STOCKS

News


అంచనాల్ని మిం‍చిన మారుతి ఫలితాలు...పెరిగిన షేరు

Friday 26th July 2019
Markets_main1564135615.png-27339

  • కానీ 27 శాతం క్షీణించిన లాభాలు

మారుతి సుజుకి జూన్‌ త్రైమాసికంలో మార్కెట్ల అంచనాల కంటే మెరుగైన పనితీరును కనబరిచింది. ఈ కంపెనీ శుక్రవారం మధ్యాహ్నం తన జూన్‌ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలు వెల్లడికాకముందు రూ.5,700 దిగువకు పడిపోయిన మారుతి సుజుకి షేరు...ఫలితాల వెల్లడి తర్వాత 2.5 శాతం లాభంతో రూ. 5,900పైకి ఎగబాకింది. చివరకు ఎన్‌ఎస్‌ఈలో 0.85 శాతం లాభంతో రూ. 5,805 వద్ద ముగిసింది. తక్కువ అమ్మకాల పరిమాణం, అధిక తరుగుదల ఖర్చు,  ముడి ఉత్పత్తుల ధరల పెరగడం వంటి అంశాల కారణంగా మారుతి సుజుకి (ఏడాది నుంచి ఏడాది ప్రాతిపదికన) స్టాండ్‌ఎలోన్‌ లాభాలలో అంతక్రితం ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 27.33 శాతం తగ్గుదలను నమోదు చేసింది. ఈ లాభాలు రూ.1,435.50 కోట్లుగా ఉండగా,  విశ్లేషకులు అంచనా వేసిన రూ. 1,350 కోట్ల కంటే అధికంగా ఉండడం గమనర్హం. త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన తర్వాత కంపెనీ షేరు విలువ 0.96 శాతం లాభపడి రూ.5,812 వద్ద ట్రేడవుతోంది(సాయంత్రం 3.06 సమయానికి).

మారుతి సుజుకి మొదటి త్రైమాసిక ఫలితాలలో ముఖ్యమైన అంశాలు:
ఇతర ఆదాయాలు: జూన్ త్రైమాసికంలో మారుతి సుజుకి ఇతర ఆదాయాలు 207.72 శాతం పెరిగి రూ .834.40 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో రూ. 271.80 కోట్లను నమోదు చేసింది. 
ఆదాయం: టాప్‌లైన్(ఆదాయం) గత ఏడాది ఇదే కాలంలో నమోదు చేసిన రూ .22,459.40 కోట్లతో పోలిస్తే 12.19 శాతం క్షీణించి రూ .19,719.80 కోట్లకు చేరుకుంది.
విక్రయాలు: ఈ త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు 17.9 శాతం తగ్గి మొత్తం 4,02,594 వాహనాలుగా నమోదైంది.  దేశీయ మార్కెట్లో అమ్మకాలు 19.3 శాతం తగ్గి 3,74,481 యూనిట్లుగా, ఎగుమతులు 28,113 యూనిట్లుగా ఉన్నాయి.
ఈబీఐటీడీఏ, మార్జిన్లు: ఈ త్రేమాసికంలో ఈబీఐటీడీ(వడ్డీ, పన్ను, తరుగుదల, రుణ విమోచన ముందు ఆదాయాలు) రూ.1,955 కోట్లుగా ఉంటుందని విశ్లేషకుల అంచనా వేయగా అది రూ.2,047.80 కోట్లుగా నమోదైంది. మార్జిన్లు సంవత్సరానికి 450 బేసిస్ పాయింట్లు పడిపోయి 10.40 శాతంగా నమోదయ్యాయి. 
మొత్తం వ్యయం: జూన్‌ త్రైమాసికంలో కంపెనీ వ్యయం రూ .18,645.30 కోట్లకు తగ్గింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వ్యయం రూ.19,848.80 కోట్లుగా ఉంది. ఉద్యోగుల ప్రయోజన ఖర్చులు 12.27 శాతం పెరిగి రూ .859.10 కోట్లకు చేరుకుంది. తరుగుదల, రుణ విమోచన ఖర్చులు గత ఏడాది ఇదే కాలంలో రూ .719.80 కోట్లుగా ఉండగా ఈ త్రైమాసికంలో రూ. 918.60 కోట్లకు పెరిగాయి.

 You may be interested

బజాజ్‌ ఫిన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ 7 శాతం జంప్‌

Friday 26th July 2019

ఫైనాన్స్‌ రంగంలో సేవలు అందిస్తున్న బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ కంపెనీల షేర్ల ధరలు శుక్రవారం 7.50శాతం లాభడ్డాయి. క్రితం రోజు వెలువడిన క్యూ1 ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించడం ఇందుకు కారణమైంది.  బజాజ్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.3,046.50ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. త్రైమాసిక ఫలితాలు ఇన్వెస్టర్లను మెప్పించడంతో ఇంట్రాడేలో షేర్లు 9.50శాతం లాభపడి రూ.3278ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. మార్కెట్‌ ముగిసే సరికి షేరు గతముగింపు ధర(రూ.3,046.50)తో

గార్గ్‌ ఆకస్మిక బదిలీ... వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు

Friday 26th July 2019

న్యూఢిల్లీ: ఆర్థిక శాఖ కార్యదర్శి పదవిలో ఉన్న సుభాష్‌చంద్రగార్గ్‌(58)ను కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుండి విద్యుత్‌ శాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో ప్రస్తుతం పెట్టుబడులు, ప్రజా ఆస్తుల విభాగం (దీపమ్‌) కార్యదర్శిగా ఉన్న అతను చక్రవర్తిని నియమించింది. బుధవారం రాత్రి ఈ ఆదేశాలు జారీ చేయడంతో గురువారం గార్గ్‌ అనూహ్య నిర్ణయం ప్రకటించారు. స్వచ్చంద పదవీ విరమణకు (వీఆర్‌ఎస్‌)కు దరఖాస్తు చేసుకోవడంతోపాటు ఈ ఏడాది అక్టోబర్‌ 31 ఉద్యోగిగా

Most from this category