News


ఒడిదుడుకుల వారం!

Monday 16th March 2020
Markets_main1584328347.png-32490

  • కోవిడ్–19 వైరస్ పరిణామాలే కీలకం..
  • భారీ ఆటుపోట్లకు అవకాశం
  • సోమవారం ఫిబ్రవరి డబ్ల్యూపీఐ ద్రవ్యొల్బణం వెల్లడి

ముంబై: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారుతోన్న కోవిడ్‌–19 (కరోనా) వైరస్‌ కీలక పరిణామాలే ఈ వారంలోనూ దేశీ స్టాక్‌ మార్కెట్‌ను నడిపించనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. వైరస్‌ విస్తృతి ఆధారంగా సూచీల కదలికలు ఉండనున్నాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ ఖేమ్కా విశ్లేషించారు. శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ చరిత్రలోనే అత్యధికంగా 3091 పాయింట్లు (10 శాతం) నష్టపోయి.. 45 నిమిషాల హాల్ట్‌ తరువాత, ట్రేడింగ్‌ తిరిగి ప్రారంభమైన కొద్ది సేపట్లోనే రికవరీతోపాటు 550 పాయింట్లవరకూ పెరిగింది. ఈ వారం ట్రేడింగ్‌లో కూడా ఇదే తరహాలో భారీ స్థాయి ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని అన్నారు. ఇటువంటి ఆటుపోట్లను చూసి ఇన్వెస్టర్లు ఆందోళన చెందవద్దని సిద్ధార్థ సూచించారు. దేశంలో కరోనా బాధితుల సంఖ్య ఆదివారం నాటికి 108కి చేరింది. ముంబై తరువాత కర్ణాటక, కేరళలో వైరస్‌ తీవ్రత అధికారంగా ఉందని వెల్లడైంది. ఇటువంటి పరిణామాలతో ఒడిదుడుకులు భారీ స్థాయిలోనే ఉండేందుకు ఆస్కారం ఉందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధనా విభాగం చీఫ్‌ వినోద్‌ నాయర్‌ విశ్లేషించారు. ముఖ్యంగా వైరస్‌ వ్యాప్తి ఆధారంగానే ఈ వారం మార్కెట్‌ గమనం ఉంటుందని రెలిగేర్‌ బ్రోకింగ్‌ వీపీ రీసెర్చ్‌ అజిత్‌ మిశ్రా అన్నారు. మార్కెట్లో ఒడిదుడుకులను సూచించే వోలటాలిటీ ఇండెక్స్‌ జీవితకాల గరిష్టస్థాయికి చేరినందున భారీ హెచ్చుతగ్గులకు అవకాశం ఉందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఇక మార్కెట్లో బౌన్స్‌ బ్యాక్‌ను అంచనావేస్తున్నట్లు ఇండియానివేష్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ హెడ్‌ వినయ్‌ పండిట్‌ తెలిపారు.

ఈ నెల్లో రూ. 37,976 కోట్లు వెనక్కి...
భారత క్యాపిటల్‌ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఈ నెల్లో ఇప్పటివరకు రూ. 37,976 కోట్లను ఉపసంహరించుకున్నారు. డిపాజిటరీల డేటా ప్రకారం.. మార్చి 2–13 మధ్య కాలంలో ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ. 24,776 కోట్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి రూ. 13,200 కోట్లను వెనక్కు తీసుకున్నారు. కరోనా వైరస్‌ ప్రభావం కారణంగా ఎఫ్‌పీఐలు భారీ స్థాయిలో తమ పెట్టుబడులను వెనక్కు తీసుకుంటున్నారని గ్రోవ్‌ సహ వ్యవస్థాపకులు హర్ష్‌ జైన్‌ విశ్లేషించారు. You may be interested

సెన్సెక్స్‌ కీలకస్థాయి 34,130 పాయింట్లు

Monday 16th March 2020

కరోనావైరస్‌ వివిధ దేశాలకు శరవేగంగా వ్యాప్తిచెందడం, పలు దేశాలు, కంపెనీలు ట్రావెల్‌ బ్యాన్స్‌ ప్రకటించడం, ఎన్నో కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ను అమలుచేయడం వంటి పలు కారణాలతో ప్రపంచ ఈక్విటీ  మార్కెట్లో 2008 ఆర్థిక సంక్షోభ అనంతరం అతిపెద్ద పతనం సంభవించింది. ఆయా కేంద్ర బ్యాంకులు వ్యవస్థలోకి తక్కువ వడ్డీరేట్లతో పుష్కలంగా విడుదల చేస్తున్న నిధులు కూడా మార్కెట్లను  శాంతింపచేయలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌

భయపడి పారిపోవద్దు.. బలంగా నిలబడాలి

Sunday 15th March 2020

కష్టార్జితాన్ని తీసుకెళ్లి స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసి.. మార్కెట్లు పడిపోతున్నాయనే భయంతో వచ్చినంత చాల్లేననుకుని అమ్మేసుకుని బయటపడి పోదామనుకుంటే పెద్ద తప్పిదమే అవుతుంది. సూర్యాస్తమయం తర్వాత చీకటి వచ్చిందని భయపడిపోతే ఏమవుతుంది..? ఓపిక పడితే మళ్లీ సూర్యోదయం అవుతుంది. అలాగే, మార్కెట్‌ పతనాల్లో ధైర్యంగా నిలబడాలి. స్టాక్స్‌ను అమ్ముకోవడం కాకుండా.. పోర్ట్‌ఫోలియో పరంగా ఏవైనా మార్పులు చేయాల్సి ఉంటే అందుకు ఇటువంటి సందర్భాలను అనుకూలంగా మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇటువంటి పతనాలను

Most from this category