News


అమ్మకాల షాక్‌ -మార్కెట్లు బేర్‌

Monday 6th January 2020
Markets_main1578306451.png-30709

సెన్సెక్స్‌- 780 పాయింట్లు డౌన్‌ 
12,000 పాయింట్ల దిగువకు నిఫ్టీ
మూడో రోజూ బ్యాంక్‌ నిఫ్టీ పతనం
రూ. 3 లక్షల కోట్ల మార్కెట్‌ సంపద ఆవిరి

పశ్చిమాసియాలో తలెత్తిన ఉద్రిక్త వాతావరణం దేశీయంగా స్టాక్‌ మార్కెట్లను దెబ్బతీసింది. అమెరికాపై ఇరాన్‌, ఇరాక్‌ కాలుదువ్వితే కఠిన ఆంక్షలతోపాటు, ప్రతిదాడులు చేస్తామంటూ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ పేర్కొనడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు షాక్‌ తగిలింది. ఇప్పటికే ఇరానియన్‌ జనరల్‌తోపాటు ఇరాకీ అధికారులు కొంతమంది అమెరికా డ్రోన్‌ దాడిలో మరణించడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇవి మరింత ముదురుతున్న పరిస్థితులు కనిపించడంతో సోమవారం ముడిచమురు, బంగారం ధరలు రివ్వుమన్నాయి. పసిడి ఏడేళ్ల గరిష్టాన్ని తాకగా.. చమురు 4 నెలల గరిష్టాలకు చేరింది. ఇక రూపాయి వరుసగా రెండో రోజు డీలాపడటం ద్వారా సాంకేతికంగా కీలకమైన 72 దిగువకు చేరింది. వెరసి ఆందోళనకు లోనైన ఇన్వెస్టర్లు దేశీయంగా అమ్మకాలకు ఎగబడ్డారు. ఫలితంగా ఉదయం నుంచీ మార్కెట్లు పతన బాటలోనే సాగాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 788 పాయింట్లు పడిపోయి 40,677 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 234 పాయింట్లు పతనమై 11,993 వద్ద స్థిరపడింది. తద్వారా సెన్సెక్స్‌ 41,000 మార్క్‌ దిగువకు చేరగా.. నిఫ్టీ 12,000 పాయింట్ల మైలురాయిని కోల్పోయింది. సెన్సెక్స్‌ 41,378 వద్ద ప్రారంభమై తదుపరి నీరసిస్తూ వచ్చి 40,614కు చేరింది. నిఫ్టీ సైతం 12,179 వద్ద ప్రారంభమై 11,974 వరకూ దిగజారింది. దీంతో ఒక దశలో లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ(కేపిటలైజేషన్‌)కు రూ. 3 లక్షల కోట్లమేర చిల్లు పడినట్లు విశ్లేషకులు తెలియజేశారు.  

టైటన్‌ మాత్రమే
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ డీలాపడగా.. పీఎస్‌యూ బ్యాంక్‌ 4.4 శాతం పడిపోయింది. ఈ బాటలో మెటల్‌, ప్రయివేట్‌ బ్యాంక్స్‌, రియల్టీ, ఆటో, మీడియా, ఫార్మా 3-1.5 శాతం మధ్య క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో టైటన్‌(1.5 శాతం) మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో బలపడింది. ఇతర కౌంటర్లలో ఎస్‌బీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌, వేదాంతా, జీ, యస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌, హిందాల్కో, బజాజ్‌ ఫిన్‌, బీపీసీఎల్‌, కోల్‌ ఇండియా 4.6-3.2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. 

బ్యాంక్స్‌ డౌన్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో ఐబీ హౌసింగ్‌, హెచ్‌పీసీఎల్‌, ఎన్‌బీసీసీ, కెనరా బ్యాంక్‌, ఎన్‌సీసీ, ఆర్‌బీఎల్‌ బ్యాం‍క్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, పీఎన్‌బీ, ఎల్‌ఐసీ హౌసింగ్‌, బీవోబీ 8-5 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే మరోవైపు నిట్‌ టెక్‌, గోద్రెజ్‌ సీపీ, మైండ్‌ట్రీ, ఎన్‌ఎండీసీ 1.4-0.6 శాతం మధ్య పుంజుకున్నాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్స్‌ 2 శాతం చొప్పున నష్టపోయాయి. ట్రేడైన షేర్లలో 1943 బలహీనపడగా.. 605 మాత్రమే లాభాలతో నిలిచాయి.

పెట్టుబడుల బాట
నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1263 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1029 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. గురువారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 689 కోట్లు, డీఐఐలు రూ. 64 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.You may be interested

11,500 వరకు దిద్దుబాటు!

Tuesday 7th January 2020

సెన్సెక్స్‌ 800 పాయింట్ల వరకు క్షీణించి ఈ ఏడాదిలో అత్యధిక ఒక్కరోజు నష్టాన్ని సోమవారం నమోదు చేసింది. 2019 జూలై 8 తర్వాత సెన్సెక్స్‌కు ఇది అత్యధిక ఒక్క రోజు నష్టం కూడా. నిఫ్టీ కీలకమైన 12,000 పాయింట్లకు దిగువన, సెన్సెక్స్‌ 41,000 పాయింట్ల దిగువకు వచ్చేశాయి. ఈ దశలో కీలక మద్దతు స్థాయిలను అవి కోల్పోయాయి. గత ఐదేళ్ల కాలంలో చూస్తే 2015 ఆగస్ట్‌ 24న సెన్సెక్స్‌ ఒకేరోజు

ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు

Monday 6th January 2020

మార్కెట్‌ పతనంలో భాగంగా సోమవారం ప్రభుత్వరంగ షేర్లు భారీగా నష్టాలను చవిచూసాయి. నేడు ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2,512 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. రానున్న 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రభుత్వరంగ బ్యాంకులకు (పీఎస్‌బీలు) నిధుల కేటాయింపును ప్రకటించకపోవచ్చని వార్తలతో పాటు నేడు మార్కెట్లో వెల్లువెత్తిన భారీ అమ్మకాల్లో పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు నష్టాలను చవిచూశాయి. ఫలితంగా ఇండెక్స్‌లో ఒకదశలో

Most from this category