STOCKS

News


చైనాకు జలుబు- ప్రపంచ మార్కెట్లకు వణుకు

Monday 27th January 2020
Markets_main1580122239.png-31243

సెన్సెక్స్‌ 458 పాయింట్లు పతనం
129 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
2 శాతం పతనమైన యూరప్‌ మార్కెట్లు
ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా రంగం ఎదురీత

అమెరికాకు జలుబు చేస్తే.. ప్రపంచ మార్కెట్లకు తుమ్ములొస్తాయన్నది స్టాక్‌ మార్కెట్లలో పాత సామెత. అయితే ప్రస్తుతం చైనాలోని మారుమూల వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచ మార్కెట్లను వణికిస్తోంది. వెరసి దేశీయంగానూ ఆందోళనకులోనైన ఇన్వెస్టర్లు తొలి నుంచీ అమ్మకాలకు ఎగబడ్డారు. ఫలితంగా మార్కెట్లు రోజంతా నష్టాలమధ్యే కదిలాయి. సెన్సెక్స్‌ 458 పాయింట్లు పతనమై 41,155 వద్ద నిలవగా.. నిఫ్టీ 129 పాయింట్లు కోల్పోయి 12,119 వద్ద ముగిసింది. మార్కెట్లు ఏదశలోనూ కోలుకోకపోగా.. చివర్లో అమ్మకాలు పెరిగి మరింత నీరసించాయి. చివర్లో సెన్సెక్స్‌ 41,122 వద్ద, నిఫ్టీ 12,107 వద్ద కనిష్టాలను తాకాయి. కాగా.. తొలి సెషన్‌లో సెన్సెక్స్‌ 41,516 వద్ద, నిఫ్టీ 12,216 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి.

ఏం జరుగుతున్నదంటే..
ఊపిరితిత్తుల వ్యాధికి కారణమవుతున్న కరోనా వైరస్‌ చైనాలో తాజాగా 80 మంది మృతికి కారణంకాగా.. అమెరికాసహా ఇతర దేశాలకూ విస్తరిస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఇప్పటికే ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటున్న అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు కరోనా మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టగలదన్న భయాలు ఇన్వెస్టర్లలో వ్యాపిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఫలితంగా నేటి ట్రేడింగ్‌లో రక్షణాత్మక పెట్టుబడులుగా భావించే పసిడి, జపనీస్‌ కరెన్సీ యెన్‌ బలపడగా.. అమెరికన్‌ ట్రెజరీలకు డిమాండ్‌ పెరిగి ఈల్డ్స్‌ నీరసించాయి. ఈ బాటలో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లలోనూ అమ్మకాలు ఊపందుకున్నాయి. ఆసియాలో జపాన్‌ 2 శాతం తిరోగమించగా.. యూరోపియన్‌ మార్కెట్లలో యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ 2 శాతం చొప్పున  పతనమయ్యాయి. ఈ బాటలో అమెరికా ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌, డోజోన్స్‌ ఫ్యూచర్స్‌ 1.6-0.5 శాతం మధ్య క్షీణించాయి.

దాదాపు అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ నీరసించగా.. క్యూ3లో డాక్టర్‌ రెడ్డీస్‌ అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించడంతో ఫార్మా 1.5 శాతం ఎగసింది. ప్రధానంగా మెటల్‌ 3 శాతం, బ్యాంక్‌ నిఫ్టీ, ఎఫ్‌ఎంసీజీ 1 శాతం చొప్పున డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో వేదాంతా, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఇండస్‌ఇండ్‌, హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్‌, ఎయిర్‌టెల్‌ 5-2.3 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే డాక్టర్‌ రెడ్డీస్‌ 5.6 శాతం జంప్‌చేసింది. ఇతర బ్లూచిప్స్‌లో ఎంఅండ్‌ఎం, సిప్లా, అల్ట్రాటెక్‌, ఐషర్‌, టెక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ 2-0.4 శాతం మధ్య బలపడ్డాయి.

స్టీల్‌ .. వీక్‌
డెరివేటివ్స్‌లో జిందాల్‌ స్టీల్‌, సెయిల్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, సీమెన్స్‌, ఐడియా, టాటా మోటార్స్‌ డీవీఆర్‌, ఎన్‌ఎండీసీ 6-4 శాతం మధ్య పతనమయ్యాయి. మరోవైపు ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, చోళమండలం ఫైనాన్స్‌, అరబిందో ఫార్మా, ఐజీఎల్‌, పిరమల్‌, ఆర్‌ఈసీ, కంకార్‌, ఐసీఐసీఐ ప్రు 2.2-1.5 శాతం మధ్య పుంజుకున్నాయి. కాగా.. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్స్‌ 0.4 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1494 నష్టపోగా.. 1058 లాభాలతో ముగిశాయి.
నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 659 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 418 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 1352 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్ రూ. 984 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. You may be interested

5 శాతం పెరిగిన రుచీ సోయా

Monday 27th January 2020

లిస్టింగ్‌లో 5 శాతం పెరిగిన రుచీ సోయా పతంజలి గ్రూపుకు చెందిన రుచీ సోయా ఇండస్ట్రీస్‌ షేర్లు సోమవారం తిరిగి ట్రేడ్‌ అయ్యాయి. బీఎస్‌ఈలో 5 శాతం పెరిగి రూ.16.90 వద్ద లాక్‌ అయ్యాయి. 2017లో ఎన్‌సీఎల్‌టీ ప్రతిపాదనల మేరకు 2019 సెప్టెంబర్‌లో హరిద్వార్‌ కేంద్రంగా పనిచేస్తోన్న పతంజలి గ్రూపు చెందిన పతంజలి ఆయుర్వేద రూ.4,500 కోట్లకు రుచీ సోయాను సొంతం చేసుకుంది. 2017లో రుచీ సోయా కంపెనీ చార్టెడ్‌​ బ్యాంక్‌, డీబీఎస్‌

ఎయిరిండియా వాటా విక్రయానికి సిద్ధమైన కేంద్రం

Monday 27th January 2020

తీవ్ర నష్టాలతో సంక్షోభంలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా సంస్థను అమ్మేందుకు కేంద్రం సిద్ధమైంది. సంస్థలో 100శాతం వాటా విక్రయానికి ఇన్వెస్టర్ల నుంచి ప్రభుత్వం సోమవారం ప్రిలిమినరీ బిడ్లను ఆహ్వానించింది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుని బిడ్లను ఆహ్వానించింది. ఎయిర్‌లైన్‌ వ్యాపారం నుంచి పూర్తిగా తప్పుకోవాలని భావిస్తుండటంతో కొనుగోలుదారులు లేవనెత్తే డిమాండ్లను అంగీకరించి విక్రయ ప్రక్రియను పూర్తిచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బిడ్డింగ్‌ ప్రక్రియలో భాగంగా కాంట్రాక్టులకు సంబంధించిన

Most from this category