మెటల్ షేర్ల భారీ పతనం
By Sakshi

మార్కెట్ పతనంతో భాగంగా మెటల్ షేర్లు సోమవారం భారీగా నష్టపోతున్నాయి. ఎన్ఎస్ఈలో బ్యాంకు నిఫ్టీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఉదయం ట్రేడింగ్ సెషన్లో దాదాపు 4శాతం క్షీణించింది. నేడు నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 2,428.20 వద్ద మొదలైంది. నేడు మార్కెట్లో జరుగుతున్న అమ్మకాల కారణంగా నిఫ్టీ ఇండెక్స్ ఒకదశలో 4శాతం వరకు పతనమై 2,459.10 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:00లకు ఇండెక్స గతముగింపు(2459)తో పోలిస్తే 2.50శాతం నష్టంతో 2397 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా జిందాల్ స్టీల్, టాటా స్టీల్, హిందూస్తాన్ కాపర్, హిందాల్కో షేర్లు 4శాతం నష్టపోయాయి. జేఎస్‌డబ్ల్యూస్టీల్, మెయిల్ స్టీల్ 3శాతం పతనమయ్యాయి. నాల్కో, సెయిల్, ఎన్ఎండీసీ, ఏపిల్అపోలో షేర్లు 2శాతం క్షీణించాయి. వేదాంత, హిందూస్థాన్ జింక్ షేర్లు 1శాతం మేర నష్టపోయాయి. అయితే ఒక్క కోల్ ఇండియా షేరు మాత్రం అరశాతం నష్టంతో ట్రేడ్ అవుతోంది.
You may be interested
డీహెచ్ఎఫ్ఎల్ 10 శాతం క్రాష్
Monday 5th August 2019దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్) షేర్లు సోమవారం ఉదయం ట్రేడింగ్ సెషన్లో కొన్ని ఏళ్ల కనిష్టానికి పతనమయ్యాయి. కంపెనీకి ఆడిట్ సేవలు అందించే డెల్లాయిట్ కంపెనీ బాధ్యతలనుంచి తప్పకున్నట్లు వార్తలు వెలుగులో రావడం ఇందుకు కారణమైంది. ఈ అంశంపై వివరణ కోరగా ఇరుసంస్థలు స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో నేడు డీహెచ్ఎఫ్ఎల్ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఉదయం ట్రేడింగ్ సెషన్లో దాదాపు 12.50శాతం నష్టపోయి రూ.40.85
సంవత్సరాల కనిష్ఠానికి టాటా మోటర్స్
Monday 5th August 2019టాటా మోటర్స్ షేరు విలువ సోమవారం ట్రేడింగ్‌లో సంవత్సరాల కనిష్ఠానికి పడిపోయింది. ఆటో సెక్టార్లో మందగమనంతో పాటు దేశియంగా డిమాండ్ తగ్గడంతో ఈ కంపెనీ షేరు గత కొన్ని సెషన్ల నుంచి నష్టాల్లోనే ట్రేడవుతోంది. ఈ స్టాకు సోమవారం ట్రేడింగ్‌లో ఉదయం 10.56 సమయానికి 5.32 శాతం నష్టపోయి, రూ. 123.75 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్లో రూ.130.70 వద్ద ముగిసిన ఈ షేరు, సోమవారం 128.20 వద్ద ప్రారంభమైంది. కొద్ది