News


భలే రికవరీ- లాభాల్లోకి మార్కెట్లు

Friday 13th March 2020
Markets_main1584077520.png-32455

10 శాతం నష్టాల నుంచి 1 శాతం ప్లస్‌లోకి
కోలుకున్న డోజోన్స్‌ ఫ్యూచర్స్‌
తగిన చర్యలు చేపడతామన్న సెబీ ఎఫెక్ట్‌
తొలుత 12ఏళ్ల తదుపరి డౌన్‌ సర్క్యూట్‌
ఎన్‌ఎస్‌ఈలో లాభాల్లో ఫార్మా, బ్యాకింగ్‌

 
సుమారు 45 నిమిషాలపాటు నిలిపివేసిన తదుపరి ట్రేడింగ్‌ను అనుమతించాక మార్కెట్లు రికవరీ బాట పట్టాయి. 10.25 వద్ద తిరిగి ప్రారంభమైన ట్రేడింగ్‌లో మార్కెట్లు వేగంగా కోలుకుంటూ వచ్చాయి. ఫలితంగా 10.50కల్లా మార్కెట్లు లాభాల్లోకి ప్రవేశించాయి. వెరసి 10 శాతం నష్టాల నుంచి బయటపడిన సెన్సెక్స్‌ 520 పాయింట్ల వరకూ జంప్‌చేసింది. 10.55 ప్రాంతంలో 224 పాయింట్లు పెరిగి 33,002 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ సైతం 150 పాయింట్లవరకూ పురోగమించింది. ఆపై 95 పాయింట్లు బలపడి 9685 వద్ద కదులుతోంది.

నేలచూపులిలా..
గురువారం అమెరికా  మార్కెట్లు 10 శాతం, యూరోపియన్‌ మార్కెట్లు 12 శాతం చొప్పున పతనంకాగా..  నేటి ట్రేడింగ్‌లో ఆసియాలో మార్కెట్లు 8 శాతం స్థాయిలో తిరోగమించాయి. దీంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూకట్టడంతో ఇండెక్సులు 10 శాతం కుప్పకూలాయి. ఆరు నిముషాల్లోనే డౌన్‌ సర్క్యూట్‌ను తాకాయి. వెరసి 12 ఏళ్ల తదుపరి ట్రేడింగ్‌ నిలిచిపోయింది. ఇంతక్రితం 2008లో తలెత్తిన అమెరికన్‌ సబ్‌ప్రైమ్‌ సంక్షోభ సమయంలో దేశీయంగా మార్కెట్లు ఈ స్థాయి అమ్మకాలను చవిచూశాయి. కాగా.. అమెరికా మార్కెట్ల ట్రెండ్‌ను సూచించే డోజోన్స్‌ ఫ్యూచర్స్‌ 750 పాయింట్లమేర రికవర్‌కావడం, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. అవసరమైతే తగిన చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించడం వంటి అంశాలు కొంతమేర సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు.

ఇదీ తీరు
తొలుత 3091 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌ 29,688 దిగువకు చేరింది. ఇక నిఫ్టీ 966 పాయింట్లు పోగొట్టకుని 8624 వద్ద నిలిచింది. బ్యాంక్‌ నిఫ్టీ సైతం 10 శాతం కుప్పకూలి 21,352ను తాకింది. తద్వారా సెన్సెక్స్‌, నిఫ్టీ, బ్యాంక్‌ నిఫ్టీ మూడేళ్ల కనిష్టాలకు చేరాయి. ఇవి 2017 ఫిబ్రవరి కనిష్టాలు. కాగా.. సార్వత్రిక ఎన్నికలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు యూపీఏ తగిన మెజారిటీ సాధించడంతో 2009లో దేశీ స్టాక్‌ మార్కెట్లు అప్పర్‌ సర్క్యూట్‌ను తాకాయి. ఫలితంగా రోజంతా ట్రేడింగ్‌ నిలిచిపోవడం విశేషం! 

భారీ రికవరీ
ఎన్‌ఎస్‌ఈలో తొలుత అన్ని ఇండెక్సులూ అమ్మకాలతో కుప్పకూలగా.. ప్రస్తుతం ఫార్మా 3 శాతంపైగా జంప్‌చేసింది. ఇతర రంగాలలో బ్యాంక్‌ నిఫ్టీ, ఆటో 1.5 శాతం చొప్పున బలపడ్డాయి. అయితే మీడియా, రియల్టీ, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ 2-0.7 శాతం మధ్య బలహీనపడ్డాయి. You may be interested

వర్క్‌ ఫ్రం హోం కోరుతున్న కంపెనీలు!

Friday 13th March 2020

కంటికి కనిపించని కోవిడ్‌-19 అనే సూక్షజీవి ప్రపంచ దేశాలను వణికిస్తూ ఆర్థిక వ్యవస్థలన్నింటిని అతలాకుతలం చేస్తోంది. మరోపక్క ఎక్కడికక్కడ జనజీవనాన్ని స్తంభిపచేస్తోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటీ ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో స్టార్టప్‌లతోపాటు ఎంఎన్‌సీ కంపెనీలన్నీ  ఉద్యోగులను ఇంటి దగ్గర నుంచే పని చేయాలనీ కోరుతున్నాయి.  భారత్‌లో కూడా మరో 12 కొత్త కేసులు నమోదవడంతో ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌, ఉబర్‌, ఓలా, స్విగ్గీ,పేటీఎం,

భారీగా తగ్గిన పసిడి!

Friday 13th March 2020

గత కొద్ది రోజులుగా రాకెట్‌లా దూసుకుపోయిన బంగారం ధరలు రెండు మూడు రోజులుగా దిగివస్తున్నాయి. గురువారం స్టాక్‌ మార్కెట్‌లు కుప్పకూలడం, రూపాయి మరింత బలహీనపడడంతో శుక్రవారం దేశీయ మల్టీకమోడిటీ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే రూ.300 తగ్గి 10 గ్రాముల బంగారం రూ.41,975.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కోవిడ్‌-19 ప్రభావంతో వివిధ దేశాల మార్కెట్లు మందగమనంలో నడుస్తుడడంతో  అంతర్జాతీయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే 11 డాలర్లు పతనమై ఔన్స్‌ బంగారం ధర

Most from this category