STOCKS

News


రూ. 7,000 పైకి మారుతి

Tuesday 24th September 2019
Markets_main1569298677.png-28511

కేం‍ద్ర ప్రభుత్వం, దేశీయ కంపెనీలపై విధిస్తున్న కార్పోరేట్‌ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. ఈ చర్యను ప్రభుత్వం ప్రకటించిన తర్వాత నుంచి దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు భారీస్థాయిలో ర్యాలీ చేశాయి. డిమాండ్‌ తగ్గడంతో పాటు లిక్విడిటీ కొరత వలన భారీ స్థాయిలో దిద్దుబాటుకు గురయిన దేశీయ వాహన కంపెనీలు తిరిగి పుంజుకోడం ప్రారంభించాయి. ఈ దశలో గత రెండు సెషన్‌లలో మారుతీ సుజుకీ షేరు భారీగా ర్యాలీ చేసింది. ఈ షేరు మంగళవారం ట్రేడింగ్‌లో కూడా 3 శాతం లాభపడి ప్రారంభమైంది. మారుతి సుజుకీ ఎన్‌ఎస్‌ఈ మంగళవారం ట్రేడింగ్‌లో రూ. 7000 మార్కును అధిగమించడం గమనార్హం. ఉదయం 9.36 సమయానికి ఈ షేరు 2.87 శాతం లాభపడి రూ. 7,096.00 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 6,897.85 వద్ద ముగిసిన ఈ షేరు, మంగళవారం ట్రేడింగ్‌లో రూ. 6,935.00 వద్ద ప్రారంభమైంది. రూ. 7,177.90 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది.



You may be interested

ఇండియన్‌ బ్యాంకు కస్టమర్లకు మ్యాక్స్‌బూపా పాలసీలు

Tuesday 24th September 2019

న్యూఢిల్లీ: ప్రముఖ బీమా సం‍స్థ మ్యాక్స్‌బూపా, ప్రభుత్వరంగంలోని ఒకానొక అతిపెద్ద ఇండియన్‌ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా ఇండియన్‌ బ్యాంకు పరిధిలోని 4 కోట్ల ఖాతాదారులకు సమగ్ర వైద్య బీమా ఉత్పత్తులను ఆఫర్‌ చేయనున్నట్టు మ్యాక్స్‌బూపా ప్రకటించింది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా భిన్నమైన వైద్య బీమా ఉత్పత్తులను అందుబాటులోకి తేనున్నట్టు తెలిపింది. 

ఆటో అమ్మకాలకు ఒరిగేదేమీ లేదు

Tuesday 24th September 2019

కార్పొరేట్‌ పన్ను కోతపై జెఫరీస్‌ నివేదిక ప్రభావం పరిమితమేనని అభిప్రాయం ముంబై: కార్పొరేట్‌ పన్నును కేంద్ర ప్రభుత్వం ఒకేసారి గణనీయంగా తగ్గించినప్పటికీ... భారీగా పడిపోయిన ఆటోమొబైల్‌ వాహన డిమాండ్‌ పునరుద్ధరణపై పరిమిత ప్రభావమే ఉంటుందని బ్రోకరేజీ సంస్థ జెఫరీస్‌ అభిప్రాయపడింది. కంపెనీలపై 10-12 శాతం పన్నును తగ్గించడం వల్ల అంతిమంగా 1-2 శాతం వరకే ఉత్పత్తులపై తగ్గింపునకు అవకాశం ఉంటుందని ఈ సంస్ధ తన నివేదికలో పేర్కొంది. దీనికి బదులు ప్రభుత్వం జీఎస్‌టీ

Most from this category