News


మార్కెట్లు ముందుకా.. వెనక్కా..?

Sunday 18th August 2019
Markets_main1566140043.png-27840

ఈక్విటీ మార్కెట్లు గత వారం కాస్త నిలదొక్కుకున్నాయి. నిఫ్టీ కీలకమైన 11,000 మార్క్‌పైన, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 37,000పైనే క్లోజవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక రంగ ఉద్దీపనకు పలు చర్యలను ప్రకటించొచ్చని, పలు రంగాలకు రాయితీలు ఉంటాయని, ఎఫ్‌పీఐలకు సర్‌చార్జీ మినహాయింపు ఉండొచ్చన్న అంచనాలే గత వారం మార్కెట్‌ను కుదురుకునేలా చేశాయి. ఈ నేపథ్యంలో ఈ వారం మార్కెట్‌ ఎలా ఉంటుందోనన్న సందేహం ఇన్వెస్టర్లలో నెలకొంది. దీనిపై యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ అండ్‌ డెరివేటివ్‌ రీసెర్చ్‌ హెడ్‌ రాజేష్‌ పాల్వియా తన అభిప్రాయాలను తెలియజేశారు. 

 

‘‘గత శుక్రవారం మధ్యాహ్నం తర్వాత మార్కెట్లు కొంత పెరగడం మేలు చేసింది. మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఉద్దీపనకు ప్రభుత్వం చర్యలను ప్రకటిస్తుందని ట్రేడర్లు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. రంగాల వారీ ట్రెండ్‌ మిశ్రమంగా ఉంది. నిఫ్టీ బ్యాంకు, ఆటో సూచీలు 0.7 శాతం, 1.15 శాతం చొప్పున పెరగ్గా, ఫార్మా, ఐటీ, మెటల్‌ స్టాక్స్‌ నష్టాల పాలయ్యాయి. సెన్సెక్స్‌ 37,350, నిఫ్టీ 11,047 వద్ద క్లోజయ్యాయి. డైలీ చార్ట్‌ల్లో నిఫ్టీ డోజీ ప్యాటర్న్‌ ఏర్పాటు చేసింది. చార్ట్‌ ప్యాటర్న్‌ను చూస్తే నిఫ్టీ 11,000ను క్రాస్‌ చేసి పైనే క్లోజయింది. ఇది కొనుగోళ్లకు దారితీసి తదుపరి 11,200-11,260 దిశగా తీసుకెళుతుంది. ఒకవేళ నిఫ్టీ 10,900ను బ్రేక్‌ చేస్తే అమ్మకాలు ఒత్తిడి పెరిగి తదుపరి సూచీ 10,800-10,750 వరకు వెళుతుంది’’ అని రాజేష్‌ పాల్వియా తెలిపారు. 

 

నిఫ్టీ ఇండెక్స్‌ 20, 50, 100, 200 డీఎంఏలకు దిగువన ట్రేడవుతోందని, ఇది స్వల్ప కాలానికి నెగెటివ్‌ ధోరణిని తెలియజేస్తోందన్నారు రాజేష్‌. నిఫ్టీ-50 ఇండెక్స్‌ 11,250-10,900 శ్రేణిలో సానుకూలంగా ఈ వారం ట్రేడ్‌ కావొచ్చని అంచనా వేశారు. ‘‘నిఫ్టీ బ్యాంకు 28,217 వద్ద క్లోజయింది. కీలకమైన పైవట్‌ స్థాయి, (సూచీకి కీలకమైన మద్దతు స్థాయి) 27,874.9 వద్ద ఉంది. ఆ తర్వాత మద్దతు స్థాయి 27,532.8. ఎగువ వైపున 28,405, 28,593.2 కీలక నిరోధాలుగా పనిచేస్తాయి’’అని రాజేష్‌ వివరించారు. 



You may be interested

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Monday 19th August 2019

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల ప్రభావంతో భారత్‌ స్టాక్‌ సూచీలు సోమవారం గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 135 పాయింట్లు జంప్‌చేసి 37,485 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 47 పాయింట్ల పెరుగుదలతో 11,095 పాయింట్ల వద్ద ఆరంభమయ్యింది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ 3 శాతం లాభాలతోనూ, టైటాన్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌,  సన్‌ఫార్మాలు 1-2 శాతం మధ్య లాభాలతోనూ ట్రేడింగ్‌ ప్రారంభించాయి. మరోవైపు టాటా మోటార్స్‌, యూపీఎల్‌, బ్రిటానియా,

ఆరు స్టాక్స్‌లో ఫండ్స్ భారీ పెట్టుబడులు

Sunday 18th August 2019

జూలై నుంచి మార్కెట్లు తీవ్ర అమ్మకాల ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగడం తెలిసిందే. దేశీయ ఇనిస్టిట్యూషన్స్‌ (మ్యూచువల్‌ పండ్స్‌, బీమా సం‍స్థలు) కొనుగోళ్లు మార్కెట్లను కొంత వరకైనా ఆదుకున్నాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ ముఖ్యంగా నిఫ్టీలో అధిక వెయిటేజీ కలిగిన స్టాక్స్‌పై భారీగా పెట్టుబడులు పెట్టడం గమనార్హం.    ఎడెల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ నివేదిక ప్రకరాం... జూలైలో లార్జ్‌క్యాప్‌, ఫోకస్డ్‌, మిడ్‌క్యాప్‌, స్మాల్‌ పథకాల్లోకి రూ.6,000 కోట్ల

Most from this category