News


నష్టాల్లో మారుతి, బజాజ్‌ ఆటో

Wednesday 4th September 2019
Markets_main1567573939.png-28175

దేశ జీడీపీ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్టానికి పడిపోవడంతో పాటు, తగ్గిన వాహన విక్రయాలు వలన దేశియ ఆటోరంగ షేర్లు  బుధవారం సెషన్‌లో నష్టాల్లో ట్రేడవుతున్నాయి. హెవివెయిట్‌ షేర్లయిన  మారుతి 1.32 శాతం  (ఉదయం 10.29 సమయానికి),  బోచ్‌ లి. 1.07 శాతం, ఐషర్‌ మోటర్స్‌ 0.58 శాతం, బజాజ్‌ ఆటో 0.26 శాతం, ఎంఆర్‌ఎఫ్‌ 0.09 శాతం నష్టపోవడంతో నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ 0.82 శాతం కోల్పోయి 6,841.20 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో ఇతర షేర్లయిన  అపోలో టైర్స్‌ 2.14 శాతం, హీరో మోటర్‌ కార్ప్‌ 0.63 శాతం, మదర్‌ సుమీ 0.11 శాతం, భారత్‌ ఫోర్జ్‌ 0.01 శాతం లాభపడి ట్రేడవుతుండగా, అశోక్‌ లేలాండ్‌ 4.13 శాతం, టాటా మోటర్స్‌ 3.95 శాతం, టీవీఎస్‌ మోటర్స్‌ 1.26 శాతం,  అమర్‌రాజా బ్యాటరీస్‌ 0.69 శాతం, మహింద్రా అండ్‌ మహింద్రా (ఎం అండ్‌ ఎం) 0.49 శాతం, ఎక్సైడ్‌ ఇండియా 0.17 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి.  



You may be interested

స్థిరంగా పసిడి ధర

Wednesday 4th September 2019

ఆర్థిక మాంద్య భయాలతో నిన్నటి రోజు ఆరేళ్ల గరిష్టస్థాయిని అందుకున్న పసిడి ధర బుధవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. నేడు ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 2డాలర్ల స్వల్ప లాభంతో 1,559 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా, చైనాల మధ్య ఎలాంటి ఒప్పందం కుదరపోవడం, యూరోజోన్‌లో బ్రెగ్జిట్‌ అనిశ్చితి పసిడికి మద్దతుగా నిలుస్తున్నాయి.   బ్రిటన్‌లో బోరిస్‌ జాన్సన్‌ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయింది. నో డీల్‌ బ్రెగ్జిట్‌పై పార్లమెంటు ఓటింగ్‌ జరగడానికి

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 4th September 2019

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  టాటా కమ్యూనికేషన్స్‌:- ఐఓటీ సర్వీస్‌ల కొరకు నీకో గ్లోబల్‌ ఐసీటీ సర్వీస్‌ సంస్థ తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  గుజరాత్‌ అపోలో ఇండస్ట్రీస్‌:- తన అనుబంధ సంస్థ ఏఈఎంల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ జాయింట్‌ వెంచర్‌ కంపెనీలో తన మొత్తం వాటాను విక్రయించింది.  సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా:- వాహన, గృహ రుణాలకు రెపో లింక్డ్ వడ్డీ రేటును ప్రవేశపెట్టింది  ఫ్యూచర్‌ మార్కెట్‌ నెట్‌వర్క్స్‌:- నాగపూర్‌, జార్ఖండ్‌లో లాజిస్టిక్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌

Most from this category