News


మూడీస్‌ దెబ్బ- మూడో రోజూ నేలచూపే

Monday 17th February 2020
Markets_main1581935867.png-31864

సెన్సెక్స్‌ 202 పాయింట్లు మైనస్‌
2020లో దేశ ఆర్థిక వృద్ధి 5.4 శాతమే
మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ తాజా అంచనా
పీఎస్‌యూ బ్యాంక్స్‌ పతనం

కరోనా వైరస్‌, జీడీపీ అంచనాలలో మూడీస్‌ కోత దేశీ స్టాక్‌ మార్కెట్లను దెబ్బతీశాయి. ఫలితంగా వరుసగా మూడో రోజు నష్టాలతో నిలిచాయి. సెన్సెక్స్‌ 202 పాయింట్లు క్షీణించి 41,056 వద్ద నిలవగా.. నిఫ్టీ 68 పాయింట్లు తక్కువగా 12,046 వద్ద ముగిసింది. దేశ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను తాజాగా గ్లోబల్‌ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ 5.4 శాతానికి తగ్గించింది. ఇంతక్రితం 6.6 శాతం వృద్ధిని అంచనా వేసింది. దీనికితోడు కరోనా వైరస్‌ అంతర్జాతీయ స్థాయిలో వేగంగా విస్తరిస్తుండటంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగాయి. వెరసి దేశీ స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఎలాంటి ప్రభావం పడనుందన్న అంచనాలను అప్పుడే చెప్పలేమని మూడీస్‌ పేర్కొంది. అయితే మార్కెట్లు తొలుత హుషారుగా ప్రారంభమయ్యాయి. తదుపరి హెచ్చుతగ్గులను చవిచూశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 41,420 వద్ద గరిష్టాన్ని తాకగా.. 41,031 దిగువన కనిష్టాన్నీ చవిచూసింది. ఇక నిఫ్టీ 12,160-12,037 పాయింట్ల మధ్య ఒడిదొడుకులను ఎదుర్కొంది. 

ఫార్మా వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో దాదాపు అన్ని రంగాలూ డీలపడగా.. పీఎస్‌యూ బ్యాంక్స్‌ 3 శాతం తిరోగమించాయి. ఈ బాటలో ఫార్మా, రియల్టీ, మెటల్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ 1.5-0.5 శాతం మధ్య నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ, సిప్లా, బీపీసీఎల్‌, ఐవోసీ, బజాజ్‌ ఆటో, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, సన్‌ ఫార్మా 4-2 శాతం మధ్య క్షీణించాయి. ఇతర బ్లూచిప్స్‌లో​టైటన్‌, గెయిల్‌, నెస్లే. వేదాంతా, టీసీఎస్‌, టాటా స్టీల్‌, కొటక్‌ బ్యాంక్‌, యూపీఎల్‌, జీ, టాటా మోటార్స్‌ 1.75-0.55 శాతం మధ్య బలపడ్డాయి.

ఎల్‌ఐసీ హౌసింగ్‌ డౌన్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో ఎన్‌సీసీ, ఎల్‌ఐసీ హౌసింగ్‌, గ్లెన్‌మార్క్‌, బీవోబీ, అదానీ పవర్‌, పీఎన్‌బీ, ఐజీఎల్‌, సన్‌ టీవీ, ఐబీ హౌసింగ్‌ 9-4 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోపక్క ముత్తూట్‌ ఫైనాన్స్‌ 18 శాతం దూసుకెళ్లింది. బాలకృష్ణ 10 శాతం జంప్‌చేసింది. ఇతర కౌంటర్లలో మణప్పురం, మైంఢ్‌ట్రీ, టొరంట్‌ పవర్‌, బాష్‌, టొరంట్‌ ఫార్మా, అశోక్‌ లేలాండ్‌ 5-2 శాతం మధ్య ఎగశాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1 శాతం చొప్పున డీలాపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1729 నష్టపోగా.. 822 మాత్రమే లాభపడ్డాయి.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 705 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 220 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. గురువారం ఎఫ్‌పీఐలు కొనుగోళ్ల యూటర్న్‌ తీసుకుని రూ. 1061 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 960 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ విక్రయించిన విషయం విదితమే.You may be interested

ఏడాది కోసం టాప్‌ సిఫార్సులు

Monday 17th February 2020

వచ్చే సంవత్సర కాలంలో మంచి రాబడినిచ్చే సత్తా ఉన్న షేర్లను అనలిస్టులు రికమండ్‌ చేస్తున్నారు. 1. కోల్‌ ఇండియా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 258. థర్మల్‌ కోల్‌ మనుగడపై సందేహాలున్నా, ప్రస్తుతానికి దేశీయ విద్యుదుత్పాదనలో బొగ్గు డామినేషన్‌ కొనసాగుతుందని అంచనా. వచ్చే మూడేళ్లలో వాల్యూంలు 5 శాతం పెరగవచ్చు. దీనికితోడు కంపెనీ తీసుకుంటున్న సామర్ధ్య పెంపు చర్యల కారణంగా ఎబిటా వచ్చే మూడేళ్లు 3 శాతం చక్రీయవార్షిక వృద్ధి నమోదు చేయగలదు. 2.

భారత వృద్ధి రేటుకు మూడీస్‌ కోత

Monday 17th February 2020

కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి ఎఫెక్ట్‌  2020 ఆర్థిక సంవత్సరానికి గానూ భారత జీడీపీ వృద్ధి అవుట్‌లుక్‌ను 6.6.శాతం నుంచి 5.4శాతానికి తగ్గించింది. అలాగే 2021 సంవత్సరపు జీడీపీ వృద్ధి అవుట్‌లుక్‌కు సైతం 6.7శాతం నుంచి 5.8శాతానికి కోత విధించింది.    ఇటీవల చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా వైరస్‌ వ్యాధి ప్రభావంతో మందగించిన అంతర్జాతీయ వృద్ధి ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థ రికవకి అడ్డంకిగా మారుతుందని మూడీస్‌ తెలిపింది. ప్రస్తుత

Most from this category