాయి. టాటా స్టీల్‌, కోల్‌ ఇండియా, జిందాల్‌ స్టీల్‌ షేర్లు 1.50శాతం పతనమయ్యాయి. వేదాంత 1శాతం, సెయిల్‌, వెల్‌స్పన్‌ కార్ప్‌ షేర్లు అరశాతం క్షీణించాయి. మరోవైపు రత్నమని లిమిటెడ్‌ షేరు​4.50శాతం లాభపడగా, నాల్కో షేరు 0.25శాతం స్వల్పంగా పెరిగింది. 


ఇదే సమయానికి సెన్సెక్స్‌ 150 పాయింట్ల నష్టంతో 40,715 వద్ద, నిఫ్టీ 55 పాయింట్లను కోల్పోయి 12వేల దిగువున 11,998 వద్ద ట్రేడ్‌ అవుతోంది.You may be interested

రామ్‌కో, మాస్టెక్‌, జూబిలెంట్‌.. జూమ్‌

Wednesday 8th January 2020

మార్కెట్లు డౌన్‌- ఈ షేర్లు అప్‌ రామ్‌కో సిస్టమ్స్‌  మాస్టెక్‌ లిమిటెడ్‌ జూబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ పశ్చిమాసియాలో తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు నీరసంగా కదులుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 93 పాయింట్లు తక్కువగా 40,776కు చేరగా.. నిఫ్టీ 39 పాయింట్లు క్షీణించి 12,014 వద్ద ట్రేడవుతోంది. ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ మిసైల్‌ దాడులు చేపట్టినట్లు వెల్లడించడంతో తొలుత సెన్సెక్స్‌ దాదాపు 400 పాయింట్లు పతనంకాగా..నిఫ్టీ 12,000

సుజ్లాన్‌- ఎన్‌సీఎల్‌.. బోర్లా

Wednesday 8th January 2020

రుణ చెల్లింపుల్లో సుజ్లాన్‌ ఎనర్జీ విఫలం క్యూ3లో ఎన్‌సీఎల్‌ సిమెంట్‌ ఉత్పత్తి డీలా పశ్చిమాసియాలో తలెత్తిన తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు పతన బాట పట్టాయి. ఉదయం 11.45 ప్రాంతంలో సెన్సెక్స్‌  280 పాయింట్లు క్షీణించి 40,590 దిగువకు చేరగా.. నిఫ్టీ 92 పాయింట్లు కోల్పోయి 11,961 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో రుణ చెల్లింపుల్లో విఫలమైనట్లు వెల్లడికావడంతో పవన విద్యుత్‌ రంగ కంపెనీ సుజ్లాన్‌ ఎనర్జీ కౌంటర్లో అమ్మకాలు

Most from this category