News


మార్కెట్లు అలసిపోయాయా..?

Monday 10th February 2020
Markets_main1581274415.png-31632

నిఫ్టీలో గత శుక్రవారం కనిపించిన స్థిరీకరణ సోమవారం నాటి సెషన్‌లో ముగియవచ్చని జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ టెక్నికల్‌ అనలిస్ట్‌ మిలాన్‌ వైష్ణవ్‌ తెలిపారు. నిఫ్టీ శుక్రవారం వెనుదిరిగే ప్రయత్నం చేసినప్పటికీ 50 డీఎంఏ అయిన 12,118 వద్ద నిరోధం ఎదుర్కొన్నట్టు చెప్పారు. సూచీలకు 12,050-12,120 కీలక నిరోధ స్థాయిలుగా తెలిపారు. నిఫ్టీకి సోమవారం 12,120-12,615 నిరోధాలుగా పనిచేస్తాయని తెలిపారు. అదే విధంగా 12,035-11,980 వద్ద మద్దతు స్థాయిలు ఉన్నట్టు చెప్పారు. ఆర్‌ఎస్‌ఐ కూడా డైలీచార్ట్‌లో తటస్థంగానే ఉందని, ఎటువంటి వైరుధ్యం చూపలేదన్నారు. డైలీ ఎంఏసీడీ బేరిష్‌గా ఉందన్నారు. సాంకేతిక అంశాలను గమనిస్తే నిఫ్టీ పుల్‌బ్యాక్‌ ప్రస్తుత స్థాయిల్లో ఆగిపోవచ్చని, మొత్తం మీద మార్కెట్లు అలసిపోయినట్టుగా కనిపిస్తున్నాయని, ఈ లక్షణాలు వచ్చే సెషన్లలో కనిపించొచ్చన్నారు. నిఫ్టీకి గరిష్ట స్థాయిల్లో అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని అంచనా వేశారు. మార్కెట్లు ఎగువవైపు ర్యాలీ చేస్తే, లాభాలను కాపాడుకోవవాలని సూచించారు. ప్రస్తుత దశలో అతిగా పెరిగే స్టాక్స్‌ వెంట పరుగెత్తడం మంచిది కాదన్నారు. స్టాక్‌ వారీగా విధానాన్ని అనుసరించాలని సూచించారు.

 

‘‘ఆర్‌బీఐ మానిటరీ పాలసీ ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే విధంగా సానుకూలంగా ఉన్నప్పటికీ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగియడం కరోనా వైరస్‌ ప్రభావం వల్లే. ఇది ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది’’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు. నిఫ్టీ-50 12,160 స్థాయిలకు దిగువన ఈ వారం ట్రేడ్‌ కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ను సూచించడం సెల్‌ సంకేతమని, సమీప కాలంలో బేర్స్‌కు అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. ‘‘వృద్ధి రికవరీకి సంబంధించి బలమైన సంకేతాలు కనిపించేంత వరకు మార్కెట్లు పరిమిత శ్రేణిలోనే కొనసాగొచ్చు. కరోనా వైరస్‌ వ్యాప్తిని గమనించాల్సి ఉంటుంది. వృద్ధి పరంగా మంచి అవకాశాలున్న కంపెనీల ప్రీమియం వ్యాల్యూషన్‌ కొనసాగొచ్చు’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్దార్థ ఖేమ్కా తెలిపారు.You may be interested

ఆధార్‌ ఉంటే ఇన్‌స్టంట్‌గా పాన్‌

Monday 10th February 2020

కొత్తగా పాన్‌ కార్డు తీసుకోవాలనుకుంటున్న వారికి శుభవార్త. ఇందుకోసం ఫిజికల్‌గా లేదా ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ను నింపడం, దానికోసం పుట్టిన తేదీ ధ్రువీకరణ, ఇతర ఆధారాలు సమర్పించాల్సిన శ్రమ ఇకపై ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆధార్‌ కార్డు ఉంటే చాలు.. పాన్‌కార్డ్‌ ఇన్‌స్టంట్‌గా జారీ అయిపోతుంది. ఆధార్‌ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికీ ఇన్‌స్టంట్‌గా పాన్‌ కార్డు జారీ అవుతుందని పొరపడొద్దు. పాన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారికేనని అర్థం చేసుకోవాలి. ఈ

లోకల్‌ ఓకే.. కరోనానే రిస్క్‌..!

Monday 10th February 2020

బడ్జెట్‌ ముగిసింది. డిసెంబర్‌ క్వార్టర్‌ కంపెనీల ఫలితాల విడుదల సీజన్‌ కూడా చివరి దశకు చేరింది. అమెరికా-చైనా మధ్య వాణిజ్యం విషయంలో డీల్‌ కుదరగా, అమెరికా ఉత్పత్తులపై పెంచిన టారిఫ్‌లను చైనా కొంత మేర తగ్గించడం కూడా జరిగిపోయింది. దేశీయంగా ప్రతికూల వార్తలేవీ ఇప్పటికైతే లేవు. అంతర్జాతీయంగానూ పరిస్థితులు ఆశావహంగా మారుతున్న రుణంలో కరోనా వైరస్‌ వెలుగు చూసింది. ఇప్పుడు ఈ వైరస్‌ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ

Most from this category