News


బడ్జెట్‌ ముందురోజు మార్కెట్‌ డీలా

Friday 31st January 2020
Markets_main1580466892.png-31378

సెన్సెక్స్‌ 190 పాయింట్లు డౌన్‌
74 పాయింట్లు నీరసించిన నిఫ్టీ
మెటల్‌ ఇండెక్స్‌ పతనం

ఆర్థిక సర్వే, సార్వత్రిక బడ్జెట్‌ నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు రోజంతా హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేట్‌ అయ్యాయి. చివరికి  ప్రస్తావించదగ్గ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 190 పాయింట్లు క్షీణించి 40,723 వద్ద నిలవగా.. నిఫ్టీ 74 పాయింట్ల వెనకడుగుతో 11,963 వద్ద స్థిరపడింది. ఫిబ్రవరి డెరివేటివ్‌ సిరీస్‌ తొలి రోజు మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. తదుపరి ఆటుపోట్లను చవిచూశాయి. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 41,154 వద్ద గరిష్టాన్నీ, 40,671 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఈ బాటలో నిఫ్టీ సైతం​12,103-11,946 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. కరోనా వైరస్‌పై ఓవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించింది. మరోవైపు కరోనా పరిస్థితులను చైనా సమర్థవంతంగా ఎదుర్కోగలదని పేర్కొంది. దీంతో అమెరికాసహా ఆసియావరకూ మార్కెట్లు కోలుకున్నాయి.

ఫార్మా, ఐటీ, ఆటో వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మెటల్‌, ఫార్మా, ఆటో, ఐటీ రంగాలు 2.3-1.2 శాతం మధ్య నీరసించాయి. అయితే రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 1 శాతం స్థాయిలో బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్‌, యూపీఎల్‌, ఐవోసీ, బీపీసీఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, గెయిల్‌ 5-2.5 శాతం మధ్య పతనమయ్యాయి. మరోపక్క కొటక్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌, ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఆటో, టెక్‌ మహీంద్రా, టైటన్‌, ఇన్‌ఫ్రాటెల్‌, హీరో​మోటో, యస్‌ బ్యాంక్‌ 4-0.5 శాతం మధ్య ఎగశాయి.

బీఈఎల్‌ బోర్లా
డెరివేటివ్‌ కౌంటర్లలో బీఈఎల్‌ 11 శాతం కుప్పకూలగా.. మారికో, ఆయిల్‌ ఇండియా, ఎంజీఎల్‌, కాల్గేట్‌, ఈక్విటాస్‌, టాటా పవర్‌, పవర్‌గ్రిడ్‌ 6-4 శాతం మధ్య తిరోగమించాయి. కాగా.. నిట్‌టెక్‌, ఉజ్జీవన్‌, సెంచురీ టెక్స్‌, డాబర్‌, జూబిలెంట్‌ ఫుడ్‌, డీఎల్‌ఎఫ్‌, ఐడియా 4.6-2 శాతం మధ్య జంప్‌చేశాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.6-0.25 శాతం మధ్య బలహీనపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1426 నష్టపోగా.. 978 మాత్రమే లాభపడ్డాయి.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 962 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 292 కోట్లు ఇన్వెస్ట్‌ చేశాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 1014 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 1521 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన విషయం విదితమే.
  You may be interested

ఎల్‌అండ్‌టీ మ్యూచువల్‌ ఫండ్స్‌ వ్యాపార విక్రయం?

Friday 31st January 2020

ఇంజనీరింగ్‌, సాఫ్ట్‌వేర్‌ సేవల ప్రముఖ కంపెనీ లార్సన్‌అండ్‌ టూబ్రో (ఎల్‌అండ్‌టీ) మ్యూచువల్‌ ఫండ్స్‌ వ్యాపారం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. లిస్డెడ్‌ కంపెనీ అయిన ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌ పరిధిలో ప్రస్తుతం అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ వ్యాపారం నడుస్తోంది. ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌కు ప్రమోటర్‌ ఎల్‌అండ్‌టీయే. కంపెనీ నుంచి విస్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ఆధారంగా దీనిపై ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రధానం కాని వ్యాపార

మెటల్‌ షేర్లు డౌన్‌

Friday 31st January 2020

కరోనా వైరస్‌ ప్రభావం మెటల్‌పై పడడంతో అంతర్జాతీయ మార్కెట్లో మెటల్‌ షేర్లు పతనమయ్యాయి. దీంతో దేశీయ మార్కెట్లోనూ శుక్రవారం మెటల్‌ షేర్లు పడిపోయాయి. నిఫ్టీలో మెటల్‌ ఇండెక్స్‌ 2 శాతం తగ్గి 2, 574 వద్ద ముగిసింది. జిందాల్‌ స్టీల్‌ 0.77 శాతం తగ్గి 177.00 వద్ద, వెల్‌స్పన్‌ కార్పొరేషన్‌ 0.73 శాతం తగ్గి 172 వద్ద, రత్నమణి మెటల్స్‌ 0.36 శాతం తగ్గి 1,230 వద్ద, హిందుస్థాన్‌ జింక్‌ 0.41 శాతం తగ్గి194

Most from this category