News


నేడు మార్కెట్లకు సెలవు

Tuesday 8th October 2019
Markets_main1570515446.png-28772

విజయదశమి సందర్భం‍గా మంగళవారం(అక్టోబర్‌ 8) మార్కెట్లకు సెలవు దినం. నేడు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు పనిచేయవు. వీటితోపాటు ఫారెక్స్‌ మార్కెట్‌ కూడా పనిచేయదు. కమోడిటీ ఎక్చ్సేంజ్‌లో మాత్రం సాయంత్రం 5గం.లకు ట్రేడింగ్‌ ప్రారంభవుతోంది. స్టాక్‌ మార్కెట్‌ తిరిగి యథావిధిగా బుధవారం (9న) ప్రారంభమవుతుంది. కాగా గత సెషన్‌ చివరిలో ఫార్మా, మెటల్‌, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఆర్థిక, రియల్టీ షేర్లలో అమ్మకాలు ఒత్తిడి కొనసాగడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా ఆరో రోజు కూడా నష్టపోయాయి. నిఫ్టీ 48 పాయింట్లు నష్టపోయి 11,126 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 141 పాయింట్లు పతనమై 37,532 పాయింట్ల వద్ద ముగిశాయి. ​ 



You may be interested

బలపడిన డాలర్‌..నష్టాల్లో బంగారం

Tuesday 8th October 2019

యుఎస్‌-చైనా వాణిజ్య చర్చలకు ముందు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్‌లు పాజిటివ్‌గా ట్రేడవ్వడంతోపాటు, ప్రధాన కరెన్సీలతో పోల్చుకుంటే డాలర్‌ బలపడడంతో వరుసగా మూడవ సెషన్లో కూడా బంగారం ధరలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. విదేశీ మార్కెట్లో ట్రేడయ్యే బంగారం ఫ్యూచర్స్‌  0.6 శాతం పడిపోయి 1495.20 డాలర్లకు దిగింది.  కరెన్సీ బాస్కెట్‌లో డాలర్ బలపడి 98.98 వద్ద నిలిచింది. కాగా యుఎస్‌-చైనా వాణిజ్య చర్చలలో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు చైనా సిద్ధంగా ఉందని చైనా

మార్కెట్లోకి బీఎండబ్ల్యూ కొత్త ఎం5 కాంపిటిషన్‌

Tuesday 8th October 2019

- ధర రూ. 1.55 కోట్లు - 3.3 సెకన్లలోనే సున్నా నుంచి 100కి.మీ న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ తన ‘ఎం5 కాంపిటిషన్‌’ ప్రీమియం సెడాన్ కారులో అధునాతన వెర్షన్‌ను సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కేవలం 3.3 సెకన్ల వ్యవధిలోనే సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని ఈ కారు అందుకోగలదని ప్రకటించింది. దీని ధర రూ. 1.55 కోట్లు. సీబీయూ (కంప్లీట్‌ బిల్డ్‌ యూనిట్‌) తరహాలో..

Most from this category