News


అమ్మకాల ఒత్తిడిలో మెటల్‌ షేర్లు

Monday 27th January 2020
Markets_main1580106349.png-31231

మార్కెట్‌ పతనంలో భాగంగా సోమవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో మెటల్‌ షేర్లు భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. కరోనా వైరస్‌ వల్ల సంభవించే వ్యాధి మరింత ఉధృత రూపం దాల్చవచ్చనే అంచనాలతో చైనాతో పాటు అంతర్జాతీయ వృద్ధి ఆందోళనలు తెరపైకి వచ్చాయి. ఈ ప్రతికూల ప్రభావంతో మెటల్‌ షేర్లు నేటి ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఇంట్రాడేలో ఒక దశలో 2.72శాతం నష్టపోయింది. ఉదయం గం.11:15ని.లకు ఇండెక్స్‌ మునుపటి ముగింపు 2,796.20తో పోలిస్తే 2.50శాతం నష్టంతో 2,728 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ ఇండెక్స్‌లో అత్యధికంగా జిందాల్‌ స్టీల్‌ 5.50శాతం నష్టపోయింది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 4శాతం, టాటా స్టీల్‌, వేదాంత, సెయిల్‌ ఎన్‌ఎండీసీ, హిందాల్కో షేర్లు 3శాతం క్షీణించాయి. మెయిల్‌, హిందూస్థాన్‌ కాపర్ షేర్లు 2శాతం, నాల్కో, రత్నమని మెటల్‌ ట్యూబ్స్‌ లిమిటెడ్‌, నాల్కో, హిందూస్థాన్‌ జింక్‌, కోల్‌ ఇండియా షేర్లు 1శాతం నుంచి అరశాతం నష్టపోయాయి. మరోవైపు ఇదే ఇండెక్స్‌లోని ఏపిఎల్‌ అపోలో షేరు దాదాపు 5శాతం లాభపడగా, వెల్‌స్పన్‌ కార్ప్‌ షేరు 3శాతం పెరిగింది. 

ఇదే సమయానికి నిఫ్టీ -50 ఇండెక్స్‌లోని టాప్‌ -5 లూజర్స్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, వేదాంత, హిందాల్కో షేర్లు మొదటి 4స్థానాల్లో ట్రేడ్‌ అవుతుండటం గమనార్హం. 



You may be interested

విభిన్న రంగాల నుంచి బడ్జెట్‌ స్టాక్స్‌ ఇవే!

Monday 27th January 2020

వారం రోజుల్లో వెలువడనున్న సార్వత్రిక బడ్జెట్‌ నేపథ్యంలో మార్కెట్లు హెచ్చుతగ్గుల మధ్య కదులుతున్నాయి. ఇందుకు దేశ, విదేశీ అంశాలు ప్రభావం చూపుతున్నాయి. మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు, వినియోగాన్ని పెంచే చర్యలు వంటి అంచనాలతో బడ్జెట్‌ ఇన్వెస్టర్లకు జోష్‌నిస్తుంటే.. చైనాలో తలెత్తిన కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటును దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌కు ముందు పెట్టుబడుల కోసం  ఏఏ రంగాలను ఎంపకి చేసుకోవాలి, ఎలాంటి స్టాక్స్‌కు ప్రాధాన్యమివ్వాలి అనే అంశాలపై

మొబైల్స్‌ తర్వాత ఆటోరంగంపై చైనా కంపెనీల కన్ను!

Monday 27th January 2020

భారత మార్కెట్లో మెజార్టీ వాటా కొల్లగొట్టేందుకు యత్నాలు ప్రధానంగా ఇ-వాహనాలపై దృష్టి భారత ఐటీ, టెక్నాలజీ రంగాల్లోకి చైనా ఆక్రమణ చాలా నెమ్మదిగా స్లోపాయిజన్‌లాగా జరుగుతూ వస్తోంది. తొలుత నెమ్మదిగా ఆరంభమయ్యే చైనా ఆక్రమణ క్రమంగా ఉధృత రూపం దాలుస్తూ చివరకు అడుగు పెట్టిన రంగాన్ని శాసించేలా చేస్తుందన్నది టెలికం రంగ అనుభవాలు చెబుతున్నాయి. కొన్నేళ్లుగా అటు స్మార్ట్‌ఫోన్ల నుంచి ఇటు డిజిటల్‌పేమెంట్స్‌ వరకు, అటు ఇ- వాహనాల నుంచి ఇటు కన్జూమర్‌

Most from this category