News


రెండో రోజూ మార్కెట్లు డీలా

Monday 10th February 2020
Markets_main1581330206.png-31662

సెన్సెక్స్‌ 162 పాయింట్లు డౌన్‌
67 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ నేలచూపే
నీరసంగా కదులుతున్న యూరప్‌ మార్కెట్లు

అంతకంతకూ కరోనా వైరస్‌ విస్తరిస్తుండటంతో మరోసారి ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు డీలాపడ్డాయి. దీంతో దేశీయంగానూ వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లు అమ్మకాలకే ఆసక్తి చూపారు. వెరసి సెన్సెక్స్‌ 162 పాయింట్లు క్షీణించి 40,980 వద్ద నిలవగా.. నిఫ్టీ 67 పాయింట్ల వెనకడుగుతో 12,031 వద్ద ముగిసింది. వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లు నష్టపోగా.. ప్రస్తుతం యూరోపియన్‌ మార్కెట్లలోనూ అమ్మకాలదే పైచేయిగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నేలచూపులతో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు సమయం గడిచేకొద్దీ అమ్మకాలతో బలహీనపడ్డాయి. ఫలితంగా ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 40,799 వద్ద కనిష్టాన్ని తాకగా.. ఒక దశలో 41,172 వద్ద గరిష్టానికీ చేరింది. ఇక నిఫ్టీ 12,103- 11,991 పాయింట్ల మధ్య ఊగిసలాడింది.

మెటల్‌, ఆటో బోర్లా
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ నీరసించగా.. మెటల్‌, ఆటో, 3-2.5 శాతం చొప్పున క్షీణించాయి. ఈ బాటలో రియల్టీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఎఫ్‌ఎంసీజీ 1 శాతం బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్‌ఎం, జీ, టాటా స్టీల్‌, గ్రాసిమ్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఐషర్‌, కోల్‌ ఇండియా, హిందాల్కో, యస్‌ బ్యాంక్‌, బ్రిటానియా 7-3 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే యూపీఎల్‌ 5 శాతం జంప్‌చేయగా.. బజాజ్‌ ఫైనాన్స్‌, కొటక్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, ఆర్‌ఐఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, సిప్లా 1.6-0.4 శాతం మధ్య బలపడ్డాయి.

జస్ట్‌డయల్‌ డౌన్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో జస్ట్‌డయల్‌, సెయిల్‌, మదర్‌సన్‌, నాల్కో, బీహెచ్‌ఈఎల్‌, ఎన్‌సీసీ 6.3-4.2 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మురోపక్క ఎంఆర్‌ఎఫ్‌, బెర్జర్‌ పెయింట్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, మెక్‌డోవెల్‌, పిడిలైట్‌, పేజ్‌ ఇండస్ట్రీస్‌ 3.3-1.2 శాతం మధ్య ఎగశాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.8-0.4 శాతం మధ్య క్షీణించాయి. ట్రేడైన షేర్లలో 1550 నష్టపోగా.. 986 లాభపడ్డాయి. 

అటూఇటుగా..
నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) స్వల్పంగా రూ. 162 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 179 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. ఇక గురువారం​ఎఫ్‌పీఐలు రూ. 560 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 304 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి.    You may be interested

భారీ ఆర్డర్లను దక్కించుకున్న అశోక్‌ లేలాండ్‌

Monday 10th February 2020

బ్రిటన్‌ నుంచి 37 ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సుల ఆర్డర్ల రాక అశోక్‌ లేలాండ్‌ కంపెనీకి చెందిన బ్రిటన్‌ అనుబంధ సంస్థ ఆప్టేర్ పీఎల్‌సీ 37 ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సుల తయారీకి అక్కడి ప్రభుత్వం నుంచి ఆర్డర్లను దక్కించుకుంది. స్థానిక ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ టవర్‌ టాన్సిట్‌ గ్రూప్‌తో కలిసి పనిచేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సోమవారం కంపెనీ ఒక ప్రకటలో తెలిపింది. ఈ ఉద్గారరహిత ఎలక్ట్రానిక్‌ డబుల్‌ డెక్కర్‌ వాహనాలను షేర్బర్న్

6 శాతం వృద్ధి అంచనాలను అందుకోగలమా?!

Monday 10th February 2020

వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి లక్ష్యం కష్టమే తదుపరి సమీక్షలలో వడ్డీ రేట్ల కోతలకు చాన్స్‌ తక్కువే - దీప్తి మేరీ మాథ్యూ, జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఆర్థిక సర్వే అంచనా వేసినట్లు వచ్చే ఏడాది(2021)లో దేశ ఆర్థిక వ్యవస్థ 6-6.5 శాతం వృద్ధి అంచనాలను అందుకోవడం కష్టమేనంటున్నారు.. జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఆర్థికవేత్త దీప్తి మేరీ మాథ్యూ. రిజర్వ్‌ బ్యాంక్‌ పాలసీ నిర్ణయాలు, ద్రవ్యోల్బణం తదుపరి అంశాలపై ఒక ఇంటర్వ్యూలో దీప్తి వ్యక్తం

Most from this category