News


ఒడిదొడుకుల మధ్య స్వల్ప లాభాలతో సరి

Thursday 16th January 2020
Markets_main1579170356.png-30970

ఇంట్రాడేలో రికార్డ్‌ గరిష్టాలకు మార్కెట్లు
నష్టాల బాటలో మెటల్‌ ఇండెక్స్‌ 

స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య ఊగిసలాడిన దేశీ స్టాక్‌ మార్కెట్లు ఇంట్రాడేలో మరోసారి సరికొత్త గరిష్టాలను తాకాయి. ఆద్యంతం ఒడిదొడుకుల మధ్య కదిలి చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 60 పాయింట్లు బలపడి 41,932 వద్ద నిలవగా.. నిఫ్టీ 13 పాయింట్లు పుంజుకుని 12,356 వద్ద స్థిరపడింది. అయితే ట్రేడింగ్‌ ప్రారంభంలో సెన్సెక్స్‌ 42,059 వరకూ ఎగసింది. తద్వారా తొలిసారి 42,000 పాయింట్ల మైలురాయిని అధిగమించగా.. నిఫ్టీ సైతం 12,389 వద్ద(ఇంట్రాడే) రికార్డ్‌ గరిష్టాన్ని తాకింది. తదుపరి అమ్మకాలు పైచేయి సాధించడంతో సెన్సెక్స్‌ 41,812 వరకూ నీరసించగా.. నిఫ్టీ 12,316 వరకూ క్షీణించింది. బుధవారం అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కారానికి వీలుగా తొలి దశ ఒప్పందం కుదిరిన కారణంగా అమెరికా స్టాక్‌ ఇండెక్సులు చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. అయితే దేశీయంగా బడ్జెట్‌ నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ ఇండెక్స్‌ మాత్రమే(1.3 శాతం) వెనకడుగు వేసింది. మిగిలిన రంగాలలో ప్రధానంగా మీడియా, రియల్టీ, ఫార్మా, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ 1.4-0.3 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐషర్‌, నెస్లే, జీ, కొటక్‌ బ్యాంక్‌, ఎయిర్‌టెల్‌, హెచ్‌యూఎల్‌, బ్రిటానియా, ఆర్‌ఐఎల్‌, పవర్‌గ్రిడ్‌, యస్‌ బ్యాంక్‌ 4.3-1 శాతం మధ్య ఎగశాయి. అయితే ఎన్‌టీపీసీ, ఇన్‌ఫ్రాటెల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, గెయిల్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, హీరో మోటో, టాటా మోటార్స్‌, బీపీసీఎల్‌, టెక్‌ మహీంద్రా 2.3-1.4 శాతం మధ్య నీరసించాయి.  

అపోలో జూమ్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో అపోలో హాస్పిటల్స్‌, పేజ్‌, మణప్పురం, ముత్తూట్‌, సన్‌ టీవీ, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌ 6-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఎన్‌బీసీసీ, హెచ్‌పీసీఎల్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, అరబిందో ఫార్మా, టాటా ‍గ్లోబల్‌, ఆయిల్‌ ఇండియా 2.4-2 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మార్కెట్లను మించుతూ మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.8 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1487 లాభపడగా.. 1067 నష్టాలతో ముగిశాయి.

అమ్మకాలవైపు.. డీఐఐలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 279 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 648 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. ఇక మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 205 కోట్లు, డీఐఐలు రూ. 642 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.  You may be interested

ఎయిర్‌పోర్టు బిజినెస్‌లో వాటా విక్రయించనున్న జీఎంఆర్‌!

Thursday 16th January 2020

టాటా గ్రూప్‌ ఎంటీటీకి సొంతం కానున్న 49 శాతం వాటా న్యూఢిల్లీ: ప్రముఖ వ్యాపార దిగ్గజ కంపెనీ జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తన వాటాలో కొంత భాగాన్ని విక్రయించనుంది. గురువారం తన ఎయిర్‌పోర్టు బిజినెస్‌లో 49 శాతం వాటాను టాటా గ్రూప్‌ కంపెనీ ఎంటీటీ టీఆర్‌ఐఎల్‌ అర్బన్‌ ట్రాన్స్‌పోర్ట్‌కు అమ్మనున్నట్లు జీఎంఆర్‌ వెల్లడించింది. అనేక వ్యాపారాలు కలిగి ఉన్న జీఎంఆర్‌ గ్రూప్‌ ఎయిర్‌పోర్ట్‌ బిజినెస్‌లోలో 44.44 శాతం వాటాను విక్రయిస్తున్నట్లు గతంలో ప్రకటించిన

15వేల బ్యాంకు శాఖల ఏర్పాటుకు కేంద్రం ఆదేశం

Thursday 16th January 2020

దేశంలో అందరికీ బ్యాంకింగ్‌ సేవల్ని విస్తరించేందుకు కేంద్రం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అందులో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా 15వేల కొత్త శాఖల్ని ఏర్పాటు చేయాలని బ్యాంకింగ్‌ రంగ దిగ్గజాలను కోరినట్లు తెలుస్తోంది. బ్యాంకింగ్ సదుపాయాలు అందుబాటులో లేని గ్రామాల్లో ప్రతి 15 కిలోమీటర్ల పరిధిలో ఒక కొత్త బ్రాంచ్‌ను ఏర్పాటు చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఇప్పటికే ఏయే ప్రాంతాల్లో  శాఖల్ని ఏర్పాటు చేయాలనే అంశంపై తుది జాబితా

Most from this category