News


డిసెంబర్‌కల్లా కొత్త గరిష్ఠాలకు సూచీలు

Thursday 24th October 2019
Markets_main1571912412.png-29117

  భారీగా పడిపోయిన దేశీయ మార్కెట్లు తిరిగి పుంజుకుంటున్నాయని, కానీ దిగువ స్థాయిల వద్ద మందగమనం కొనసాగుతుండడంతో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాకులు, లార్జ్‌ క్యాప్‌లను మించి ప్రదర్శన చేస్తాయని ఆశించడం మరీ దూకుడైన ఆలోచనవుతుందని సామ్కో సెక్యురిటీస్‌​ వ్యవస్థాపకుడు, సీఈఓ జిమిత్‌ మోదీ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. వ్యవస్థలో వినియోగం పుంజుకుంటుందని, కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు చర్య వలన కంపెనీల మూల ధన వ్యయం పెరుగుతుందని తెలిపారు. ఫలితంగా డిసెంబర్‌ నాటికి దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలు కొత్త గరిష్ఠాలను తాకుతాయని అంచనావేశారు. అంతేకాకుండా మార్కెట్లో బుల్‌రన్‌ ప్రారంభమైందని, బుల్స్‌... మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌లలో కూడా తమ ప్రభావాన్ని విస్తరిస్తున్నారన్నారు. కానీ తాజాగా వచ్చిన ఐపీఓలకు అధిక సానుకూలత రావడంతో పాటు, డిజిన్వెస్ట్‌ పక్రియను ప్రభుత్వం వేగంగా ముందుకు తీసుకువెళ్లడంతో మార్కెట్లు కొంత ఒత్తిడికిలోనయ్యే అవకాశం ఉందని తెలిపారు. అంతేకాకుండా రక్షణాత్మకమైన స్టాకులను ఎంచుకోవడం మంచిదని సలహాయిచ్చారు. ‘స్టాండ్‌ ఎలోన్‌ స్టాకులను ఎంచుకోవడం కంటే రక్షణాత్మకంగా ఉండే స్టాకులను ఎంచుకోవడం మంచిది. విభిన్నమైన స్టాకులు రిస్క్‌ను తగ్గిస్తాయి. హిందుస్తాన్‌ యూనిలీవర్‌, నెస్లే, యూనిటెడ్‌ స్పిరిట్స్‌, కొల్గేట్‌, అబాటో​ ఇండియా వంటి టాప్‌ ఎంఎన్‌సీ ఇండియా స్టాకులను ఎంచుకోవడం ఉత్తమం’ అని వివరించారు.  ప్రభుత్వం మరికొన్ని చర్యలను తీసుకునే అవకాశం ఉందని జిమిత్‌ మోడీ అంచనావేస్తున్నారు. ‘రానున్న ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశంలో వడ్డీరేట్లు మరో 25 బీపీఎస్‌(బేసిస్‌ పాయింట్లు) వరకు తగ్గే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ద్రవ్యోల్బణం అదుపులో ఉండడంతో ఆర్‌బీఐ కూడా ఈ వైఖరిని తీసుకునే అవకాశ ఉంది. వీటితో పాటు ప్రభుత్వం ఆటో సెక్టార్‌కు సంబంధించి స్ర్కాపేజి పాలసీని తీసుకొచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ రంగం పుంజుకుంటుంది. బడ్జెట్‌ 2020లో జీఎస్‌టీ రేట్ల తగ్గింపు, డిజిన్వెస్ట్‌మెంట్‌ వంటి చర్యలు ప్రభుత్వ ఎజెండాలో ఉన్నాయి’ అని వివరించారు.



You may be interested

స్వల్పనష్టంతో ముగింపు

Thursday 24th October 2019

ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిపలాడిన సూచీలు చివరికి నష్టంతో ముగిశాయి. సెన్సెక్స్‌ 38 పాయింట్ల నష్టంతో 39,020 వద్ద స్థిరపడింది, నిఫ్టీ 22 పాయింట్ల క్షీణతతో 11600 దిగువున 11,582.40 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ.., నేడు రెండో రోజూ దేశీయ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెషన్‌లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక దశలో సెన్సెక్స్‌ 269 పాయింట్ల లాభపడి  39,327.15,  నిఫ్టీ 65

టెల్కోలకు సుప్రీం కోర్టు షాక్‌..!

Thursday 24th October 2019

టెలికమ్యూనికేషన్ విభాగం నిర్దేశించిన విధంగా అడ్జెస్టెట్‌ గ్రాస్‌ రెవెన్యూ (ఏజీఆర్‌) నిర్వచనాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో గురువారం ట్రేడింగ్‌లో టెలికాం కంపెనీల (టెల్కోలు) షేర్లు భారీ నష్టాన్ని చవిచూశాయి. స్పెక్ట్రమ్‌ వినియోగ ఛార్జీలు, ఇతర టెలికాం సంబంధిత ఆదాయాల ద్వారా సమకూరిన స్థూల ఆదాయం నుంచి కొంత శాతం టెలికాం కంపెనీలు...టెలికాం శాఖకు చెల్లించాలన్న వివాదం 14 సంవత్సరాలుగా కోర్టుల్లో నలుగుతోంది. కొన్ని సేవలపైనే వచ్చే ఆదాయాన్ని ఏజీఆర్‌గా పేర్కొంటూ వాటిపైనే లెవీలు

Most from this category