News


మార్కెట్లు అధ్వాన్న స్థితిని దాటేశాయి: దేవన్ చోక్సీ

Tuesday 15th October 2019
Markets_main1571131064.png-28898

-నిర్థిష్టమైన స్టాకులలో ర్యాలీ చూడవచ్చు
మార్కెట్లు వాస్తవానికి అనుగుణంగా వాటిని అవి మార్చుకుంటాయని, ఇప్పటికే మార్కెట్లు అధ్వాన్న స్థితిని దాటేశాయని కేఆర్‌ చోక్సీ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌, ఎండీ దేవన్ ఆర్ చోక్సీ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే...

ఐఆర్‌సీటీసీ ధరకు డిమాండ్‌-సరఫరానే కారణం..
ఐఆర్‌సీటీసీ(ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పోరేషన్‌) మార్కెట్‌లో బంపర్‌ లిస్టింగ్‌ అయ్యింది. వాల్యుషన్‌ పరంగా ఈ కంపెనీ లిస్టింగ్‌ ప్రీమియంతో ఉంది. ఈ కంపెనీ బిజినెస్‌ అంత గొప్పగా లేనప్పటికి, రైల్వే సరఫరాలో గుత్తాదిపత్యం ఉండడం ఈ కంపెనీకి లాభం చేకూర్చేదే. కానీ ధరల విషయంలో ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఈ కంపెనీకి సంబంధించిన ప్రాథమిక విషయాలలో ఈ అంశాన్ని ఇన్వెస్టర్లు గుర్తుపెట్టుకోవడం ముఖ్యం. ఐఆర్‌సీటీసీ స్టాక్‌ ధర గరిష్ఠ స్థాయిల వద్ద ఉంది. వ్యవస్థలోని డిమాండ్‌-సరఫరా పరిస్థితులు ఐఆర్‌సీటీసీ షేరు ధరపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
     ప్రభుత్వం అధికంగా బిడ్‌లను ఐపీఓ ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా ఆకర్షించాలని భావించినట్టయితే, ప్రస్తుతం డిమాండ్‌ అధికంగా ఉన్న సమయంలోనే తన పోర్టుఫోలియోలోని మరికొంత వాటాను విక్రయించడానికి ప్రయత్నించాల్సింది. ఇప్పటికే ఈ ఐపీఓలో రూ. 650 కోట్ల కోసం, రూ. 70,000  కోట్ల బిడ్లు వచ్చాయి. మరికొన్ని షేర్లను అందుబాటులోకి తెచ్చి మార్కెట్‌, డిమాండ్‌ అవసరాలను తీర్చవలసింది. కానీ అలా జరగలేదు. సాంకేతికంగా చెప్పాలంటే ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) తర్వాత కూడా ప్రభుత్వం 85 శాతం వాటాను అట్టిపెట్టుకుంటే ఐఆర్‌టీసీ స్టాక్‌ ధర గరిష్ఠ స్థాయిల వద్దనే కొనసాగుతుంది. ప్రస్తుతం ఐఆర్‌టీసీ గరిష్ఠ స్థాయిలకు డిమాండ్‌-సరఫరానే కారణం. ప్రస్తుతం ఈ స్టాక్‌ ప్రీమియం స్థాయిల వద్ద ట్రేడవుతోంది. ఇన్వెస్టర్లు ఈ షేర్లను తక్కువ స్థాయిల వద్ద కొనుగోలు చేయాలంటే కొంత సమయం వేచి చూడవలసిందే.

వినియోగం పుంజుకుంటుంది...
మార్కెట్లు వాస్తవానికి అనుగుణంగా వాటిని అవి మార్చుకుంటాయి. ప్రస్తుతానికి ఈ పరిస్థితి మెరుగవుతుందని అనిపిస్తోంది.  బ్యాంకులు రుణాలను ఎక్కువ మందికి ఇవ్వడం ప్రారంభించాయి. అదే సమయంలో రిటైల్‌ స్థాయిలో వాహానాల రిజిస్ట్రేషన్‌ సంఖ్యలు పెరిగాయి. ఇది రిటైల్‌ స్థాయిలో వాహానాల అమ్మకాలు పెరిగాయనే విషయాన్ని తెలుపుతోంది. ప్యాక్టరీ స్థాయిలో పేరుకుపోయిన నిల్వలు బయటకొచ్చినట్టయితే, ఆటో రంగానికి సంబంధించి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని ధృవీకరించచ్చు. మార్కెట్‌లోని సంకేతాల ప్రకారం ఆర్థిక వ్యవస్థ అప్‌సైడ్‌ దిద్దుబాటు అవకాశం ఉందని అనిపిస్తోంది. అంతేకాకుండా రుతుపవనాలు సాధరణ స్థాయిలో ఉండడంతో వ్యవస్థలో వినియోగ సామర్ధ్యం తిరిగి పుంజుకోనుంది. వచ్చే రెండు మూడు నెలలు ఆసక్తిగా ఉండవచ్చు​. కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడం, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల కోత వంటి కారణాల వలన ఆర్థిక వ్యవస్థలో నిర్థిష్ఠ మొత్తంలోనైనా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. నా దృష్ఠిలో అధ్వాన్న పరిస్థితులను మనం దాటేశాం.

