News


మార్కెట్ల జోష్‌- అరబిందో, ఎస్‌బీఐ హైజంప్‌

Friday 13th March 2020
Markets_main1584084619.png-32460

ప్రపంచ మార్కెట్ల బాటలో ఉన్నట్టుండి కుప్పకూలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి డ్రమటిక్‌గా కోలుకున్నాయి. ట్రేడర్ల షార్ట్‌ కవరింగ్‌, ఎంపిక చేసిన కౌంటర్లలో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, తగిన చర్యలు తీసుకుంటామంటూ సెబీ ప్రకటన వంటి అంశాలు సెంటిమెంటుకు జోష్‌నిచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మధ్యాహ్నం 12.40 ప్రాంతంలో సెన్సెక్స్‌ 832 పాయింట్లు దూసుకెళ్లి 33,610కు చేరగా.. నిఫ్టీ 305 పాయింట్లు జంప్‌చేసి 9,895 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 9.2 శాతం జంప్‌చేయగా.. ఫార్మా రంగం సైతం 6 శాతం ఎగసింది. వివరాలు చూద్దాం..

బీవోబీ జోరు
యస్‌ బ్యాంక్‌ రిజల్యూషన్‌ ప్రణాళికకు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసిన వార్తలతో పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ కౌంటర్‌ జోరందుకుంది. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 13.5 శాతం దూసుకెళ్లి రూ. 241 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 185 దిగువన కనిష్టాన్ని తాకగా.. తదుపరి రూ. 243 వరకూ ఎగసింది. ఈ బాటలో బీవోబీ 12 శాతం జంప్‌చేసి రూ. 63 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 64-47 మధ్య ఊగిసలాడింది. ఇతర కౌంటర్లలో పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, మహారాష్ట్ర బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, యుకో బ్యాంక్‌, ఐవోబీ, జేఅండ్‌కే 7.6-1.4 శాతం మధ్య పుంజుకున్నాయి.

సన్‌ ఫార్మా ఖుషీ
ఫార్మా రంగ కౌంటర్లలో అరబిందో 15.5 శాతం దూసుకెళ్లి రూ. 432 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 340కు పతనమైన ఈ షేరు తదుపరి రూ. 449 వరకూ ఎగసింది. ఈ బాటలో సన్‌ ఫార్మా 11 శాతం జంప్‌చేసి రూ. 395 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ. 325 వద్ద కనిష్టాన్నీ, రూ. 396 వద్ద గరిష్టాన్నీ తాకింది. ఇతర కౌంటర్లలో సిప్లా, పిరమల్‌, కేడిలా హెల్త్‌, గ్లెన్‌మార్క్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, బయోకాన్‌, లుపిన్‌, దివీస్‌ లేబ్‌ 7-2 శాతం మధ్య ఎగసి ట్రేడవుతున్నాయి.



You may be interested

331 బిలియన్‌ డాలర్లు పోగొట్టుకున్న ప్రపంచ కుబేరులు

Friday 13th March 2020

కోవిడ్‌-19 ధాటికి ప్రపంచంలోని కుబేరుల సంపదంతా ఆవిరైపోతోంది. గురువారం ఒక్కరోజే ప్రపంచలోని 500 మంది సంపన్నులు 331 బిలియన్‌ డాలర్లను సంపదను నష్టపోయారు. గడిచిన ఎనిమేదళ్లలో ఒక్కరోజులోనే ఇంత పెద్ద మొత్తంలో సంపదను కోల్పోవడం ఇదే మొదటి సారని బ్లూంబర్గ్‌ బిలీయనీర్స్‌ ఇండెక్స్‌ వెల్లడించింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 500 మంది సంపన్నుల సంపదలో మొత్తం 950 బిలియన్‌ డాలర్లు నష్టపోయారు. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా మార్కెట్లు దెబ్బతినడంతో

38 సెషన్లలలో రూ. 46 లక్షల కోట్లు ఫట్‌

Friday 13th March 2020

కరోనా వైరస్‌ కల్లోలం బేర్‌ ట్రెండ్‌లోకి దేశీ స్టాక్‌ మార్కెట్లు గరిష్టం నుంచి 27 శాతం పతనం 38 సెషన్లలో రూ. 46 లక్షల కోట్లు ఆవిరి అమెరికా మార్కెట్లలో మరింత నష్టం  చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ చివరికి ప్రపంచ దేశాలన్నింటికీ పాకడంతో స్టాక్‌ మార్కెట్లు వణుకుతున్నాయి. అమెరికా, యూరప్‌, ఆసియా మార్కెట్లు ఉన్నట్టుండి బేర్‌ ట్రెండ్‌లో పడ్డాయి. ఈ బాటలో దేశీయంగానూ ఇటీవల కొద్ది రోజులుగా అమ్మకాలు వెల్లువెత్తడంతో మార్కెట్లు బేర్‌మంటున్నాయి. వెరసి డోజోన్స్‌

Most from this category