News


మారుతీ నికర లాభం రూ. 1587 కోట్లు

Tuesday 28th January 2020
Markets_main1580200987.png-31270

క్యూ3లో 6.5 శాతం అధికం
5 శాతం పెరిగిన ఆదాయం

దేశీయంగా కార్ల తయారీలో అగ్రస్థానాన్ని వహిస్తున్న  మారుతీ సుజుకీ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో రూ. 1587 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 6.5 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం సైతం 5 శాతం పెరిగి రూ. రూ. 20,722 కోట్లకు చేరింది. వ్యయ నియంత్రణ, తగ్గిన కమోడిటీ ధరలు, కార్పొరేట్‌ పన్ను కారణంగా అమ్మకాల వ్యయాలు, తరుగుదల పెరిగినప్పటికీ పటిష్ట పనితీరును చూపగలిగినట్లు కంపెనీ తెలియజేసింది. కాగా.. సమీక్షా కాలం‍లో త్రైమాసిక ప్రాతిపదికన 29 శాతం అధికంగా  4.37 లక్షల యూనిట్ల వాహనాలను విక్రయించింది. వార్షికంగా చూస్తే అమ్మకాలలో 2 శాతం వృద్ధినే సాధించింది. ఇతర ఆదాయం రూ. 917 కోట్ల నుంచి రూ. 784 కోట్లకు నీరసించింది. నిర్వహణ లాభం రూ. 2102 కోట్లను తాకగా.. మార్జిన్లు 10.2 శాతంగా నమోదయ్యాయి.

షేరు డౌన్‌
ఫలితాల నేపథ్యంలో మారుతీ సుజుకీ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. మధ్యాహ్నం 2 ప్రాంతంలో ఎన్‌ఎస్‌ఈలో మారుతీ షేరు 1.2 శాతం క్షీణిం‍చి రూ. 7,065 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 7,220 వద్ద గరిష్టాన్ని తాకగా.. 7,040 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది.
 



You may be interested

కుటుంబ కల్లోలం..అమ్మకానికి గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌

Tuesday 28th January 2020

కెకె మోది గ్రూప్‌లో తల్లికొడుకుల మధ్య విభేదాలు విక్రయానికి లలిత్‌ మోదీ మొగ్గు సిగరెట్‌ తయారీ సంస్థ గాడ్‌ఫ్రేఫిలిప్స్‌ సహా ప్రముఖ పారిశ్రామికవేత్త కృష్ణకుమార్‌ మోదీ(కేకే మోదీ)కి చెందిన ఆస్తులన్నీ అమ్మకానికి పెట్టినట్లు ఆయన కుమారుడు లలిత్‌ మోదీ వెల్లడించారు. గాడ్‌ఫ్రేఫిలిప్స్‌ సంస్థ మాల్‌బొరో బ్రాండ్‌ పేరిట సిగిరెట్లు విక్రయిస్తుంది. ఇందులో కేకే మోదీగ్రూప్‌నకు 47.09 శాతం వాటా, ఫిలిప్‌ మోరిస్‌కు 25.1 శాతం వాటా ఉన్నాయి. మోదీ ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌ కృష్ణకుమార్‌

యునైటెడ్‌ స్పిరిట్స్‌13 శాతం జంప్‌

Tuesday 28th January 2020

యునైటెడ్‌ స్పిరిట్స్‌ విడుదల చేసిన క్యూ3 ఫలితాలు మెరుగ్గా ఉన్నందున, అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ క్రెడిట్‌ సూసీ అప్‌గ్రేడ్‌ చేయడంతో మంగళవారం యునైటెడ్‌ స్పిరిట్స్‌ షేరు భారీగా పెరిగింది.మధ్యహ్నం 1.30 గంటల ప్రాంతంలో 13 శాతం పెరుగుదలతో 649.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా ఆర్థిక సంవత్సరం-20 క్యూ3 ఫలితాల్లో కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 15.2 శాతం పెరిగి రూ.201.4 కోట్ల నుంచి రూ.231 కోట్లకు చేరింది. వార్షిక ప్రాతిపదికన

Most from this category