News


కరోనా కలకలం- మార్కెట్‌ వికలం

Wednesday 26th February 2020
Markets_main1582712853.png-32113

392 పాయింట్లు పడిన సెన్సెక్స్‌ 
నిఫ్టీ 119 పాయింట్ల వెనకడుగు 
ఆటో, రియల్టీ, మెటల్‌, ఐటీ డీలా 

కరోనా ధాటికి అమెరికా సైతం అప్రమత్తతను ప్రకటించవలసిన పరిస్థితులు తలెత్తడంతో ప్రపంచ మార్కెట్లకు షాక్‌ తగిలింది. మంగళవారం వరుసగా రెండో రోజు అమెరికా మార్కెట్లు 3 శాతం తిరోగమించాయి. దీంతో దేశీయంగానూ ఆందోళనకు లోనైన ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడ్డారు. వెరసి సెన్సెక్స్‌ 392 పాయింట్లు పతనమై 39,889 వద్ద నిలవగా.. 119 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 11,679 వద్ద స్థిరపడింది. అమెరికాలో కరోనా విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకొమ్మంటూ వ్యాధుల నివారణ, నియంత్రణ కేంద్రం(సీడీసీ) తాజాగా హెచ్చరించడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు షాక్‌ తగిలినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఆసియా మార్కెట్లకు జతగా.. యూరోపియన్‌ మార్కెట్లు సైతం నేలచూపులతో ప్రారంభంకావడంతో​దేశీయంగా మార్కెట్లు ఏదశలోనూ కోలుకోలేదు. సెన్సెక్స్‌.. 40,255 పాయింట్ల వద్ద గరిష్టం, 39,900 దిగువన కనిష్టం నమోదు చేసుకుంది. నిఫ్టీకి ప్రారంభంలో నమోదైన 11,783 పాయింట్లు గరిష్టంకాగా.. ఇంట్రాడేలో 11,640 దిగువకూ చేరింది. 

అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ డీలాపడ్డాయి. ప్రధానంగా ఆటో, మెటల్‌, రియల్టీ, ఐటీ, ఫార్మా 2.2-1.2 శాతం మధ్య నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో గెయిల్‌, సన్‌ ఫార్మా, టాటా మోటార్స్‌, గ్రాసిమ్‌, హిందాల్కో, మారుతీ, ఎల్‌అండ్‌టీ, బీపీసీఎల్‌, ఇన్ఫోసిస్‌, వేదాంతా 5-2 శాతం మధ్య పతనమయ్యాయి. బ్లూచిప్స్‌లో యస్‌ బ్యాంక్‌ 5 శాతం జంప్‌చేయగా.. ఎస్‌బీఐ 0.4 శాతం బలపడింది.

కంకార్‌ వీక్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో కంకార్‌, జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా, జిందాల్‌ స్టీల్‌, మదర్‌సన్‌, పిరమల్‌, టాటా పవర్‌, బాష్‌, ఆయిల్‌ ఇండియా 5.4-4 శాతం మధ్య తిరోగమించాయి. అయితే మరోవైపు ఐడియా, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, టొరంట్‌ ఫార్మా, దివీస్‌ లేబ్‌, ఇండిగో, గ్లెన్‌మార్క్‌, అరబిందో, అంబుజా, ఈక్విటాస్‌ 2.5-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.3-0.8 శాతం మధ్య క్షీణించాయి. ట్రేడైన షేర్లలో 1629 నష్టపోగా.. 829 లాభాలతో ముగిశాయి.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2315 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1565 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 1161 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 516 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.



You may be interested

హెచ్‌ఎంఈఎల్‌ రేటింగ్‌ను తగ్గించిన మూడీస్‌!

Wednesday 26th February 2020

ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌  సంస్థ  హెచ్‌పీసీఎల్‌-మిట్టల్‌ ఎనర్జీ లిమిటెడ్‌(హెచ్‌ఎంఈఎల్‌) రేటింగ్‌ను Ba1 నుంచి Ba2కు తగ్గించింది. స్టేబుల్‌గా ఉన్న ర్యాంకింగ్‌ను నెగిటివ్‌గా మార్చింది. ఇంధన డిమాండ్‌ తగ్గడం, రిఫైనింగ్‌​మార్జిన్స్‌ బలహీనంగా ఉండడంతో  రేటింగ్‌ను తగ్గించినట్లు మూడీస్‌ సంస్థ తెలిపింది.హెచ్‌ఎంఈఎల్‌ క్రెడిట్‌ మెట్రిక్స్‌ క్షీణత, ఆసియాలో రిఫైనింగ్‌ బలహీనపడడం, కంపెనీలు పెట్రోకెమికల్స్‌ విస్తరించేందుకు అధిక మొత్తంలో రుణాలు తీసుకోవడాన్ని ..తగ్గించిన రేటింగ్‌ Ba2 ప్రతిబింబిస్తుందని మూడీస్‌ విశ్లేషకులు శ్వేతా పటోడియా

మార్కెట్లో మరింత కరెక‌్షన్‌!

Wednesday 26th February 2020

రామ్‌దేవ్‌ అగర్వాల్‌ అంచనా ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్‌ నానాటికీ మరింత విస్తరిస్తోంది. దీంతో అంతర్జాతీయ ఎకానమీలన్నీ భయపడుతున్నాయి. ఇది ఇండియాకు సైతం ప్రమాదకరమేనని, వైరస్‌ విస్తరణ మరింత ముదిరితే ఇండియాసైతం ప్రభావితం అవుతుందని మార్కెట్‌ నిపుణుడు రామ్‌దేవ్‌ అగర్వాల్‌ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఈ వైరస్‌ చైనాలో దాదాపు 3 వేల మందిని బలికొంది. కరోనా భయాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నేల చూపులు చూడడం ఆరంభించాయి. ఇండియా

Most from this category