News


10% కుప్పకూలిన మార్కెట్లు...సూచీల లోయర్‌ సర్క్యూట్‌

Monday 23rd March 2020
Markets_main1584939230.png-32628

సెన్సెక్స్‌ 3000 పాయింట్లు డౌన్‌
815 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ
బ్యాంక్‌ నిఫ్టీ 13 శాతం పతనం

ప్రపంచ దేశాలను పీడిస్తున్న కరోనా వైరస్‌ దేశీయంగానూ ప్రకంపనలు సృష్టిస్తుండటంతో ఇన్వెస్టర్లు ఒక్కుదుటున అమ్మకాలకు తెరతీశారు. దీంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే దేశీ స్టాక్‌ మార్కెట్లు 10 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. దీంతో ట్రేడింగ్ నిలిచిపోయింది. ట్రేడింగ్ తిరిగి 10.43కు ప్రారంభం కానుంది. 15 నిముషాల ప్రీఓపెన్‌ సెషన్‌ తదుపరి తిరిగి సాధారణ ట్రేడింగ్‌ ప్రారంభంకానుంది. సెన్సెక్స్‌ దాదాపు 3000 పాయింట్లు కుప్పకూలి 26,924 వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం 10 ప్రాంతంలో 2922 పాయింట్లు తక్కువగా 26,924 వద్ద  ఫ్రీజయ్యింది. ఇక నిఫ్టీ సైతం  842 పాయింట్లు కోల్పోయి 7,903 వద్ద నిలిచింది. తొలుత 7892 వరకూ జారింది.  

13 శాతం డౌన్‌
ఉదయం 10.10కల్లా బ్యాంక్‌ నిఫ్టీ 13 శాతం కుప్పకూలింది.  ఈ బాటలో ఆటో, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ,  ఐటీ, ఫార్మా తదితర రంగాలన్నీ ఎన్‌ఎస్‌ఈలో 11-5 శాతం మధ్య పడిపోయాయి. నిఫ్టీ దిగ్గజాలలో అన్ని షేర్లూ నష్టపోయాయి. ప్రధానంగా యాక్సిస్‌ బ్యాంక్‌ 20 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకగా.. ఐసీఐసీఐ, అదానీ పోర్ట్స్‌, ఇండస్‌ఇండ్, హీరో మోటో, బజాజ్‌ ఫైనాన్స్‌, గ్రాసిమ్‌, శ్రీ సిమెంట్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అల్ట్రాటెక్‌ 15-13 శాతం మధ్య తిరోగమించాయి.

డెరివేటివ్స్‌లో
డెరివేటివ్స్‌లో శ్రీరామ్‌ ట్రాన్స్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, చోళమండలం, ఉజ్జీవన్‌, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, ఈక్విటాస్‌ 19-15 శాతం మధ్య బేర్‌మన్నాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్ క్యాప్‌ ఇండెక్సులు సైతం 9 శాతం చొప్పున దిగజారాయి.  ప్రారంభంలోనే 1466 షేర్లు నష్టపోగా.. 156 నిలదొక్కుకున్నాయి. శుక్రవారం అమెరికా మార్కెట్లు పతనంకాగా.. ఆసియాలోనూ అమ్మకాలదే పైచేయిగా కనిపిస్తోంది.

 



You may be interested

స్వల్పంగా పెరిగిన పసిడి

Monday 23rd March 2020

 ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకి కోవిడ్‌-19 కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.  దేశీయం మల్టీ కమోడిటీ మార్కెట్లో శుక్రవారం ముగింపుతో పోలిస్తే రూ.10 పెరిగి  10 గ్రాముల పసిడి రూ.40,845.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో శుక్రవారం ముగింపుతో పోలిస్తే డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం 1,496.65 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. (శుక్రవారం (స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌

నేటివార్తల్లోని షేర్లు

Monday 23rd March 2020

 వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు మారుతీ సుజుకీ, ఎంఅండ్‌ఎం, హీరో మోటోకార్ప్‌: ఈ మూడు కంపెనీలు దేశవ్యాప్తంగా ఉన్న వాహన తయారీ ప్లాంట్లను నిలిపివేసాయి.  దాల్మియా భారత్‌: దాల్మియా భారత్‌  తన ఈక్విటీ షేర్లను రూ.500 కోట్లవరకు తిరిగి కొనుగోలు (బైబ్యాక్‌) చేసేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఒక్కో యూనిట్‌ గరిష్టంగా రూ.700ల చొప్పున 71,42,857 షేర్లను కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఎస్కార్ట్స్‌: దేశీయ ట్రాక్టర్‌

Most from this category