News


మరో నష్టాల ప్రారంభం

Tuesday 14th May 2019
Markets_main1557806315.png-25717

వరుసగా 9 రోజులపాటు నష్టాల్ని చవిచూసిన భారత్‌ స్టాక్‌ సూచీలు మంగళవారం సైతం క్షీణతతో ఆరంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 66 పాయింట్ల తగ్గుదలతో 37,025 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 27 పాయింట్ల క్షీణతతో 11,222 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. క్రితం రోజు ఇంట్రాడేలో 20 శాతం వరకూ పడిపోయిన సన్‌ఫార్మా తాజాగా 2 శాతం పెరిగింది. వేదాంత, అదాని పోర్ట్స్‌, టీసీఎస్‌, ఐటీసీలు స్వల్పలాభంతో మొదలయ్యాయి. మరోవైపు జీ టెలిఫిల్మ్‌, ఎల్‌ అండ్‌ టీ, హిందాల్కో, టాటా స్టీల్‌, యస్‌బ్యాంక్‌లు 2-3 శాతం మధ్య నష్టపోయాయి. 



You may be interested

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 14th May 2019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు పీఎస్‌బీ ఇన్ఫ్రాటెక్‌:- తన అనుబంధ సంస్థ పీఎస్‌సీ హైవేస్‌కు కేర్‌ రేటింగ్‌ సంస్థ రేటింగ్‌ను పెంచింది. కంపెనీ గల బ్యాంకు రుణ సౌకర్యాలను దృష్టి ఉంచుకుని రేటింగ్‌ను ‘‘ఎ(-)’’ నుంచి ‘‘ఎ’’ కు రేటింగ్‌ను పెంచుతున్నట్లు రేటింగ్‌ సం‍స్థ తెలిపింది.  అవధ్‌ షుగర్స్‌:-  1:1 నిష్పత్తిలో షేర్ల బోనస్‌ ఇష్యూను ప్రకటించింది. శ్రేయాస్‌ ఇండస్ట్రీస్‌:-  ప్రతి ఈక్విటీ షేరుకు రూ.5ల తుది డివిడెండ్‌ను ప్రకటించింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌:-

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 40 పాయింట్లు డౌన్‌

Tuesday 14th May 2019

అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధ పరిష్కారం డోలాయమానంలో  కొనసాగడంతో ఆసియా మార్కెట్లు క్షీణించిన నేపథ్యంలో వరుసగా 9 రోజులపాటు నష్టాల్ని చవిచూసిన భారత్‌ మార్కెట్‌ మంగళవారం  సైతం గ్యాప్‌డౌన్‌తో  ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఈ ఉదయం 8.50 గంటలకు  40 పాయింట్లకుపైగా నష్టపోయి11,138 పాయింట్ల వద్ద కదులుతోంది. శుక్రవారం ఇక్కడ నిఫ్టీ మే ఫ్యూచర్‌ 11,181 పాయింట్ల వద్ద ముగిసింది. తాజాగా ఆసియాలో జపాన్‌

Most from this category