News


2014 స్థాయి లాభాలు రిపీట్‌ కావు

Tuesday 21st May 2019
Markets_main1558433112.png-25866

ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా
ఎగ్జిట్‌ పోల్స్‌లో ఎన్‌డీఏ ప్రభుత్వం మరలా వస్తుందన్న అంచనాలు మార్కెట్లో జోష్‌ నింపాయి. దీంతో సోమవారం సూచీలు దాదాపు 4 శాతం లాభపడ్డాయి. కానీ ఒక్కరోజుకే ఈ ఉత్సాహం ఆవిరైంది. మంగళవారం సూచీలు దాదాపు ఒక్క శాతం నష్టపోయాయి. చాలా మంది ఇన్వెస్టర్లు అప్రమత్తతతో ప్రాఫిట్‌బుకింగ్‌కు దిగారు. ఈ నేపథ్యంలో గురువారం నిజ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఎగ్జిట్‌ పోల్స్‌లో చెప్పినట్లు ఎన్‌డీఏ ప్రభుత్వం మరలా వచ్చినా, సూచీలు 2014లో లాగా 30 శాతం రాబడిని ఈ ఏడాది ఇవ్వకపోవచ్చని ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా అభిప్రాయపడ్డారు. ఈ దఫా ఎన్‌డీఏ 300కు పది సీట్లు అటుఇటుగా సీట్లు సంపాదించవచ్చని అంచనా వేశారు. కానీ 2014లో ఉన్న ఉత్సాహం ఈ ఏడాది సూచీల్లో ఉండదన్నారు. కానీ మొత్తం మీద మార్కెట్‌ ఈ ఏడాది మంచి రాబడినే ఇస్తుందని, కానీ గతంలో వచ్చినంత భారీ రాబడులుండవని తెలిపారు. ఒకవేళ ఎన్‌డీఏ ప్రభుత్వం మంచి మెజార్టీతో వస్తే 10750- 11000 పాయింట్ల రేంజ్‌ కీలక బాటమ్‌గా నిలుస్తుందన్నారు. స్థిర ప్రభుత్వం వస్తే ఈ స్థాయి దిగువకు నిఫ్టీ పోకపోవచ్చన్నారు. 
మోదీ రెండో దఫా పాలనలో ఫలితాలు బాగుంటాయని, గత సంస్కరణల ఫలాలు అమల్లోకి వస్తాయని చెప్పారు. భారత ఎకానమీలో వృద్ధికి ప్రపంచ వృద్ధితో పెద్దగా సంబంధం లేదన్నారు. మన ఎగుమతులు జీడీపీ కన్నా చాలా తక్కువని, అందువల్ల ప్రపంచ పరిణామాలు మనపై భారీగా ప్రభావం చూపకపోవచ్చని చెప్పారు. దేశంలో ఐబీసీ(దివాలా చట్టం) వచ్చిన తర్వాత క్రెడిట్‌కల్చర్‌ పెరిగిందని రాకేశ్‌ చెప్పారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఇరాన్‌ సమస్య దేశీ మార్కెట్‌పై ఎక్కువ ప్రభావం చూపవచ్చన్నారు. చైనా, యూఎస్‌ వాణిజ్యయుద్ధాన్ని మార్కెట్‌ ఇప్పటికే జీర్ణించుకుందని(ప్రైస్‌ఇన్‌), అందువల్ల ఇకపై దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 



You may be interested

39000 దిగువన సెన్సెక్స్‌

Tuesday 21st May 2019

మార్కెట్లో లాభాల స్వీకరణ 119 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ ముంబై: క్రితం ట్రేడింగ్‌లో భారీగా లాభపడిన సూచీల్లో నేడు లాభాల స్వీకరణ జరగడంతో మార్కెట్‌ నష్టాలతో ముగిసింది. బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌ 382 పాయింట్లను కోల్పోయి 39000 పాయింట్ల దిగువున 38,970, నిఫ్టీ 119 పాయింట్లు నష్టపోయి 11,709.10 పాయింట్ల వద్ద ముగిశాయి. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి ఒడిదుడుకుల ట్రేడింగ్‌ కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రభావాన్ని చూపింది. ఫలితంగా సూచీల మూడురోజుల

‘బేర్‌’మన్న టాటామోటర్స్‌

Tuesday 21st May 2019

మంగళవారం ఇంట్రాడేలో టాటామోటర్స్‌ షేరు దాదాపు 8 శాతం నష్టపోయింది. కంపెనీ మార్చి త్రైమాసిక ఫలితాలు మిశ్రమంగా ఉండడంతో షేరు కౌంటర్లో అమ్మకాలు పెరిగాయి. కంపెనీ నికరలాభం మార్చి త్రైమాసికంలో 49 శాతం క్షీణించి రూ. 1108 కోట్లకు చేరింది. జేఎల్‌ఆర్‌ మార్జిన్‌ గైడెన్స్‌లో కోత విధించింది. ముడిపదార్ధాల ధరల పెరుగుదల, చైనాలో జేఎల్‌ఆర్‌ ఇన్వెంటరీ ఇంకా తగ్గకపోవడం క్యు4 ఫలితాలపై ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో కంపెనీ షేరుపై

Most from this category