News


సానుకూలతలున్నా.. ప్రతికూలతలూ ఉన్నాయ్‌...

Thursday 6th December 2018
Markets_main1544083083.png-22699

  • మార్కెట్‌ రేంజ్‌ బౌండ్‌లోనే ఉండొచ్చంటున్న ఏంజెల్‌ బ్రోకింగ్‌

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ రేంజ్‌ బౌండ్‌లో కదలాడవచ్చని ఏంజెల్‌ బ్రోకింగ్‌ ఫండ్‌ మేనేజర్‌ మయురేశ్‌ జోషి తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. 2018లో మార్కెట్‌ మిశ్రమ పనితీరు కనబర్చిందని పేర్కొన్నారు. ‘రానున్న కాలంలో చూస్తే.. వాణిజ్య ఉద్రిక్తతలను ప్రధాన అంశంగా చెప్పుకోవాలి. మూడు నెలల సంధి కాలంలో అమెరికా- చైనా దేశాలు ఒక ఒప్పందానికి రావొచ్చు’ అని తెలిపారు. క్రూడ్‌ ధరలకు ప్రాధాన్యమివ్వాల్సి ఉందని పేర్కొన్నారు. నేటి ఒపెక్‌ దేశాల సమావేశంలో వెలువడే  నిర్ణయాన్ని బట్టి క్రూడ్‌ ధరల్లో కదలికలు ఉంటాయని తెలిపారు. ధరలు పైకి కదిలితే భారత్‌ ఆయిల్‌ దిగుమతుల భారం పెరుగుతుందని పేర్కొన్నారు. 
2018లో నిఫ్టీ, సెన్సెక్స్‌ అర్జించిన లాభాలు చివరకు వచ్చేసరికి ఆవిరయ్యాయని మయురేశ్‌ జోషి తెలిపారు. ఎల్‌టీసీజీపై పన్ను విధింపు వల్ల మిడ్‌క్యాప్స్‌లో అమ్మకాల ఒత్తిడి ఏర్పడిందన్నారు. అన రెండో అర్ధ భాగంలో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ డిఫాల్ట్‌ కారణంగా లిక్విడిటీ సంక్షోభం తలెత్తిందని గుర్తు చేశారు. ఏదైమైనా ఈ ఏడాదిలో జీడీపీ వృద్ధి రేటు 7.5 శాతంగా నమోదు కావొచ్చని తెలిపారు. మొత్తంగా చూస్తే 2018లో మార్కెట్లు మిశ్రమ పనితీరు కనబర్చాయని చెప్పొచ్చన్నారు. 
అక్టోబర్‌ తర్వాత క్రూడ్‌ ధరలు ఒక్కసారిగా పడిపోవడం సానుకూల అంశమని మయురేశ్‌ జోషి తెలిపారు. రూపాయి 75 సమీపం నుంచి 70 స్థాయికి రికవరీ అవ్వడం మరో పాజిటివ్‌ అంశమని పేర్కొన్నారు. దీనివల్ల ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిల్లో ఉండొచ్చని అంచనా వేశారు. అమెరికా- చైనా వాణిజ్య ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా అస్థిర పరిస్థితులు తలెత్తాయని, దీంతో ప్రపంచ వృద్ధి మందగించొచ్చనే ఆందోళనలు మొదలయ్యాయని వివరించారు. ఇది ప్రతికూల అంశమని తెలిపారు. అలాగే అంతర్జాతీయ కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచితే అది కూడా నెగటివ్‌ ప్రభావం చూపవచ్చని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా ప్రభావం చూపుతాయని తెలిపారు. రానున్న రోజుల్లో మార్కెట్లు రేంజ్‌ బౌండ్‌లో కదలాడవచ్చని, కొన్ని స్టాక్స్‌లో పెరుగుదల ఉంటుందని పేర్కొన్నారు. 
టెలికం పరిశ్రమలో కన్సాలిడేషన్‌ చోటుచేసుకుంటోందని మయురేశ్‌ జోషి తెలిపారు. అయితే టెల్కోలు ఇప్పటికీ రెండు సవాళ్లను ఎదుర్కొంటున్నాయన్నారు. స్పెక్ట్రమ్‌ కొనుగోలు సమయంలో టెలికం సంస్థలు అధిక మొత్తంలో నిధులు వెచ్చించాయని, దీంతో వాటి రుణ భారం పెరిగిందని పేర్కొన్నారు. ఇది ఒక రిస్క్‌ అంశమైతే.. రిలయన్స్‌ జియో వల్ల ధరల పోటీ కారణంగా కంపెనీల ఏఆర్‌పీయూ తగ్గిందని తెలిపారు. ఇది రెండో సమస్య అని పేర్కొన్నారు. You may be interested

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌: స్మార్ట్‌ఫోన్లపై అదిరే ఆఫర్లివే..

Thursday 6th December 2018

ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌.. బిగ్‌ షాపింగ్‌ డేస్‌లో భాగంగా పలు స్మార్ట్‌ఫోన్లపై మంచి ఆఫర్లను ప్రకటించింది. అవేంటో చూద్దాం..  ♦ రియల్‌ మి 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను రూ.13,990కే పొందొచ్చు. ♦ ఒప్పొ ఎఫ్‌9 (4జీబీ)పై అదనంగా రూ.1,500 డిస్కౌంట్‌ అందిస్తోంది.  ♦ శాంసంగ్‌ ఆన్‌8ను రూ.12,990కే పొందొచ్చు. ♦ పోకో ఎఫ్‌1.. రూ.19,999లకు అందుబాటులో ఉంది.  ♦ మోటొరొలా వన్‌ పవర్‌ (64 జీబీ) ధర ఇప్పుడు రూ.14,999గా ఉంది. రూ.4,000 డిస్కౌంట్‌లో వస్తోంది.  ♦ నోకియా 5.1 ప్లస్‌పై రూ.3,200 డిస్కౌంట్‌ పొందొచ్చు. ♦ శాంసంగ్‌

నష్టాల బాటలో అటో షేర్లు

Thursday 6th December 2018

4.50శాతం నష్టపోయిన మారుతి సుజుకీ నవంబర్‌ అమ్మకాలు అతంత మాత్రంగానే నమోదు కావడంతో గురువారం అటో షేర్ల నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో అటో షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ 2శాతం నష్టపోయింది. మధ్నాహ్నం గం.12:30ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(8,992.90)తో పోలిస్తే 1శాతం నష్టంతో 8,877.55 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలోకి మొత్తం 16 షేర్లలో 12 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 2 షేర్లు మాత్రం

Most from this category