News


మారుతి 4శాతం ర్యాలీ

Friday 6th September 2019
Markets_main1567762991.png-28240

రెండు రోజుల వరుస పతనం అనంతరం మారుతి సుజుకీ ఇండియా శుక్రవారం ట్రేడింగ్‌లో లాభాల పట్టాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.6000.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. టయోటా సుషో ఇండియా కార్పోరేషన్‌ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్లాంట్‌పై మాతృ సంస్థ టయోటా సుషో ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్‌లకు ఉమ్మడి నియంత్రణకు యూరోపియన్ కమిషన్ క్లియరెన్స్‌ ఇచ్చింది. ఈ సానుకూల వార్తలతో నేడు ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఈ షేర్లుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒకదశలో 3.50శాతం ర్యాలీ చేసి రూ.6174.00 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదుచేసింది. మధ్యాహ్నం గం.3:00లకు షేరు కిత్రం ముగింపు ధర(రూ.5970.3)తో పోలిస్తే 3.20శాతం లాభంతో రూ.6160.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆర్థిక మాంద్యం కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా ఆటో ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లు సంస్థలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో హర్యానాలోని గురుగ్రామ్‌, మనేసర్‌ ప్లాంట్లలో రెండు రోజులు ఉత్పత్తిని ఆపేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ నెల 7, 9 తేదీల్లో ఉత్పత్తి ఉండబోదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గత రెండు రోజుల్లో ఈ కంపెనీ షేర్లు  సుమారు 6శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. ఇ‍క షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసుగా రూ.5447.00 రూ.8960.00లుగా నమోదయ్యాయి.



You may be interested

ఎకానమీ కన్నా ముందే మార్కెట్లో రికవరీ!

Friday 6th September 2019

తుషార్‌ ప్రధాన్‌  నిజ ప్రపంచానికి సంబంధించి జరగబోయే అంశాలను స్టాక్‌ మార్కెట్లు కాస్త ముందుగానే గ్రహించి అందుకు తగ్గట్లే ప్రవర్తిస్తుంటాయని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. స్టాక్‌ మార్కెట్లు ఆయా అంశాలను డిస్కౌంట్‌ చేసేదాన్ని బట్టి సదరు అంశం పాజిటివ్‌గా ఉండొచ్చా? నెగిటివ్‌గా ఉండొచ్చా? అనేది చాలామార్లు గుర్తించవచ్చు. అందుకే స్టాక్‌మార్కెట్లను లీడింగ్‌ ఇండికేటర్లు అంటుంటారు. ఇందుకు తగ్గట్లే ఈ సారి కూడా ఎకానమీ కన్నా ముందే మార్కెట్లలో రికవరీ వస్తుందని హెచ్‌ఎస్‌బీసీ

డీఎల్‌ఎఫ్‌ 7శాతం డౌన్‌..!

Friday 6th September 2019

ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీతో సంబంధాలున్నాయనే ఆరోపణలను ఖండించినప్పటికీ.., రియల్లీ దిగ్గజం కంపెనీ డీఎల్‌ఎఫ్‌ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో 7శాతం క్షీణించాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.159.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఇండియన్‌ బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ పిల్‌లో ఇండియన్‌బుల్స్‌ గ్రూప్‌తో  డీఎల్‌ఎఫ్‌కు వున్న సంబంధాలు తెరపైకి వచ్చాయి. ఈ ఆరోపణలు గత కొన్ని నెలల క్రితం కూడా వ్యాపించాయి. డీఎల్‌ఎఫ్ గ్రూప్

Most from this category