News


అటో, మెటల్‌ షేర్ల ర్యాలీ

Tuesday 29th October 2019
Markets_main1572332806.png-29203

మంగళవారంనాటి మార్కెట్‌ ర్యాలీని మెటల్‌, అటో షేర్లు ముందుండి నడిపిస్తున్నాయి. ఈ రంగ షేర్ల ర్యాలీ కారణంగా సూచీలు భారీ లాభాల్ని అర్జిస్తున్నాయి. మంగళవారం ఉదయం సెషన్‌లో ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 4శాతం లాభపడగా, అటో రంగషేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ 3.50శాతం పెరిగింది. అమెరికా చైనాల మధ్య మొదటి దశ ఒప్పంద చర్చలు సఫలీకృతమయ్యే దిశగా సాగుతుండంతో మెటల్‌ షేర్లకు కలిస్తోంది. ట్రేడ్‌వార్‌ కారణంగా గతఏడాది కాలం నుంచి మెటల్‌ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్న సంగతి తెలిసిందే. ఇక అటో షేర్ల విషయానికొస్తే... నవంబర్‌ 1న పలు వాహనరంగ కంపెనీలు అక్టోబర్‌ గణాంకాలు విడుదల చేయనున్నాయి. టాటామోటర్స్‌ షేర్ల భారీ ర్యాలీతో పాటు, దసరా, దీపావళి పండుగల సందర్భంగా వాహన అమ్మకాలు, పెరిగి ఉండవచ్చనే అంచనాలు అటో షేర్లకు డిమాండ్‌ను పెంచాయి. 
మెటల్‌ షేర్లు:- 
మెటల్‌ రంగ షేర్లలో ముఖ్యమైన టాటాస్టీల్‌ షేరు 8శాతం లాభపడింది. జిందాల్‌ స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌ షేర్లు 6శాతం, సెయిల్‌ 5శాతం, వేదాంత 4.50శాతం, ఎన్‌ఎండీసీ 4శాతం చొప్పున పెరిగాయి. హిందాల్కో, వెల్‌స్పన్‌ కార్ప్‌, కోల్‌ ఇండియా షేర్లు 2శాతం ర్యాలీ చేశౠయి. నాల్కో, మెయిల్‌, హిందూస్థాన్‌ జింక్‌, ఏపిల్‌ అపోలో, హిందూస్థాన్‌ కాపర్‌ షేర్లు 1శాత నుంచి అరశాతం పెరిగాయి. మధ్యాహ్నం గం.12:00లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(2,421.95)తో పోలిస్తే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 3.75శాతం లాభంతో 2,511.45 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
అటో షేర్లు:- 
టాటామోటర్స్‌ షేర్లు 17శాతం పెరిగాయి. మదర్‌సుమీ షేర్లు 11శాతం, అశోక్‌లేలాండ్‌, భాష్‌ లిమిటెడ్‌, ఎక్సైడ్‌ లిమిటెడ్‌ షేర్లు 5శాతం పెరిగాయి. ఎంఆర్‌ఎఫ్‌, ఎంఅండ్‌ఎం, భారతీ ఫోర్జ్‌, అపోలో టైర్స్‌, ఐషర్‌ మోటర్స్‌, టీవీఎస్‌ మోటర్స్‌ మారుతి సుజుతీ, అమర రాజా బ్యాటరీస్‌ షేర్లు 4శాతం నుంచి 2శాతం పెరిగాయి. బజాజ్‌ అటో, హీరోమోటోకార్ప్‌ షేర్లు 1.50శాతం లాభపడ్డాయి. మధ్యాహ్నం గం.12:00లకు నిఫ్టీ అటో ఇండెక్స్‌ క్రితం ముగింపు(8,102.00)తో పోలిస్తే 3.50శాతం లాభంతో 8,391.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది.  

 You may be interested

బ్యాంకు నిఫ్టీలో కాల్‌ బటర్‌ఫ్లై వ్యూహం బెటర్‌!

Tuesday 29th October 2019

ప్రధాన సూచీలతో పోలిస్తే ఇటీవల కాలంలో పేలవ ప్రదర్శన చూపుతున్న బ్యాంకు నిఫ్టీ క్రమంగా పాజిటివ్‌గా మారుతోంది. సూచీలోని ప్రధాన కంపెనీలు మంచి ఫలితాలు చూపుతుండడంతో బ్యాంకు నిఫ్టీలో బుల్స్‌ సందడి పెరిగింది. నిఫ్టీలో షార్ట్‌కవరింగ్‌, ఓపెన్‌ ఇంట్రెస్ట్‌లో తరుగుదల.. ఇవన్నీ మొత్తంమీద మార్కెట్లో పాజిటివ్‌ వాతావరణాన్ని చూపుతున్నాయి. బ్యాంకు నిఫ్టీలో 29-30 వేల మధ్య కాల్స్‌, పుట్స్‌, లాంగ్స్‌, షార్ట్స్‌ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా 29500 పాయింట్ల వద్ద

పలు మిడ్‌క్యాప్స్‌లో ఎంఏసీడీ బుల్లిష్‌ సంకేతాలు

Tuesday 29th October 2019

మార్కెట్‌ నిపుణులు ఒక నిర్దేశిత కౌంటర్లో ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. 9రోజుల ఎక్సోపోనెన్సియల్‌ మూవింగ్‌ యావరేజిని సిగ్నల్‌ లైన్‌గా పిలుస్తారు. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు

Most from this category