News


వాటా విక్రయ వార్తలతో మాక్స్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌ 15శాతం జంస్‌ ..!

Thursday 20th February 2020
Markets_main1582175029.png-31952

యాక్సిస్‌ బ్యాంక్‌ ఇన్సూరెన్స్‌ రంగానికి చెందిన మాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో 20శాతం వాటాకు మించి కొనుగోలు సిద్ధమైనట్లు వార్తలు వెలువడటంతో హోల్డింగ్‌ కంపెనీ మాక్స్‌ మాక్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెన్‌ షేరు గురువారం ఉదయం ట్రేడింగ్‌లో 15శాతం లాభపడింది. తాజా ఈక్విటీ షేర్ల జారీ ఇష్యూ ద్వారా ఈ కొనుగోలు ప్రక్రియ జరగనున్నట్లు తెలుస్తోంది. యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రస్తుతం మ్యాక్స్‌ లైఫ్‌లో కేవలం 2శాతం వాటాను కలిగి ఉంది. ఇప్పుడు రూ.2వేల కోట్ల పైగా పెట్టుబడులు పెట్టాలని భావిస్తుంది. వ్యూహాత్మక, ధీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని నిర్మించడటమే లక్ష్యంగా ఈ ఒప్పంద లక్ష్యమని విశ్లేషకులు చెబుతున్నారు. యాక్సిస్ బ్యాంక్‌తో చేసుకున్న ఒప్పందం బీమా సంస్థకు బ్యాంక్‌ అస్యూరెన్స్ భాగస్వామి గురించి అనిశ్చితిని తొలగిస్తుందని వారు తెలిపారు. వాటా విక్రయం ద్వారా సమకూరిన సొమ్మును మాక్స్‌ లైఫ్‌ విస్తరణ ప్రణాళికు వినియోగించుకోనుంది. ఈ వాటా విక్రయ వార్తలపై మాక్స్‌ లైఫ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌లు స్పందించేందుకు నిరాకరించాయి. 

ఎక్చ్సేంజీల్లో లిస్టైన మాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, దేశంలో అతిపెద్ద బ్యాంకుయేతర ప్రైవేట్ జీవిత బీమా సంస్థ మాక్స్ లైఫ్‌లో 70% వాటాను కలిగి ఉంది. జపాన్ మిత్సుయి సుమిటోమో ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ 26శాతం, యాక్సిస్ బ్యాంక్ 2శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది మిగిలి వాటా ఉద్యోగుల వద్ద ఉంది.

వాటా విక్రయ వార్తలతో మాక్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ షేరు గురువారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 15.71శాతం లాభపడింది. ఉదయం 10:20ని.లకు షేరు మునుపటి ముగింపు(516.45)తో పోలిస్తే 14శాతం లాభంతో రూ.589.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.370.00లు, రూ.597.60లుగా ఉన్నాయి. గడిచిన మూడు నెలల్లో ఈ షేరు 30శాతానికి పైగా ర్యాలీ చేశాయి. 

ఇదే సమయానికి యాక్సిస్‌ బ్యాంక్‌ కూడా 2శాతం లాభంతో రూ.748 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

నేటి వార్తల్లోని షేర్లు

Thursday 20th February 2020

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు సింప్లెక్స్‌ ఇన్‌ఫ్రా: సింప్లెక్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఈక్విటీని కొనేందుకు అదాని గ్రూపు చర్చలు జరుపుతోంది. మరికొన్ని ప్రైవేటు ఈక్విటీ ఇన్వెస్టర్లు కూడ సింప్లెక్స్‌ ఇన్‌ఫ్రాలో వాటా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముత్తూట్‌ ఫైనాన్స్‌: గోల్డ్‌ లోన్స్‌ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ముత్తూట్‌ ఫైనాన్స్‌ అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు బాండ్ల విక్రయం ద్వారా రూ.3,900 కోట్ల నిధులను  సమీకరించనుంది. బీపీసీఎల్‌: బీపీసీఎల్‌ను ప్రవేటీకరణ చేసినప్పటికీ ఉద్యోగాలలో

డాలర్‌ అప్‌- రూపాయి కుదేల్‌

Thursday 20th February 2020

ప్రారంభంలోనే నేలచూపు వరుసగా రెండో రోజు డీలా ఇటీవల బలహీనంగా కదులుతున్న దేశీ కరెన్సీ మరోసారి నేలచూపులతో ప్రారంభమైంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలరుతో మారకంలో ప్రారంభంలోనే రూపాయి 23 పైసలు నీరసించింది. 71.79 వద్ద మొదలైంది. 9.40 ప్రాంతంలో 22 పైసలు(0.33 శాతం) క్షీణించి 71.78 వద్ద ట్రేడవుతోంది. ఇది ఏడు వారాల కనిష్టంకాగా.. ఇంతక్రితం జనవరి 8న రూపాయి ఈ స్థాయిలో ట్రేడైనట్లు ఫారెక్స్‌ వర్గాలు తెలియజేశాయి. చత్రపతి శివాజీ

Most from this category