News


మరో కొత్త రికార్డు ముగింపు

Tuesday 14th January 2020
Markets_main1578997726.png-30926

సెన్సెక్స్‌, నిఫ్టీ సరికొత్త గరిష్టాలకు
ఇంట్రాడేలో 42,000 సమీపానికి సెన్సెక్స్‌
12,374 వద్ద నిఫ్టీ ఇంట్రాడే గరిష్టం
ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ వెనకడుగు

అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరనున్న పరిస్థితులు అటు అమెరికా ఇండెక్సులతోపాటు..ఇటు దేశీ స్టాక్‌ మార్కెట్లకు జోష్‌నిస్తున్నాయి. దీంతో సోమవారం అమెరికా మార్కెట్లు సరికొత్త రికార్డులను సాధించగా.. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌, నిఫ్టీ చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. సెన్సెక్స్‌ 93 పాయింట్లు పెరిగి 41,953 వద్ద నిలవగా.. నిఫ్టీ 33 పాయింట్లు పుంజుకుని 12,362 వద్ద స్థిరపడింది. అంతేకాకుండా ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 41,994 వద్ద, నిఫ్టీ 12,374 వద్ద సరికొత్త గరిష్టాలను తాకాయి. అయితే రోజంతా మార్కెట్లు స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేట్‌ అయ్యాయి. ఇటీవల మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతుండటంతో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. 

మీడియా, ఎఫ్‌ఎంసీజీ జోరు
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మీడియా, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, ఆటో, ఫార్మా 2-0.5 శాతం మధ్య బలపడ్డాయి.బ్యాంక్‌ నిఫ్టీ 0.35 శాతం డీలాపడింది. నిఫ్టీ దిగ్గజాలలో వేదాంతా, బ్రిటానియా, హీరో మోటో, ఐటీసీ, సిప్లా, జీ, నెస్లే, ఎంఅండ్‌ఎం, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌ 3-1.25 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్‌లో యస్‌ బ్యాంక్‌ 8.3 శాతం కుప్పకూలగా.. ఇండస్‌ఇండ్‌ 4 శాతం పతనమైంది. ఈ బాటలో యూపీఎల్‌, ఆర్‌ఐఎల్‌, ఎస్‌బీఐ, కొటక్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, టాటా మోటార్స్‌ 1-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. కాగా.. మీడియా కౌంటర్లలో టీవీ 18 బ్రాడ్‌క్యాస్ట్‌ 16 శాతం దూసుకెళ్లగా.. నెట్‌వర్క్‌ 18, డీబీ కార్ప్‌, టీవీ టుడే, సన్‌ టీవీ, ఐనాక్స్‌, బాలాజీ టెలి, జాగరణ్‌, డిష్‌ టీవీ 5-1 శాతం మధ్య పురోగమించాయి.

టాటా గ్లోబల్‌ జూమ్‌
డెరివేటివ్‌ స్టాక్స్‌లో టాటా గ్లోబల్‌ 10 శాతంపైగా దూసుకెళ్లగా.. బెర్జర్‌ పెయింట్స్‌, అరబిందో, ఎస్కార్ట్స్‌, పేజ్‌ ఇండస్ట్రీస్‌, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌, టాటా కెమికల్స్‌, నాల్కో, సెంచురీ టెక్స్‌, ఎక్సైడ్‌ 5-3 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే మరోపక్క శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌, జిందాల్‌ స్టీల్‌, మదర్‌సన్‌ సుమీ, ఐబీ హౌసింగ్‌, పీఎఫ్‌సీ, మ్యాక్స్‌ ఫైనాన్స్, ఐసీఐసీఐ ప్రు, జస్ట్‌ డయల్‌ 4-1.3 శాతం మధ్య వెనకడుగు వేశాయి. ఇక.. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.7 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1468 లాభపడగా.. 1035 మాత్రమే నష్టపోయాయి. 

స్వల్ప కొనుగోళ్లు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 68 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 47 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా.. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 578 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 252 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి.  You may be interested

‘విస్తృత భాగస్వామ్యంతోనే ర్యాలీ’

Tuesday 14th January 2020

బాగా క్షీణించిన స్టాక్స్‌ మళ్లీ ఈ ధరల్లో లభించవేమోనన్న భయం (ఫోమో)తో వినియోగ రంగంలోని స్టాక్స్‌ కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు ఆరాట పడుతుండొచ్చని క్యాపిటల్‌మైండ్‌ వ్యవస్థాపకుడు దీపక్‌షెనాయ్‌ అభిప్రాయపడ్డారు. చాలా స్టాక్స్‌ ఇప్పటికీ ర్యాలీ మొదలు పెట్టాల్సి ఉందన్నారు. మార్కెట్‌ ర్యాలీ అర్థవంతంగా ఉండాలంటే అది విస్తృత భాగస్వామ్యంతో ఉండాలన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై తన అభిప్రాయాలు తెలియజేశారు.    ప్రైవేటు బ్యాంకుల్లో వీటికి ప్రాధాన్యం.. సిటీ యూనియన్‌ బ్యాంకు,

భౌతిక బంగారం కంటే సావరిన్‌ బాండ్లే ఉత్తమం..!

Tuesday 14th January 2020

సంపద సముపార్జనలో లాభం కంటే ముందు భద్రత ముఖ్యం. అని భావించేవారు సాధారణంగా బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి వాతావరణంలో బంగారంలో పెట్టుబడులు మరింత పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భౌతిక బంగారం కంటే సావరిన్‌ పసిడి బాండ్లు అధిక రాబడినిస్తున్న కారణంగా ఈ బాండ్ల కొనుగోలుకు ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా సావరిన్‌ బాండ్ల ధరలు ఇటీవల రికార్డు స్థాయిని అందుకున్నాయి.  సావరిన్‌ పసిడి బాండ్ల 2019-20

Most from this category