News


చివర్లో రికవరీ- నష్టాలు స్వల్పమే

Wednesday 15th January 2020
Markets_main1579084101.png-30953

సెన్సెక్స్‌ తొలుత 300 పాయింట్లు డౌన్‌
80 పాయింట్లవరకూ జారిన నిఫ్టీ
చివరి అర్ధగంటలో ట్రేడర్ల షార్ట్‌ కవరింగ్‌

రికార్డు గరిష్టాల రెండు రోజుల ర్యాలీకి బుధవారం బ్రేక్‌ పడింది. వాణిజ్య వివాద పరిష్కారానికి వీలుగా నేడు అమెరికా, చైనా ప్రాథమిక ఒప్పందంపై సంతకాలు చేయనున్న నేపథ్యంలో దేశీ స్టాక్‌ మా‍ర్కెట్లు అమ్మకాలతో కుదేలయ్యాయి. అయితే చివరి అర్ధగంటలో నష్టాల నుంచి కోలుకున్నాయి. చివరికి స్వల్ప నష్టాలతో నిలిచాయి. సెన్సెక్స్‌ 80 పాయింట్లు క్షీణించి 41,873 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 19 పాయింట్ల వెనకడుగుతో 12,343 వద్ద ముగిసింది. రెండు రోజులపాటు హుషారుగా కదిలి బలహీనంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు బుధవారం మధ్యాహ్నానికల్లా మరింత నీరసించాయి. సెన్సెక్స్‌ 300 పాయింట్లు పతనమై 41,648 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 80 పాయింట్ల వరకూ నీరసించి 12,279 దిగువకు చేరింది. చివర్లో ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు దిగడంతో మార్కెట్లు స్వల్ప నష్టాలతో సరిపెట్టుకున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. కాగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 41,970 వద్ద, నిఫ్టీ 12,355 వద్ద గరిష్టాలకు చేరాయి.

ఆదుకున్న ఆటో, మెటల్‌, ఫార్మా
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ప్రయివేట్‌ బ్యాంక్స్‌ దాదాపు 1 శాతం క్షీణించగా.. రియల్టీ, ఆటో, మీడియా, మెటల్‌, ఫార్మా రంగాలు 1.3-0.6 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్‌ 6 శాతం పతనంకాగా... విప్రో, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్‌, బీపీసీఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఐవోసీ, ఐటీసీ, టెక్‌ మహీంద్రా, వేదాంతా 3.5-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. అయితే యస్‌ బ్యాంక్‌, హీరో మోటో, టాటా మోటార్స్‌, గెయిల్‌, టైటన్‌, మారుతీ, ఎంఅండ్‌ఎం, జీ, ఏషియన్‌ పెయింట్స్‌, గ్రాసిమ్‌ 3.5-1 శాతం మధ్య పుంజుకున్నాయి.

డెరివేటివ్స్‌ ఇలా
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో శ్రీరామ్‌ ట్రాన్స్‌, మదర్‌సన్‌, కమిన్స్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, కంకార్‌, ఐడియా, ఈక్విటాస్‌ 3-1.5 శాతం మధ్య క్షీణించాయి. కాగా.. మరోవైపు మహానగర్‌, పిరమల్‌, ఇంద్రప్రస్థ, ఎన్‌బీసీసీ, బీఈఎల్‌, ఎన్‌ఎండీసీ, చోళమండలం, టీవీఎస్‌ మోటార్‌, క్యాస్ట్రాల్‌ 8.5-4 శాతం మధ్య జంప్‌చేశాయి. ఇక రియల్టీ కౌంటర్లలో ప్రెస్టేజ్‌, ఇండియాబుల్స్‌, ఒబెరాయ్‌, బ్రిగేడ్‌, శోభా 6-1.6 శాతం మధ్య ఎగశాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ 0.6 శాతం, స్మాల్‌ క్యాప్‌ 1 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1485 లాభపడగా.. 1045 నష్టాలతో నిలిచాయి.

అమ్మకాలవైపు..
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 205 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 642 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. కాగా.. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 68 కోట్లు, డీఐఐలు రూ. 47 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.  You may be interested

గ్యాస్‌ షేర్లపై క్రిడిట్‌సూసీ బుల్లిష్‌

Wednesday 15th January 2020

వచ్చే పదేళ్ళలో భారత్‌లో బలమైన గ్యాస్ డిమాండ్ నెలకొంటుందనే అంచనాలతో అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ క్రిడిట్‌సూసీ గ్యాస్‌ రంగానికి చెందిన షేర్లపై బుల్లిష్‌ దోరణి కనబరుస్తుంది. మహానగర్‌ గ్యాస్‌ షేరు షేరుకు బ్రోకరేజ్‌ సంస్థ ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించడంతో పాటు షేరు టార్గెట్‌ ధరను రూ.1280లుగా కేటాయించింది. ఫలితంగా ఈ షేరు నేడు 6శాతానికి పైగా లాభపడింది. తక్కువ ఇన్‌పుట్‌ ధరలతో వచ్చే ఏడాది నుంచి కంపెనీ మార్జిన్లు పెరగవచ్చని బ్రోకరేజ్‌

ఇన్‌ఫ్రా, కన్జూమర్‌, ఫైనాన్స్‌కు ఫండ్స్‌ ఓటు

Wednesday 15th January 2020

వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్న సార్వత్రిక బడ్జెట్‌ నేపథ్యంలో ఇటీవల మ్యూచువల్‌ ఫండ్స్‌ మౌలిక సదుపాయాలు(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌), వినియోగం(కన్జూమర్‌), ఆర్థిక సేవలు(ఫైనాన్స్‌) రంగాలపట్ల ఆసక్తి కనబరుస్తున్నాయి. డిసెంబర్‌(2019)లో దేశీ ఫండ్స్‌(ఎంఎఫ్‌లు) షాపింగ్‌ జాబితాలో ఈ రంగాల కంపెనీలకే ప్రాధాన్యం లభించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వివరాలు చూద్దాం... దేశీ మ్యూచువల్‌ ఫండ్‌ అసోసియేషన్‌(యాంఫీ) వివరాల ప్రకారం గతేడాది(2019)లో స్టాక్‌ మార్కెట్లు 12 శాతం బలపడ్డాయి. ఇదే సమయంలో ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 10

Most from this category