News


దీపావళి వరకు మెరుపుల్లేవు!

Monday 8th July 2019
Markets_main1562565268.png-26892


మార్కెట్‌పై నిపుణుల అంచనా
దేశీయ మార్కెట్లు బడ్జెట్‌ అనంతరం నిట్టనిలువునా పతనమైతున్నాయి. ఈ పతనం మరికొన్ని నెలలు కొనసాగవచ్చని, బడ్జెట్లో ఎకానమీ రికవరీపై స్పష్టత లేకపోవడం మార్కెట్‌కు నచ్చలేదని, మరోవైపు కన్జూమర్‌ సెంటిమెంట్‌ వేగంగా క్షీణిస్తోందని ఒక సర్వేలో పాల్గొన్న మార్కెట్‌వర్గాలు అభిప్రాయపడ్డాయి. కనీస పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ నిబంధనల్లో రాబోయే మార్పు మరికొన్నాళ్లు కంపెనీలను ఇబ్బంది పెడుతుందని అంచనా వేశారు. ఎన్‌బీఎఫ్‌సీలకు ప్రకటించిన సాయం పెద్దగా సరిపోదని, ఈ రంగంలో లిక్విడిటీ సమస్యలు తీరేందుకు సరైన చర్యలు లేవని తెలిపారు. దేశీయ మార్కెట్లు, వాటి భవితవ్యంపై జరిపిన సర్వేలో ‍ప్రముఖ మనీ మేనేజర్లు దాదాపు 20 మంది పాల్గొన్నారు. వచ్చే దీపావళి వరకు నిఫ్టీలో అప్‌మూవ్‌ చాలా పరిమితంగా ఉంటుందని వీరు అంచనా వేస్తున్నారు. 


దీపావళినాటికి..
- నిఫ్టీ 12500- 13000 పాయింట్ల రేంజ్‌లో ఉంటుందని సర్వేలో 18 శాతం మంది అంచనా వేశారు.
- నిఫ్టీ 12000- 12500 పాయింట్లకు చేరుతుందని 27 శాతం మంది పేర్కొన్నారు.
- 18 శాతం మంది నిఫ్టీ 11500- 12000 పాయింట్ల వద్ద ఉంటుందని తెలిపారు.
- 27 శాతం మంది నిఫ్టీ 11200- 11500 పాయింట్ల రేంజ్‌లో ఉండొచ్చన్నారు.
- కేవలం 10 శాతం మంది మాత్రమే నిఫ్టీ 13000 పాయింట్లను చేరుతుందని అభిప్రాయపడ్డారు. 


 



You may be interested

భూషణ్‌ స్టీల్స్‌ ఫ్రాడ్‌: పీఎన్‌బీ 10శాతం క్రాష్‌

Monday 8th July 2019

భూషణ్‌ స్టీల్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీ రూ.3,800 కోట్ల మేర మోసానికి పాల్పడిందనే విషయం వెలుగులోకి రావడంతో ప్రభుత్వరంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు షేర్లు 11.19 శాతం క్షీణించాయి. నేడు బీఎస్‌లో పీఎన్‌బీ షేర్లు రూ.76.30ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అకౌంట్‌ బుక్‌లో అవకతవకలకు పాల్పడి కన్షారియం బ్యాంకుల నుంచి రుణాలు పొందిన భూషణ్‌ స్టీల్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీ రుణాలను పక్కదారి మళ్లించినట్లు పీఎన్‌బీ ఆరోపించింది. మాకు అందిన

లార్జ్‌క్యాప్‌లో సుదీర్ఘ అనుభవం

Monday 8th July 2019

హెచ్‌డీఎఫ్‌సీ టాప్‌ 100... ఈక్విటీ మార్కెట్లలో రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. రాబడులు కూడా అలానే ఉంటాయి మరి. అయితే, ఈక్విటీల్లో రిస్క్‌ కొంత తక్కువ ఉండాలనుకునే వారికి లార్జ్‌క్యాప్‌ విభాగం అనుకూలం. లార్జ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారి ముందున్న ఎంపికల్లో హెచ్‌డీఎఫ్‌సీ టాప్‌ 100 మ్యూచువల్‌ ఫండ్‌ పథకం కూడా ఒకటి. ఈ పథకానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. మార్కెట్‌ పతనాలను ఎన్నింటినో చూసి ఉన్నది. రాబడుల విషయంలో మంచి ట్రాక్‌

Most from this category