News


నవంబర్‌లో పెరిగిన ఉత్పత్తి : మారుతి షేరు జోరు

Monday 9th December 2019
Markets_main1575869509.png-30127

నవంబర్‌లో వాహనాల ఉత్పత్తిని పెరగడంతో దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకీ షేరు సోమవారం ట్రేడింగ్‌లో 2.50శాతం ర్యాలీ చేసింది. ఈ నవంబర్‌ లో మొత్తం వాహనాల ఉత్పత్తి 1,41,834 యూనిట్లుగా నమోదైనట్లు కంపెనీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. అంతక్రితం ఏడాది నవంబర్‌లోని 1,35,946 యూనిట్లతో పోల్చితే ఈసారి ఉత్పత్తి 4.33 శాతం అధికం. ఇదే నవంబర్‌లో మొత్తం మొత్తం 1.39లక్షల ప్యాసింజర్‌ వాహనాలు ఉత్పత్తి జరిగిందని, గతేడాది నవంబర్‌లో జరిగిన 1.34 లక్షల వాహనాల ఉత్పత్తితో పోలిస్తే ఇది 3.67శాతం అధికమని కంపెనీ తెలిపింది. మినీ, కాంపాక్ట్‌ విభాగంలోని అల్టో, న్యూ వేగనార్‌, క్లారియో, ఇగ్నీస్‌, స్విఫ్ట్‌, బాలినో, డిజైన్‌ వాహనాల ఉత్పత్తి అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 6.5శాతం అధికంగా వృద్ధిని 1.02 లక్షలుగా నమోదైంది. అంతకు ముందు ఏడాదిలో ఇదే విభాగంలో 95, 883 వాహనాల ఉత్పత్తి జరిగింది.  వాహనాల ఉత్పత్తి పెరగడంతో కంపెనీ షేరుకు భారీగా డిమాండ్‌ నెలకొంది. దీంతో ఉదయం మారుతి షేరు సోమవారం బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.7000.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. సెషన్‌లో షేరు ఒకదశలో 3.30శాతం వరకు లాభపడి రూ.7105.85 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.10:45ని.లకు షేరు కిత్రం ముగింపు ధర రూ.6881.35తో పోలిస్తే 3.11శాతం లాభంతో రూ.7095 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.5447.00లు, రూ.7929.00లుగా నమోదయ్యాయి. 



You may be interested

బ్యాంకింగ్‌ షేర్లలో రికవరీ

Monday 9th December 2019

సోమవారం నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన బ్యాంకింగ్‌ రంగ షేర్లకు నెమ్మదిగా కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. దీంతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ లాభాల్లోకి మళ్లింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ నేడు 31,341.55 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇండెక్స్‌ ఉదయం సెషన్‌లో 0.70శాతం(119 పాయింట్లు) నష్టపోయి 31122.05 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.

టారిఫ్‌ పెంపు అనంతరం టెలికం షేర్లు కొనొచ్చా?

Monday 9th December 2019

టారిఫ్‌ల పెంపు ప్రకటనల అనంతరం టెలికం రంగంలో టర్నెరౌండ్‌ ఉంటుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్లే టెలికం షేర్లు టారిఫ్‌ల పెంపు ప్రకటన అనంతరం మంచి ర్యాలీ జరిపాయి. ఈ నేపథ్యంలో టెలికం షేర్లలో ఎంటర్‌ కావచ్చా? కొంత కరెక‌్షన్‌ కోసం చూడాలా? అని రిటైల్‌ మదుపరి సందేహ పడుతుంటాడు. ఈ అంశంపై నిపుణుల సలహాలు ఇలా ఉన్నాయి... టెలికం చార్జీల పెంపునకు స్పెక్ట్రం బకాయిల చెల్లింపు గడువు పెంచడం.. కంపెనీలకు

Most from this category