STOCKS

News


24% తగ్గిన మారుతి అమ్మకాలు

Tuesday 1st October 2019
Markets_main1569910604.png-28651

దేశీయ అతిపెద్ద కార్ల తయారి సంస్థయిన మారుతి సుజుకి ఇండియా సెప్టెంబర్‌ నెల అమ్మకాలు విశ్లేషకుల అంచనాల కంటే తగ్గాయి. ఈ కంపెనీ సెప్టెంబర్‌ నెలలో 1.22 లక్షల యూనిట్లను విక్రయించగా, గత ఏడాది ఇదే నెలలో 1.62 లక్షల యూనిట్ల విక్రయాలను నమోదుచేసింది. మొత్తంగా గత ఏడాది సెప్టెంబర్‌ నెలతో పోల్చుకుంటే ఈ సెప్టెంబర్‌లో మారుతి అమ్మకాలు 24.4 శాతం పడిపోవడం గమనార్హం. కానీ తక్కువ బేస్‌ కారణంగా జులై నెలతో పోల్చుకుంటే, సెప్టెంబర్‌ నెలలో అమ్మకాలు 15.2 శాతం పెరిగాయి. కాగా ఈ కంపెనీ అమ్మకాల సంఖ్య 1.26 లక్షల యూనిట్లుగా నమోదవుతుందని జపాన్‌ బ్రోకరేజి సంస్థ నోమురా అంచనావేసింది. 
  మారుతి సుజుకి దేశీయ అమ్మకాలు సెప్టెంబర్‌లో 24.8 శాతం తగ్గి 1.15 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయని, ఎగుమతులు 17.8 శాతం తగ్గి 7,188 యూనిట్లుగా  నమోదయ్యాయని కంపెనీ తెలిపింది. కానీ అగష్టు నెలతో పోల్చుకుంటే సెప్టెంబర్‌లో 19 శాతం అమ్మకాలు పెరగడం గమనార్హం. ఏడాది ప్రాతిపదికన ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 31.5 శాతం తగ్గి 78,979 యూనిట్లకు చేరుకోగా, ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు 27.1 శాతం తగ్గాయి. అయితే తేలికపాటి వాణిజ్య వాహనాల అమ్మకాలు 0.4 శాతం పెరిగాయి. అదేవిధంగా సెప్టెంబరులో మినీ కార్ సెగ్మెంట్ అమ్మకాలు (ఆల్టో, ఎస్-ప్రెస్సో) 42.6 శాతం, కాంపాక్ట్ కార్ల అమ్మకాలు (న్యూ వాగన్ఆర్, సెలెరియో, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్) 22.7 శాతం తగ్గాయి. యుటిలిటీ వాహన అమ్మకాలు (ఎర్టిగా, ఎక్స్ఎల్ 6, విటారా బ్రెజ్జా ) 0.5 శాతం పడిపోయాయి(ఏడాది ప్రాతిపదికన). 
  నెలవారీ ప్రాతిపదికన అమ్మకాలు మెరుగుపడడంతో మారుతి సుజుకి షేరు ఉదయం 11.41 సమయానికి 1.6 శాతం లాభపడి రూ. 6,807.00 వద్ద ట్రేడవుతోంది.



You may be interested

ఈ షేర్లలో ఎంఏసీడీ బేరిష్‌ సంకేతాలు!

Tuesday 1st October 2019

దేశీయ సూచీల్లో సోమవారం ముగింపు ప్రకారం 156 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బేరిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా నెగిటివ్‌గా  మారిన కంపెనీల్లో హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటర్స్‌, హీరోమోటోకార్‌‍్ప, టాటాపవర్‌, ఐబీ హౌసింగ్‌, ఐబీ వెంచర్స్‌, థామస్‌ కుక్‌, కాడిలా హెల్త్‌కేర్‌, ఆర్‌క్యాప్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, అదానీ గ్యాస్‌ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో

2 నెలల కనిష్టానికి పసిడి

Tuesday 1st October 2019

అమెరికా మార్కెట్లో నిన్నరాత్రి డాలర్‌ బలపడటం, ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ, ఈల్డ్‌ పుంజుకోవడం లాంటి కారణాలతో ప్రపంచమార్కెట్లోని పసిడి ధర 2నెలల కనిష్టానికి పతమనమైంది. అక్కడి మార్కెట్‌ ముగిసే సరికి ఔన్స్‌ పసిడి ధర 33.50డాలర్లు నష్టపోయి 1,472.90 వద్ద స్థిరపడింది. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర అరశాతం స్వల్ప నష్టంతో 1,472.45 వద్ద ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ పుంజుకోవడం పసిడి ధరకు ప్రతికూలంగా మారింది.

Most from this category