మార్కెట్‌ ర్యాలీ కాదు..నాణ్యమైన స్టాకుల ర్యాలీ
   సాధారణంగా బలంగా ఉన్న కంపెనీలు మంచి ప్రదర్శనను చేస్తాయి.  బలహీన కంపెనీలు ఖచ్చితంగా  అనేక సమస్యలను ఎదుర్కొంటాయి. మార్కెట్లు ర్యాలీ చేస్తాయా? అని నన్నడిగితే ఖచ్చితంగా ఉండదనేదే నా సమాధానం. కానీ ఏ కంపెనీల మేనేజ్‌మెంట్‌ బ్యాండ్‌విడ్త్‌ తగినంతగా ఉంటుందో, ఫైనాన్సియల్‌గా క్రమశిక్షణను ఏ కంపెనీలయితే పాటిస్తాయో, ప్రాథమికంగా ఏ కంపెనీలయితే బలంగా ఉంటాయో అటువంటి నిర్థిష్ఠమైన నాణ్యమైన కంపనీలు ర్యాలీ చేస్తాయి. ఈ కంపెనీలు వాటికి అవి వేగంగా వృద్ధి చెందుతాయి.  గత ఏడాదితో పోల్చుకుంటే ప్రస్తుతం ఎన్‌బీఎఫ్‌సీల క్యాపిటలైజషన్లో ఎటువంటి మార్పు మనకి కనిపించదు. కానీ ఎన్‌బీఎఫ్‌సీ సెక్టార్లో నాణ్యమైన కొన్ని కంపెనీలు మాత్రం వాటి మార్కెట్‌ వాటాను పెంచుకోగలిగాయనేది వాస్తవం. కొన్ని కీలక స్టాకులు మంచి ప్రదర్శన చేయడంతో సెక్టార్‌ మొత్తంగా సంపదలో ఎటువంటి మార్పులేకపోవచ్చు. ఎఫ్‌ఎంసీజీ(ఫాస్ట్‌మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌) బాస్కెట్‌, క్యాపిటల్‌ గూడ్స్‌ విభాగంలో కూడా ఇదే విధంగా ఉంది. ఇలాంటి పరిస్థితులలో నిర్థిష్ఠమైన స్టాకులకు, సాధరణ మార్కెట్‌ కంటే అధిక ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఈ స్టాకులను అధిక ప్రీమియం వద్దయినా కొనుగోలు చేయడానికి ఇన్వెస్టర్లు ఎదురుచూస్తుంటారు. 

యస్‌ బ్యాంక్‌ నిలదొక్కుకుంటుంది. కానీ..
 దిద్దుబాటు చర్యలను తీసుకోవడం, బ్యాలెన్స్ షీట్‌లను మెరుగుపరుచుకోవడంలో కంపెనీకి సహాయపడుతుంది. నిరర్ధక ఆస్తుల నుంచి నగదు లభ్యతను పెంచడం లేదా తన వాటాలను విక్రయించైనా నగదులభ్యతను పెంచుకోవడం ఏదైనా కంపెనీ క్యాపిటల్‌ను పెంచుకోడానికి ఉపయోగపడుతుంది. యస్‌ బ్యాంక్‌ విషయానికొస్తే, ఫోర్టిస్‌లో తన వాటాను విక్రయించి నిధులను సమీకరించింది. ఈ బ్యాంకుకు సంబంధించి అనేక అనిశ్చితులున్నాయి. ఈ బ్యాంక్‌ రుణాలిచ్చిన ఇతర కంపెనీలు డిఫాల్ట్‌కు వెళ్లకుండా ఉంటాయని ఆశిస్తున్నా. ఇలాంటి పరిస్థితులుంటే ఈ స్టాక్‌ ప్రస్తుత స్థాయిల వద్ద స్థిరంగా కదిలే అవకాశం ఉంది.  ఈ బ్యాంక్‌కి ఒక వ్యూహాత్మక ఇన్వెస్టరు​ దొరికినట్టయితే, ఈ బ్యాంక్‌ వ్యాపారం నెమ్మదిగా తిరిగి గాడిలో వచ్చే అవకాశం ఉంది. ఒక వేళ ఈ కంపెనీని ఇతర ఇన్వెస్టర్లు కొనుగోలు చేసి కొత్త మేనేజ్‌మెంట్‌ వస్తే ఈ బ్యాంకు న వచ్చే ఆరు నుంచి ఎనిమిది త్రైమాసికాలలో స్థిరపడే అవకాశం ఉంది. కానీ బ్యాంక్‌ పరిస్థితులు అనుకూలంగా మారేంత వరకు, ఈ స్టాక్‌పై వేచి చూసే ధోరణిని అనుసరించడం మంచింది.

