News


లాభాల ప్రారంభం...వెంటనే నష్టాల్లోకి

Thursday 6th June 2019
Markets_main1559792676.png-26121

రంజాన్‌ సెలవు అనంతరం గురువారం లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌...కొద్ది నిముషాల్లోనే నష్టాల్లోకి జారుకుంది. 52 పాయింట్ల లాభంతో 40,136 పాయింట్ల వద్ద మొదలైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ వెనువెంటనే 42 పాయింట్ల నష్టంతో 40,045 పాయింట్ల వద్దకు తగ్గింది. 18 పాయింట్ల లాభంతో 12,038 పాయింట్ల వద్ద మొదలైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచి..కొద్ది నిముషాల్లోనే 20 పాయింట్ల నష్టంతో 12,001 పాయింట్ల వద్దకు పడిపోయింది.

గెయిల్‌ 9 శాతం క్రాష్‌

ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ప్రభుత్వ రంగ గ్యాస్‌ సరఫరా సంస్థ గెయిల్‌ 9 శాతం పతనమయ్యింది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, యస్‌బ్యాంక్‌, జీ టెలిఫిల్మ్‌, ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌ షేర్లు 3-4 శాతం మధ్య క్షీణించాయి. ఈ రోజు ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధానం వెల్లడికానున్న నేపథ్యంలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ 0.4 శాతం క్షీణించి 31,500 పాయింట్లలోపునకు తగ్గింది.  మరోవైపు పవర్‌గ్రిడ్‌, ఐషర్‌ మోటార్స్‌, ఐఓసీ, బజాజ్‌ ఆటోలు 1-2 శాతం మధ్య పెరిగాయి.  



You may be interested

గురువారం వార్తల్లో షేర్లు

Thursday 6th June 2019

వివిధ వార్తలను అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  పీఎస్‌పీ ప్రాజెక్ట్స్‌:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కంపెనీ రూ.156 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది.  విప్రో:- ఇంటర్నేషనల్‌ టెక్నోగ్రూప్‌ను చేజిక్కించుకునేందుకు కంపెనీ వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అవెన్యూ సూపర్‌మార్ట్‌:- జూన్‌ 4వ తేదిన కంపెనీ రూ.100 కోట్ల విలువైన కమర్షియల్‌ పేపర్ల ఇష్యూను జారీ చేసింది.  యాక్సిస్‌ బ్యాంక్‌:- ధీర్ఘకాలిక ఇష్యూయర్‌ డిఫార్ట్‌ రేటింగ్‌ను ఎఎఎఎ(-) నుంచి ఎఎ(+)కి సవరించింది. ఐసీఐసీఐ బ్యాంక్‌:- ఫిచ్‌ రేటింగ్స్‌...బ్యాంకు బాండ్లకు

చౌకగా మూడు బ్లూచిప్‌లు...!

Wednesday 5th June 2019

ఎటువంటి పరిస్థితుల్లో అయినా బ్లూచిప్‌ కంపెనీలు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తూనే ఉంటాయి. ఆయా కంపెనీల బ్రాండ్‌ విలువ, వాటి సామర్థ్యాలే వీటికి కారణం. ఎంతటి దిగ్గజ కంపెనీలు అయినా మార్కెట్‌ ప్రతికూలతల సమయాల్లో అమ్మకాల కారణంగా ధరల పరంగా దిద్దుబాటుకు లోనవుతుంటాయి. నిజానికి సాధారణ ఇన్వెస్టర్లకు అటువంటి సమయాలే పెట్టుబడులకు అనుకూలమని వారెన్‌ బఫెట్‌ వంటి నిపుణులు చెబుతుంటారు. కొన్ని అంశాల ఆధారంగా బ్లూచిప్‌ కంపెనీల్లో చౌకగా ట్రేడ్‌ అవుతున్న, ఆకర్షణీయంగా

Most from this category