News


కళతప్పిన మెటల్‌ షేర్లు

Friday 28th June 2019
Markets_main1561716601.png-26661

మార్కెట్‌ ట్రేడింగ్‌లో మెటల్‌ షేర్లు కళ తప్పాయి. శుక్రవారం నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1.50శాతం నష్టపోయింది. అమెరికా - చైనాల మధ్య వాణిజ్య యుద్ధ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఐరన్‌ ఓర్‌ ధరలు ఆకాశాన్నంటాయి. ఫలితంగా స్టీల్‌ మిల్స్‌ ప్రాఫిట్‌ మార్జిన్లు 50శాతం కంటే తక్కువగా నమోదు అయ్యాయి. ఐరన్‌ ఓర్‌ ధరల పెరుగుదల కంపెనీల ఆదాయాలు క్షీణించడంతో పాటు కంపెనీ షేర్ల ప్రదర్శన అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. దీంతో దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలైన ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 10శాతం వరకు నష్టపోయాయి. చైనా క్రూడ్‌ స్టీల్‌ ఉత్పత్తి మే నెలలో రికార్డు స్థాయిలలో నమోదు కావడం కూడా స్టీల్‌ కంపెనీలపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచి నుంచి మెటల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికిలోనయ్యాయి. నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1శాతానికి పైగా నష్టపోయి 2,979.90 వద్ద స్థిరపడింది. ఇండెక్స్‌లో అత్యధికంగా జిందాల్‌ స్టీల్‌ 4.50శాతం నష్టపోయింది. సెయిల్‌ 3శాతం, కోల్‌ ఇండియా 2.50శాతం, నాల్కో 2శాతం, వేదాంత, జేఎస్‌ఎల్‌ హిస్సార్‌ మెయిల్‌ షేర్లు 1.50శాతం క్షీణించాయి. అలాగే టాటాస్టీల్‌, హిందూస్ధాన్‌ కాపర్‌ షేర్లు 1శాతం పతనమయ్యాయి. మరోవైపు హిందూస్థాన్‌ కాపర్‌, వెల్‌స్పన్‌ కాపర్‌ షేర్లు అరశాతం నుంచి 1శాతం లాభపడ్డాయి.



You may be interested

కీలక మద్దతు దిగువన 285 షేర్లు

Friday 28th June 2019

బీఎస్‌ఈ500 స్టాకుల్లో దాదాపు 285 స్టాకులు తమ 200 రోజుల డీఎంఏ స్థాయికి దిగువన ట్రేడవుతున్నాయి. ఒకపక్క సూచీలు తమ గరిష్ఠాలకు దగ్గరగా ఉన్నా, ఇవి మాత్రం కోలుకోలేదు. ఇలా నేల చూపులు చూస్తున్న స్టాకుల్లో ఐటీసీ, మారుతీ, ఏసియన్‌పెయింట్స్‌, హిందుస్థాన్‌ జింక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎవెన్యూ సూపర్‌ మార్ట్స్‌, టెక్‌మహీంద్రా, డాబర్‌ఇండియా తదితరాలున్నాయి.  200 రోజుల డీఎంఏ దిగువన ట్రేడవుతున్న స్టాకుల్లో కొన్ని... కేవలం కొన్ని స్టాకుల బలంతోనే సూచీలు నిలబడుతున్నాయని,

ఫలితాల వాయిదా: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ 13.50శాతం డౌన్‌..!

Friday 28th June 2019

కంపెనీ త్రైమాసిక ఫలితాల విడుదల ప్రక్రియ వాయిదా పడటంతో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో 9శాతం నష్టపోయాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.82.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఈ జూన్‌ 29న శనివారం వెల్లడించాల్సిన గత ఆర్థిక సంవత్సరపు చివరి త్రైమాసిక ఫలితాలను జూలై 13కు వాయిదా వేస్తున్నట్లు కంపెనీ నేడు ఎక్చ్చేంజీలకు సమాచారం ఇచ్చింది. అడిట్‌ కమిటీ సభ్యులను నిర్థారించడానికి  కొందరు డైరెక్టర్లు​ అందుబాటులో లేకపోవడంతో

Most from this category