STOCKS

News


మయూర్‌, హాట్సన్‌ అప్‌- హావెల్స్‌, తేజాస్‌ డౌన్‌

Wednesday 22nd January 2020
Markets_main1579686017.png-31103

బడ్జెట్‌పై అంచనాలతో హుషారుగా ప్రారం‍భమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి అమ్మకాల ఒత్తిడిలో పడ్డాయి. మధ్యాహ్నం 2.45కల్లా సెన్సెక్స్‌ 228 పాయింట్లు పతనమై 41,096కు చేరగా.. నిఫ్టీ 69 పాయింట్లు క్షీణించి 12,201 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా మయూర్‌ యూనికోటర్స్‌, హాట్సన్‌ ఆగ్రో ప్రొడక్ట్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తుంటే.. మరోపక్క హావెల్స్‌ ఇండియా, తేజాస్‌ నెట్‌వర్క్స్‌ లిమిటెడ్‌ నష్టాలతో కళతప్పాయి. వివరాలు చూద్దాం.. 

మయూర్‌ యూనికోటర్స్‌
మధ్యప్రదేశ్‌లోని మొరెనాలో ఏర్పాటు చేసిన పాలీయుథిరేన్‌ తయారీ ప్లాంటు వాణిజ్య ప్రాతిపదికన కార్యకలాపాలు ప్రారంభించినట్లు మయూర్‌ యూనికోటర్స్‌ తాజాగా పేర్కొంది. పీయూ లెదర్‌, పీవీసీ లెదర్‌, సింథటిక్‌ తదితర పలు ప్రొడక్టుల తయారీ ఈ కంపెనీ ఫర్నీచర్‌, ఆటోమోటివ్‌, ఫుట్‌వేర్‌ తదితర రంగాలకు ప్రధానంగా సేవలు అందిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో మయూర్‌ యూనికోటర్స్‌ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 241 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 245 వరకూ ఎగసింది. 

హాట్సన్‌ ఆగ్రో ప్రొడక్ట్‌
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో హాట్సన్‌ ఆగ్రో ప్రొడక్ట్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 4.2 శాతం జంప్‌చేసి రూ. 647 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 670 వరకూ దూసుకెళ్లింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో హాట్సన్‌ ఆగ్రో స్టాండెలోన్‌ నికర లాభం 51 శాతం జంప్‌చేసి రూ. 28 కోట్లకు చేరింది. నికర అమ్మకాలు 16 శాతం పెరిగి రూ. 1340 కోట్లుగా నమోదయ్యాయి. నిర్వహణ లాభం​8 శాతం పుంజుకుని రూ. 30 కోట్లను తాకింది.

తేజాస్‌ నెట్‌వర్క్స్‌ లిమిటెడ్‌
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో తేజాస్‌ నెట్‌వర్క్స్‌ లిమిటెడ్‌ రివర్స్‌ టర్న్‌అరౌండ్‌ ఫలితాలు ప్రకటించింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో తేజాస్‌ నెట్‌వర్క్స్‌ రూ. 112 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2018-19) క్యూ3లో రూ. 33 కోట్ల నికర లాభం ఆర్జించింది. నికర అమ్మకాలు సైతం​53 శాతం క్షీణించి రూ. 87 కోట్లకు పరిమితమయ్యాయి. నిర్వహణ లాభం​రూ. 25 కోట్ల నుంచి రూ. 15 కోట్లను నీరసించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో తేజాస్‌ నెట్‌వర్క్స్‌ షేరు దాదాపు 8 శాతం పతనమై రూ. 83 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 82 వరకూ నీరసించింది. 

హావెల్స్‌ ఇండియా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో హావెల్స్‌ ఇండియా లిమిటెడ్‌ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో హావెల్స్‌ ఇండియా స్టాండెలోన్‌ నికర లాభం నామమాత్ర వృద్ధితో రూ. 200 కోట్లను తాకింది. గతేడాది(2018-19) క్యూ3లో రూ. 196 కోట్ల నికర లాభం ఆర్జిం చింది. నికర అమ్మకాలు సైతం​ 10 శాతం క్షీణించి రూ. 2269 కోట్లకు పరిమితమయ్యాయి. నిర్వహణ లాభం​8 శాతం వెనకడుగుతో రూ. 267 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో తొలుత ఎన్‌ఎస్‌ఈలో హావెల్స్‌ ఇండియా షేరు 5 శాతం పతనమై రూ. 588ను తాకింది. ఇది 52 వారాల కనిష్టంకాగా.. ప్రస్తుతం 2 శాతం నష్టంతో రూ. 604  వద్ద ట్రేడవుతోంది.  
 



You may be interested

ఎర్నింగ్స్‌ వృద్ధిపై యూబీఎస్‌ బుల్లిష్‌

Wednesday 22nd January 2020

విదేశీ నిధుల సహకారంతో 2021 డిసెంబర్‌ నాటికి నిఫ్టీలో 20 శాతం అప్‌మూవ్‌(బేస్‌ కేస్‌) ఉంటుందని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ యూబీఎస్‌ అంచనా వేసింది. ఐదేళ్ల తర్వాత నిఫ్టీ ఎర్నింగ్స్‌పై బుల్లిష్‌గా మారినట్లు తెలిపింది. ఎగుమతులు, విధాన నిర్ణయాలు, మూలధన వ్యయాలు, క్రెడిట్‌ గ్రోత్‌ అనే నాలుగు పారామీటర్ల ఆధారంగా ఎర్నింగ్స్‌పై బుల్లిష్‌గా మారామని తెలిపింది. ఇండియా ఏడేళ్ల నిరుత్సాహం తర్వాత వృద్ధి పరంగా సంధి కాలానికి చేరిందని తెలిపింది.

డివిడెండ్‌ ఈల్డ్‌తో మంచి షేర్లు గుర్తించగలమా?

Wednesday 22nd January 2020

ఈక్విటీపై రిటర్న్స్‌ రెండు రకాలుగా ఉంటాయి. ప్రైస్‌ రిటర్న్‌ మరియు ఆర్జించిన డివిడెండ్‌ రూపాల్లో ఆర్‌ఓఈ ఉంటుంది. షేర్‌హోల్డర్లకు ఇచ్చే నగదు చెల్లింపులను డివిడెండ్స్‌ అంటారు. బలమైన నగదు ప్రవాహం ఉన్న కంపెనీలు క్రమానుగతంగా డివిడెండ్స్‌ను ప్రకటిస్తుంటాయి. వార్షిక డివిడెండ్‌ చెల్లింపులను షేరు ధరతో భాగించి వందతో గుణిస్తే డివిడెండ్‌ ఈల్డ్‌(శాతం) వస్తుంది. ఉదాహరణకు ఒక కంపెనీ షేరు ధర రూ.100 అనుకుని, దాని డివిడెండ్‌ రూ.3 అనుకుంటే, ఆ కంపెనీ

Most from this category