News


నష్టాలతో మొదలై క్షణాల్లోకి లాభాల్లో...!

Wednesday 11th March 2020
Markets_main1583900327.png-32399

హోలీ సెలవురోజు అనంతరం బుధవారం ప్రారంభమైన దేశీయ మార్కెట్‌ మొదట నష్టాల్లో ప్రారంభమైన క్షణాల్లో లాభాల్లోకి మళ్లింది. సెన్సెక్స్‌ 151 పాయింట్ల నష్టంతో 35,483 వద్ద, నిఫ్టీ 58 పాయింట్లు నష్టంతో 10,393 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. 

అయితే అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్లలో రికవరి, ముడిచమురు ధర బౌన్స్‌బ్యాక్‌ కావడంతో పాటు సోమవారం మార్కెట్‌ భారీ పతనం నేపథ్యంలో జరిగిన షార్ట్‌ కవరింగ్‌, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 28 పైసలు లాభంతో ప్రారంభం కావడం తదితర సానుకూలాంశాలతో సూచీలు క్షణాల్లో లాభాల్లోకి మళ్లాయి. 

నిన్నరాత్రి అమెరికా ఇండెక్సులు డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌లు 5శాతం లాభపడటంతో పాటు నేడు ఆసియాలోని కొన్ని మార్కెట్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అలాగే అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు కనిష్ట స్థాయిల నుంచి 80శాతం బౌన్స్‌బ్యాక్‌ కావడంతో పాటు ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ సోమవారం ముగింపు 74.09తో పోలిస్తే 28 పైసలు బలపడి 73.81 డాలర్ల వద్ద ప్రారంభమైంది.

ఉదయం గం.9:30ని.లకు సెన్సెక్స్‌ 250 పాయింట్ల లాభంతో 35883.95 వద్ద, నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 10510 వద్ద ట్రేడ్‌ అవుతోంది. బ్యాంకింగ్‌, మీడియా, ఆర్థిక, అటో రంగ షేర్లలో కొనుగోళ్ల విరివిగా జరుగుతున్నాయి. మరోవైపు ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, పార్మా, రియల్టీ షేర్లలో అమ్మకాలు జరగుతున్నాయి. 


హీరోమోటోకార్ప్‌, రిలయన్స్‌, ఇన్ఫ్రాటెల్‌, జీ లిమిటెడ్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు 2.50శాతం నుంచి 15శాతం వరుకు లాభపడ్డాయి. హిందాల్కో, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, సిప్లా, గెయిల్‌ షేర్లు 2శాతం నుంచి 3.50శాతం నష్టపోయాయి.  



You may be interested

నేటి వార్తల్లోని షేర్లు

Wednesday 11th March 2020

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు అదానీ పోర్ట్స్‌: అప్పుల్లో కూరుకుపోయిన డిగ్గీ పోర్ట్‌ కొనుగోలుకు అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ రూ.650 కోట్ల ప్లాన్‌ను ప్రతిపాదించగా ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది.  ఇన్ఫోసిస్‌: అమెరికాకు చెందిన స్టార్టప్‌ కంపెనీ వాటర్‌ లైన్‌ డేటా సైన్స్‌లో పెట్టిన 4.5 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులను వదులుకున్నట్లు ఇన్ఫోసిస్‌ వెల్లడించింది. కాగా ఈ మొత్తాన్ని 2016,2018 సంవత్సరాలలో రెండు దశల్లో

అమెరికా బౌన్స్‌బ్యాక్‌- చమురు సైతం

Wednesday 11th March 2020

మంగళవారం 5 శాతం జంప్‌చేసిన ఇండెక్సులు చివర్లో చతికిలపడ్డ మూరోపియన్‌ మార్కెట్లు  ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు అటూఇటూ రెండో రోజూ చమురు ధరల జోరు ప్రెసిడెంట్‌ ట్రంప్‌ పేరోల్‌ ట్యాక్సులలో కోతలను విధించవచ్చన్న అంచనాలతో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. మరోపక్క ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌ను చేపట్టడం కూడా దీనికి జత కలసినట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి ఇండెక్సులు 5 శాతం స్థాయిలో జంప్‌చేశాయి. డోజోన్స్‌ 1167 పాయింట్లు(4.9 శాతం) ఎగసి 25,018

Most from this category