News


విదేశీ ఎఫెక్ట్‌- నష్టాల ముగింపు

Thursday 27th February 2020
Markets_main1582798849.png-32146

సెన్సెక్స్‌ 143 పాయింట్లు డౌన్‌
నిఫ్టీ 45 పాయింట్లు వీక్‌
పీఎస్‌యూ బ్యాంక్స్‌, రియల్టీ బోర్లా

అగ్రదేశం అమెరికాకు సైతం కరోనా వైరస్‌ భయాలు చేరడంతో మరోసారి ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు దెబ్బతిన్నాయి. బుధవారం వరుసగా ఐదో రోజు అమెరికా స్టాక్‌ మార్కెట్లు క్షీణించగా.. దేశీయంగానూ అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో రోజంతా నష్టాలమధ్యే కదిలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతోనే నిలిచాయి. సెన్సెక్స్‌ 143 పాయింట్లు క్షీణించి 39,746 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 45 పాయింట్లు నీరసించి 11,633 వద్ద ముగిసింది. ఇం‍ట్రాడేలో సెన్సెక్స్‌ 39,948 వద్ద గరిష్టాన్నీ, 39,423 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఇక నిఫ్టీ 11,664-11,537 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) కరోనా అమెరికాలో సైతం విస్తరించే అవకాశమున్నదని పేర్కొనడం, తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా సూచించడం వంటి అంశాలు అంతర్జాతీయంగా సెంటిమెంటును బలహీనపరచినట్లు విశ్లేషకులు తెలియజేశారు.

ఫార్మా ఎదురీత
ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్‌, రియల్టీ, మీడియా రంగాలు 2.5 శాతం క్షీణించగా.. ఐటీ 1.3 శాతం బలహీనపడింది. అయితే ఫార్మా 0.6 శాతం పుంజుకుంది. నిఫ్టీ దిగ్గజాలలో విప్రో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఓఎన్‌జీసీ, ఐవోసీ, జీ, యూపీఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌, హీరో మోటో 3.5-1.8 శాతం మధ్య నష్టపోయాయి. అయితే సన్‌ ఫార్మా, బ్రిటానియా, టైటన్‌, గ్రాసిమ్‌, యాక్సిస్‌, ఇన్‌ఫ్రాటెల్‌, మారుతీ, ఏషియన్‌ పెయింట్స్‌, కొటక్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌ 3.6-0.7 శాతం బలపడ్డాయి.

జీఎంఆర్‌ పతనం
డెరివేటివ్‌ కౌంటర్లలో జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా, పీఎన్‌బీ, మైండ్‌ట్రీ, ఎన్‌సీసీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, నాల్కో, ఐడియా, సెంచురీ టెక్స్‌, విప్రో, బీఈఎల్‌ 7-3.5 శాతం మధ్య పతనమయ్యాయి. మరోవైపు ఫెడరల్‌ బ్యాంక్‌, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ ప్రు, అపోలో హాస్పిటల్స్‌, బెర్జర్‌ పెయింట్స్‌, టొరంట్‌ పవర్‌, పిడిలైట్‌ 4.6-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.75 శాతం చొప్పున నీరసించాయి. ట్రేడైన షేర్లలో 1580 నష్టపోగా.. 847 బలపడ్డాయి.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 3337 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2786 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 2315 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు రూ. 1565 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 1161 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 516 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 
 You may be interested

స్వల్పకాలంలో రాబడులకు ఈ షేర్లు చూడండి !

Thursday 27th February 2020

ప్రపంచ ఈక్వీటీ మార్కెట్లలో కరోనా వైరస్‌ వ్యాధి భయాలకు,  ఫిబ్రవరి ఎఫ్‌అండ్‌ఓ డెరివేటివ్స్‌ కాంటాక్టు ముగింపు నేప‌థ్యంలో ఇన్వెస్టర్ల అప్రమ‌త్తత తోడవ్వడంతో గురువారం బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీలు ఈ 2020 ఏడాది కనిష్టం దిగువకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్‌ఎంసీ గ్లోబల్‌ సెక్యూరిటీస్‌ సాంకేతిక నిపుణుడు షితిజ్ గాంధీ 3 షేర్లను సిఫార్సు చేస్తున్నారు.  షేరు పేరు: మిండా కార్పోరేషన్‌ రేటింగ్‌: కొనవచ్చు టార్గెట్‌ ధర: రూ.126 స్టాప్‌ లాస్‌: రూ.105 అప్‌సైడ్‌: 9శాతం విశ్లేషణ: ఈ

వచ్చే ఏడాది ఇండియాలో యాపిల్‌ స్టోర్‌!

Thursday 27th February 2020

ప్రముఖ ఐఫోన్‌ దిగ్గజ కంపెనీ యాపిల్‌ త్వరలో భారత్‌లో యాపిల్‌ స్టోర్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. క్యాలిఫోర్నియాలోని క్యూపెర్టెనోలో జరిగిన యాపిల్‌ కంపెనీ వార్షిక షేర్‌హోల్డర్‌ సమావేశంలో ఒక ప్రశ్నకు సమాదానంగా యాపిల్‌ చీఫ్‌ ఎక్సిక్యూటివ్‌ టిమ్‌కుక్‌ 2021లో ఇండియాలో తొలి యాపిల్‌ స్టోర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అంతేగాకుండా భారత్‌లో యాపిల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌ను ఈ ఏడాది చివరినాటికి ప్రారంభించనున్నట్లు తెలిపారు. 2021లో స్థానిక భాగస్వామ్యం లేకుండా  యాపిల్‌ కంపెనీ

Most from this category