News


భారీ నష్టాల నుంచి రికవరీ

Wednesday 8th January 2020
Markets_main1578479300.png-30771

తొలుత సెన్సెక్స్‌ 400 పాయింట్లు డౌన్‌
నిఫ్టీ 125 పాయింట్లు పతనం
చివరికి స్వల్ప నష్టాలతో సరి
ఆటో, మెటల్‌, ఫార్మా వెనకడుగు 

ఐటీ, ఎఫ్‌ఎంసీజీ ఎదురీత
ముందుగా హెచ్చరించిన విధంగా ఇరాన్‌ ప్రతిదాడులకు దిగడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు కంగుతిన్నారు. ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్‌ మిసైళ్లను ప్రయోగించడంతో తొలుత విదేశీ మార్కెట్లలో బంగారం, ముడిచమురు ధరలు రివ్వుమన్నాయి. బ్రెంట్‌ చమురు 70 డాలర్లను అధిగమించగా.. పసిడి ఔన్స్‌ 1603 డాలర్లను తాకింది. ఇక డాలరుతో మారకంలో రూపాయి మళ్లీ 72 దిగువకు చేరింది. దీంతో దేశీయంగానూ ఆందోళనకు లోనైన ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో సెన్సెక్స్‌ దాదాపు 400 పాయింట్లు పతనమైంది. 40,477 దిగువకు చేరింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 125 పాయింట్లు కోల్పోయి 11,930 వరకూ జారింది. అయితే మిడ్‌సెషన్‌ నుంచీ అమ్మకాలు తగ్గడంతో మార్కెట్లు కోలుకున్నాయి. చివరికి సెన్సెక్స్‌ 52 పాయింట్ల స్వల్ప నష్టంతో 40,818 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 28 పాయింట్లు బలహీనపడి 12,025 వద్ద ముగిసింది.
 

పీఎస్‌యూ బ్యాంక్స్‌ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఆటో, మెటల్‌, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 0.65 శాతం స్థాయిలో నీరసించాయి. అయితే ఐటీ 0.4 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.1 శాతం చొప్పున బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐషర్‌, కోల్‌ ఇండియా, ఎల్‌అండ్‌టీ, ఐవోసీ, ఓఎన్‌జీసీ, సన్‌ ఫార్మా,, టైటన్‌, హీరో మోటో, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా 4.3-1.2 శాతం మధ్య క్షీణించాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఎయిర్‌టెల్‌, యస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, అల్ట్రాటెక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, యూపీఎల్‌, నెస్లే, బజాజ్‌ ఆటో, హెచ్‌యూఎల్‌, వేదాంతా 3-0.6 శాతం మధ్య లాభపడ్డాయి.

ఐడియా జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో ఎన్‌ఎండీసీ, ఎన్‌సీసీ, అదానీ పవర్‌, బాష్‌, అశోక్‌ లేలాండ్‌ 5-2 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోపక్క ఐడియా, ఎన్‌ఐఐటీ టెక్‌, జిందాల్‌ స్టీల్‌, జీఎంఆర్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, బాలకృష్ణ, సెయిల్‌, రామ్‌కో సిమెంట్‌, జస్ట్‌ డయల్‌ 8.5-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. బీఎస్‌ఈలో స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.2 శాతం చొప్పున బలపడింది. ట్రేడైన షేర్లలో 1014 లాభపడగా.. 1442 నష్టాలతో ముగిశాయి. 

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 682 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 311 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. ఇక సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 104 కోట్లు, డీఐఐలు రూ. 24 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.



You may be interested

మిశ్రధాతుకు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ బై రేటింగ్‌

Thursday 9th January 2020

మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌ (మిధాని)కు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ బై రేటింగ్‌ ఇచ్చింది. భారత అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలు కంపెనీకి విస్తృతమైన వ్యాపార అవకాశాలను తెచ్చిపెడతాయని ఈ సంస్థ పేర్కొంది.    ప్రభుత్వరంగ మిశ్రధాతు కంపెనీ సూపర్‌ అలాయ్‌, టైటానియం అలాయ్‌ తయారీలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సూపర్‌ అలాయ్‌ స్టీల్‌ విభాగంలో కీలకంగా వ్యవహరిస్తోంది. ‘‘భారత అంతరిక్ష రంగానికి బడ్జెట్‌లో పెరుగుతున్న కేటాయింపులు మిధానికి కీలకమైన వనరు. అంతరిక్ష విభాగానికి గణనీయంగా పెరుగుతున్న కేటాయింపులు

కనిష్టం నుంచి 2శాతం కోలుకున్న బ్యాంక్‌ నిఫ్టీ

Wednesday 8th January 2020

ఇరాన్‌ అమెరికా ఉద్రిక్తతలతో ఇంట్రాడేలో దాదాపు 1.50శాతం నష్టపోయిన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మార్కెట్‌ ముగింపు సరికి నష్టాలను పూడ్చుకుంది. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ నేడు 30,995.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో మార్కెట్లో నెలకొన్న అమ్మకాల్లో ప్రభుత్వ రంగ, ప్రైవేట్‌ రంగ షేర్ల పతనంతో ఇండెక్స్‌ ఒకదశలో 500 పాయింట్లు(1.60శాతం) నష్టపోయి 30899.55 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.

Most from this category