News


రోజంతా హెచ్చుతగ్గులు...ఫ్లాట్‌ ముగింపు

Tuesday 9th July 2019
Markets_main1562669037.png-26931

రెండు రోజుల భారీ పతనం అనంతరం మార్కెట్‌ మంగళవారం ఫ్లాట్‌గా ముగిసింది. ట్రేడింగ్‌ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు చివరకు అక్కడక్కడే క్లోజయ్యాయి.  సెన్సెక్స్‌ 10 పాయింట్ల లాభంతో 38,731 వద్ద, నిఫ్టీ 3పాయింట్ల నష్టంతో 11,556 వద్ద స్థిరపడ్డాయి. ఫార్మా, ప్రభుత్వరంగ బ్యాంక్‌, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఆర్థిక, మీడియా మెటల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 321 పాయింట్ల స్థాయిలో 38,435.87 - 38,814.23 పాయింట్ల మధ్య ట్రేడైంది. నిఫ్టీ 121 పాయింట్లు రేంజ్‌లో 11,461.00 - 11,582.55 స్థాయిలో కదలాడింది. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 35 పాయింట్ల నష్టంతో 30,569.15 వద్ద స్థిరపడింది.
నేడు మార్కెట్‌ వరుసగా 3రోజూ నష్టాలతో మొదలైంది. అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాలు, ముడిచమరు ధరల పెరుగుదలు, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత తదితర ప్రతికూలాంశాలతో మార్కెట్‌లో నేడు కూడా అమ్మకాల పర్వం కొనసాగింది. ఒకదశలో సెన్సెక్స్‌ ఒకదశలో 285 పాయింట్లు క్షీణించి 38,435.87 వద్ద స్థాయికి చేరుకోగా, నిఫ్టీ  91 పాయింట్లను కోల్పోయి 11,461.00 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. మిడ్‌సెషన్‌ అనంతరం కనిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు పూనుకోవడటం, ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు దిగవడంతో సూచీలు కనిష్టస్థాయిల నుంచి రికవరి బాట పట్టాయి. గత రెండు రోజులుగా భారీగా నష్టపోయిన మధ్య, చిన్నతరహా షేర్లలో రికవరీ ఎక్కువగా కన్పించింది. అలాగే ఇండెక్స్‌ల్లో అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎల్‌ అండ్‌ టీ, బజాజ్‌ ఫిన్‌ సర్వీసెస్‌ షేర్ల ర్యాలీ సూచీలకు దన్నుగా నిలిచాయి. రూపాయి రివకరి కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచింది. ఫలితంగా సెన్సెక్స్‌  కనిష్టస్థాయి(38,435.87) నుంచి 379 పాయింట్లు లాభపడి 38,814.23 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. మరో ప్రధాన సూచీల నిఫ్టీ డే కనిష్టం(11,461.00) నుంచి 121 పాయింట్లు పెరిగి 11,582.55 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. అయితే చివరి అరగంటలో మార్కెట్లో మరోసారి అమ్మకాలు నెలకొనడంతో సూచీలు లాభాలు హరించుకుపోయి మిశ్రమంగా ముగిశాయి. 
బజాజ్‌ఫిన్‌సర్వీసెస్‌, హీరోమోటోకార్ప్‌, సన్‌ఫార్మా, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐఓసీ షేర్లు 3శాతం నుంచి 6శాతం వరకు లాభపడగా, హెచ్‌సీఎల్‌ టెక్‌, గెయిల్‌, టీసీఎస్‌, యూపీఎల్‌, టైటాన్‌ షేర్లు 2శాత నంచి 12శాతం నష్టపోయాయి.You may be interested

ఆరు నెలల వరకు రాబడులు ఆశించొద్దు..!

Tuesday 9th July 2019

మార్కెట్లో సెంటిమెంట్‌ చాలా బలహీనంగా ఉందన్నారు ప్రముఖ మార్కెట్‌ నిపుణులు, కేఆర్‌ చోక్సే ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ ఎండీ దేవేన్‌ చోక్సే. బడ్జెట్‌లో ప్రభుత్వం పేర్కొన్న వాటి అమలు సాధ్యమేనా అన్న విషయమై మార్కెట్‌కు సందేహాలున్నట్టు చెప్పారు. సమీప కాలంలో కంపెనీల ఎర్నింగ్స్‌ ఆశాజనకంగా ఉంటాయన్నది అనుమానమేనన్నారు. వృద్ధి తక్కువగా ఉంటే లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో దిద్దుబాటు జరగొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ

ఈ రంగాలు బలహీనం!

Tuesday 9th July 2019

క్యు1 ఫలితాలపై సిటీ గ్రూప్‌ అంచనాలు పేలవ ఆటో విక్రయాలు, బలహీన మెటల్‌, ఎనర్జీ కంపెనీల ఫలితాలు.. తొలి త్రైమాసిక ఫలితాలను నీరుగారుస్తాయని సిటీ గ్రూప్‌ అంచనా వేస్తోంది. క్యు1లో బ్యాంకులు మంచి పనితీరు కనబరిచినా, ఆటో, మెటల్స్‌, ఎనర్జీ రంగాలు నిరాశపరుస్తాయని అభిప్రాయపడింది. తాము పర్యవేక్షించే 150 పైచిలుకు కంపెనీల ఉమ్మడి క్యు1 ఫలితాల ఎర్నింగ్స్‌ వృద్ధి గతేడాదితో పోలిస్తే 3 శాతం మాత్రమే అధికంగా ఉండొచ్చని పేర్కొంది. క్యు1లో

Most from this category