News


మారుతి జోరు

Friday 16th August 2019
Markets_main1565947709.png-27814

అటో రంగ షేర్ల రికవరిలో భాగంగా శుక్రవారం దేశీయ వాహన తయారీ దిగ్గజం మారుతి సుజుకీ కంపెనీ షేర్లు రాణిస్తున్నాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.5810.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ఆరంభం నుంచి మారుతి కంపెనీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక దశంలో 2.50శాతం లాభపడి రూ.5949.85 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. మధ్యాహ్నం గం.2:30ని.లకు ఇండెక్స్‌ గత క్రితం ముగింపు(రూ.5815.55)తో పోలిస్తే 2.25శాతం లాభంతో రూ.5947.45 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుస రూ.5447.00  రూ.9470.00లుగా నమోదయ్యాయి. భారత అటో పరిశ్రమలో తలెత్తిన సంక్షోభం, యెన్‌ మారక విలువల్లో రూపాయి బలహీనత  కారణంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి మారుతి సుజుకీ 20శాతానికి పైగా నష్టపోయింది. కమోడిటీ ధరలు పెరగడం, ఇతర దేశాల కరెన్సీల్లో రూపాయి బలహీనత, నెలవారీ అమ్మకాల క్షీణించడం, డిమాండ్‌ తగ్గడం తదితర అంశాలు దేశీయ అటో పరిశ్రమను అతలాకుతలం చేశాయి.



You may be interested

స్వల్పలాభంతో ముగింపు

Friday 16th August 2019

మార్కెట్‌ వారాంతాన్ని స్వల్ప లాభంతో ముగించింది. బ్యాంకింగ్‌, అటో రంగ షేర్ల ర్యాలీతో సెన్సెక్స్‌ 39 పాయింట్ల లాభంతో 37,350.33, నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 11,048 వద్ద ముగిసాయి. అంతర్జాతీయ మార్కె‍ట్ల నుంచి బలహీన సంకేతాలను అందుకున్న మార్కెట్‌ నేడు నష్టంతో మొదలైంది. ఒకదశలో సెన్సెక్స్‌  335 పాయింట్లు క్షీణించి 36,974 వద్ద, నిఫ్టీ 105 పాయింట్ల వరకు పతనమైన 10,924.30 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి.

కెనరా,పీఎన్‌బీ జంప్‌

Friday 16th August 2019

మార్కెట్లు శుక్రవారం నెగిటివ్‌గా ప్రారంభమయ్యి..లాభాల్లోకి మళ్లాయి. బ్యాంకింగ్‌ సెక్టార్‌ షేర్లు పెరగడం దీనికి దోహదపడుతోంది. కాగా మధ్యాహ్నాం 2.42 సమయానికి నిఫ్టీ ప్రభుత్వరంగ బ్యాంక్‌ సూచీ 1.41 శాతం లాభపడి 2,601.70 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో కెనరా బ్యాంక్‌ 4.57 శాతం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) 4.27 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 3.10 శాతం, యూనియన్‌ బ్యాంక్‌ 2.77 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా

Most from this category