News


కరిగిపోతున్న మెటల్‌ షేర్లు..!

Monday 24th February 2020
Markets_main1582521895.png-32036

మార్కెట్‌ పతనంలో భాగంగా సోమవారం మెటల్‌ షేర్లు భారీగా కరిగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్‌ వ్యాధి తీవ్రతరం కావడంతో పాటు ప్రపంచదేశాలకు అత్యధికంగా లోహాలను ఎగుమతి చేసే చైనాలో కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తితో ఉత్పత్తి ఆగిపోవడంతో వృద్ధి భయాలు తలెత్తాయి. ఫలితంగా ప్రపంచమార్కెట్లో మెటల్‌ షేర్లకు డిమాండ్‌ తగ్గింది. అంతర్జాతీయ ట్రెండ్‌కు తగ్గట్లుగానే దేశీయంగా మెటల్‌ షేర్లకు డిమాండ్‌ కరువైంది. ఫలితంగా నేడు ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లోనే 3.61శాతం నష్టాన్ని చవిచూసింది. ఉదయం గం.9:45ని.లకు ఇండెక్స్‌ గురువారం ముగింపు(2,612.25)తో పోలిస్తే 3.04శాతం నష్టంతో 2,532.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా జిందాల్‌ స్టీల్‌ షేరు 5శాతం నష్టాన్ని చవిచూసింది. హిందాల్కో 4.50శాతం, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌ 4శాతం, హిందూస్థాన్‌ కాపర్‌, టాటాస్టీల్‌, వేదాంత, సెయిల్‌ షేర్లు 3.50శాతం నష్టపోగా, కోల్‌ ఇండియా, మొయిల్‌, నాల్కో షేర్లు 3శాతం నుంచి 2శాతం క్షీణించాయి. అలాగే వెల్‌స్పన్‌కార్ప్‌ షేరు 1.50శాతం, ఎన్‌ఎండీసీ, హిందూస్థాన్‌ జింక్‌ 1శాతం నష్టపోయాయి. మరోవైపు ఇదే ఇండెక్స్‌లో ఏపిల్‌ అపోలో ఒకశాతం పెరగ్గా, రత్నమని టైర్స్‌ అండ్‌ ట్యూబ్స్‌ షేర్లు స్వల్పంగా అరశాతం లాభపడింది. You may be interested

అరబిందో ఫార్మాకు యూఎస్‌ఎఫ్‌డీఏ షాక్‌

Monday 24th February 2020

15 శాతం పతనమైన షేరు గత వారం అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్‌ఎఫ్‌డీఏ) ఈఐఆర్‌ జారీ చేసిన వార్తలతో రివ్వున పైకెగసిన హెల్త్‌కేర్‌ రంగ హైదరాబాద్‌ కంపెనీ అరబిందో ఫార్మా కౌంటర్లో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈలో 10.30 ప్రాంతంలో అరబిందో షేరు 15 శాతం పతనమై రూ. 509 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో అమ్మకాలు పెరిగి రూ. 490 దిగువన ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.

నేటి వార్తల్లోని షేర్లు

Monday 24th February 2020

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం స్టాక్‌ మార్కెట్‌లో ప్రభావితమయ్యే షేర్లు రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌: ఈ కంపెనీ కమిటీ ఆఫ్‌ క్రెడిటార్స్‌ సమావేశం సోమవారం జరగనుంది. యస్‌ బ్యాంక్‌: హిందుజా గ్రూపు సెర్బ్రస్‌ క్యాపిటల్‌ మేనేజ్‌ మెంట్‌తో కలిసి యస్‌ బ్యాంక్‌లో వాటా కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.  బయోకాన్‌: ఈ కంపెనీ యూఎస్‌డీఎఫ్‌ఏ నుంచి మూడు పరిశీలనలను అందుకున్నట్లు వెల్లడించింది. మలేసియాలోని ఇన్సులిన్‌ తయారీ కేంద్రంలో అమెరికా హెల్త్‌ రెగ్యులేటరీ సంస్థ ఫిబ్రవరి

Most from this category