ఈ స్టాకులను కూడబెడుతున్నాం..
రిలయన్స్‌, ధరలు తగ్గినప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ కంపెనీ షేర్లను మా ఫోర్టుపోలియోకి జోడిస్తున్నాం. మార్కెట్‌లు దిద్దుబాటుకు గురయినప్పుడు ఈ కంపెనీ స్టాకులను కొనుగోలు చేశాం. బజాజ్‌ ట్విన్స్‌కి సంబంధించి ముఖ్యంగా బజాజ్‌ ఫిన్‌జర్వ్‌ షేర్లను పోర్టుఫోలియో బ్యాలెన్సింగ్‌లో భాగంగా కొనుగోలు చేశాం. తాజాగా మా పోర్టుఫోలియోలో ఎటువంటి స్టాకులను జోడించలేదు.

రిఫైనింగ్‌ వ్యాపారం వలనే లాభాలు..
ప్రభుత్వ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలను పరిశీలించేటప్పుడు, ఈ కంపెనీల రిటైల్‌ మోడల్‌ ఆసక్తిగా ఉంటుంది. వారి రిఫైనింగ్‌ మోడల్‌ ఈ ఇండస్ట్రీలో చాలా కీలకమైనదిగా ఉంది. దానర్ధం, రిఫైనరీ స్థాయిలో కంపెనీలకు, ముడి పదార్థాన్ని తీసి చివరి ఉత్పత్తిగా మార్చే తీర-ఆధారిత రిఫైనరీ వీటికి చాలా అవసరం.  రిలయన్స్‌కు ఈ సౌకర్యం ఉంది. ఇలాంటి కంపెనీలు ప్రాసెసింగ్‌లో లాభపడడమే కాకుండా, అధిక రిఫైనింగ్‌ మార్జిన్‌లను(పోర్టులో వ్యూహత్మక స్థానం కారణంగా)​ అనుభవిస్తాయి.  ఒక వేళ ప్రభుత్వం ప్రభుత్వ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలలో వాటాలను విక్రయించాలని ప్రయత్నిస్తే వాటి రిటైల్‌ వ్యాపారం,  రిఫైనింగ్‌ వ్యాపారాలను వేరు చేస్తుందని అంచనా వేస్తున్నా.You may be interested

39 షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌!

Tuesday 15th October 2019

దేశీయ సూచీల్లో సోమవారం ముగింపు ప్రకారం 39 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో రైల్‌వికాస్‌నిగమ్‌, ఓఎన్‌జీసీ, ఎన్‌హెచ్‌పీసీ, ఆర్‌ఈసీ తదితర పీఎస్‌యూలతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ, టాటామోటర్స్‌, ఐసీఐసీఐ లుంబార్డ్‌, స్ట్రైడ్స్‌ ఫార్మా, ఫ్యూచర్‌ రిటైల్‌; ఐబీ రియల్‌ఎస్టేట్‌ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌

బ్యాంక్‌ నిఫ్టీ 1.50శాతం జంప్‌

Tuesday 15th October 2019

ప్రైవేట్‌రంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మంగళవారం మిడ్‌సెషన్‌ కల్లా 1.50శాతం లాభపడింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ నేడు 28,257.85 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ర్యాలీలో భాగంగా ఉదయం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా ప్రైవేట్‌రంగ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. ఒకదశలో ఇండెక్స్‌ 1.81 శాతం వరకు లాభపడి 28694.85 వద్ద

Most from this category