News


స్వల్ప ఊగిసలాటలో మార్కెట్లు

Friday 5th July 2019
Markets_main1562306724.png-26816

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం పార్లమెంట్‌లో 2019-20 బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు స్వల్ప శ్రేణిలో ఊగిసలాడుతున్నాయి. నిఫ్టీ నేడు 11965 పాయింట్ల వద్ద ఆరంభమై 11981 పాయిం‍ట్ల గరిష్టానికి చేరింది. అయితే వెనువెంటనే చిన్నపాటి ప్రాఫిట్‌ బుకింగ్‌  రావడంతో క్రమంగా 11950 పాయింట్లకు క్షీణించింది. అనంతరం 11926 పాయింట్ల కనిష్ఠానికి చేరి ప్రసుతం 11932 పాయింట్ల వద్ద కదలాడుతోంది. సెన్సెక్స్‌ 39895 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా ఉంది. నిఫ్టీ మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు సైతం ఫ్లాట్‌గా ఉన్నాయి.

బ్యాంకింగ్‌, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ సూచీలు పాజిటివ్‌గా, ఇతర రంగాల సూచీలు నెగిటివ్‌గా ఉన్నాయి. ఇన్‌ఫ్రాటెల్‌, ఇండియాబుల్‌హౌసింగ్‌, హెచ్‌యూఎల్‌, ఏసియన్‌పెయింట్స్‌ తదితర షేర్లు లాభాల్లో ఉండగా, యస్‌బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, యూపీఎల్‌, ఎన్‌టీపీసీ తదితర షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ ఆప్షన్స్‌లో 12000, 12500 పాయింట్ల వద్ద కాల్స్‌ ఎక్కువగా, 11500, 11900 పాయింట్ల వద్ద పుట్స్‌ ఎక్కువగా ఉన్నాయి. 

11.35 నిమిషాలకు నిఫ్టీ కదలికలు ఇలా ఉన్నాయి.....



You may be interested

వెలుగులోకి రియల్టీ షేర్లు

Friday 5th July 2019

రియల్టీ షేర్లు శుక్రవారం స్వల్ప లాభంగా లాభపడ్డాయి. నేడు నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ పావుశాతం మేర ర్యాలీ చేసింది. రెరా చట్టం అమలు ఈ ఏడాది పలు రియాల్టీ కంపెనీలు షేర్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఈ బడ్జెట్‌లో రియల్టీ రంగానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే ఆశావహంతో ఈ రంగానికి చెందిన షేర్లు నేడు లాభాల బాట పట్టాయి. శోభ డెవెలపర్స్‌, మహీంద్రాలైఫ్‌ షేర్లు 1.50శాతం లాభపడ్డాయి.

ప్రభుత్వ రంగ కంపెనీ షేర్ల భారీ పతనం

Friday 5th July 2019

బడ్జెట్‌ రోజున ప్రభుత్వరంగ షేర్లు భారీగా పతనమయ్యాయి. బీఎస్‌ఈలో ప్రభుత్వరంగ కంపెనీలకు ప్రాతినిథ్యం వహించే బీఎస్‌ఈ పీఎస్‌యూ ఇండెక్స్‌ 1శాతం నష్టపోయింది. నేడు కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో నిధుల సమీకరణలో భాగంగా ఆయాఆయా ప్రభుత్వరంగ కంపెనీల్లో భారీ వాటా ఉపసంహరణ లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఈ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా నేటి బడ్జెట్‌ ప్రసంగానికి ముందే ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ, ఐఓసీ, ఎన్‌ఎండీసీ,

Most from this category