News


అమ్మకాలు అంతంతే.. కానీ షేరులో జోరు

Monday 3rd June 2019
Markets_main1559557274.png-26068

టాటామోటర్స్‌, మారుతీ షేర్లపై విశ్లేషణ
మారుతీసుజుకీ గత ఏడేళ్లలో అత్యంత అధ్వాన్న అమ్మకాలను గత నెల నమోదు చేసింది. టాటామోటర్స్‌ సైతం ఇదే తరహాలో పేలవ విక్రయాలు చూపింది. కానీ సోమవారం మార్కెట్లో ఈ రెండు కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడయి ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచాయి. అయితే ఈ ర్యాలీకి ప్రధాన కారణం షార్ట్‌కవరింగ్‌ అని నిపుణులు అంచనా వేస్తున్నారు. విక్రయాలు పేలవంగా ఉండడంతో ఫ్యూచర్స్‌లో షార్ట్స్‌ ఎక్కువగా పోగయి ఉంటాయని, అందుకే సోమవారం వీటి కవరింగ్‌ జరిగిందని వీరి అంచనా. రాబోయే రోజుల్లో ఆర్‌బీఐ మరిన్ని రేట్‌కట్స్‌ ప్రకటించవచ్చని, అందువల్ల ఆటో విక్రయాలు మరింత ఊపందుకుంటాయని కొందరి అభిప్రాయం. ఆటో రంగంలో డౌన్‌ట్రెండ్‌ ముగింపునకు వచ్చిందని, వాల్యూంలు బాటమ్‌ అవుట్‌ అవుతున్నాయని కొంతమంది అనలిస్టులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ రెండు స్టాకులు ఇటీవల భారీ పతనాలను చవిచూసినందున గట్టి షార్ట్‌కవరింగ్‌ నమోదయిందని, అందుకే సోమవారం ఈ రెండూ దూసుకుపోయాయని అవెండాస్‌ క్యాపిటల్‌ సీఈఓ ఆండ్రూహ్యాలెండ్‌ అభిప్రాయపడ్డారు. ఇకపై ఈ రంగంలో మెరుగుదల ఉంటుందని మార్కెట్‌ భావిస్తోందన్నారు. కానీ ఆటో రంగంలో ఇంకా మరిన్ని డౌన్‌గ్రేడ్స్‌ ఉంటాయని, తొందరపడి ఇప్పుడే వీటి జోలికిపోవక్కర్లేదని చెప్పారు. భారీ పతనాల తర్వాత ఈ మాత్రం అప్‌మూవ్‌ ఉండడం సహజమన్నారు. ఆటో రంగంలో బలహీనత క్రమంగా ముగిసిపోవచ్చని, ఇలాంటి సమయాలను కొనుగోళ్లకు అవకాశంగా మలచుకోవాలని యాక్సిస్‌ క్యాపిటల్‌ పేర్కొంది. వచ్చే డిసెంబర్‌ నాటికి ఈ స్టాకుల్లో రికవరీ కనిపిస్తుందని సారధి గ్రూప్‌ అభిప్రాయపడింది. ముడిపదార్ధాల ధరలు తగ్గడం ఆటో కంపెనీల మార్జిన్లను బలోపేతం చేయవచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. 

 You may be interested

రికార్డుల ముగింపు

Monday 3rd June 2019

550 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ 190 పాయింట్లు ఎగసిన నిఫ్టీ స్టాక్‌ మార్కెట్లో సోమవారం రికార్డులు హోరెత్తిపోయాయి. ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీలు ఇంట్రాడేలో కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేయడం పాటు, ముగింపులోనూ రికార్డు స్థాయిలోనూ స్థిరపడ్డాయి. ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు, ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ బలపడటం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పతనంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా నూతనంగా ఏర్పటైన మోదీ 2.0 ప్రభుత్వం

మరికొంత కాలం ఇంతే!

Monday 3rd June 2019

జీడీపీపై దిగ్గజ బ్రోకరేజ్‌ల అంచనా భారత ఎకానమీ జీడీపీ అంచనాలను అంతర్జాతీయ బ్రోకరేజ్‌లు తగ్గించాయి. ఎకానమీలో మందగమనం కారణంగా ఆర్‌బీఐ కనీసం 25 బీపీఎస్‌ మేర రేట్లను తగ్గించవచ్చని అంచనా వేశాయి. 1. నోమురా: జీడీపీ క్యు4లో అంచనాలను అందుకోలేకపోయింది. అంతర్జాతీయ బలహీనత, దేశీయ ఇబ్బందులకు ఇది నిదర్శనం. కొత్త ఏడాది తొలి త్రైమాసికంలో కూడా ఈ బలహీనత కొనసాగవచ్చు. క్యు2 నుంచి బలహీనమైన రికవరీ ఉండొచ్చు. అందువల్ల కొత్త ఏడాది జీడీపీ

Most from this category