STOCKS

News


ప్రైవేటు బ్యాంకులు, ఫార్మా అనుకూలం: ఎమ్‌కే గ్లోబల్‌

Monday 23rd December 2019
Markets_main1577039801.png-30360

ఈక్విటీ మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతుందని, 2019లో చూసిన దానితో పోలిస్తే మరింత విస్తృతంగా ఉంటుందని ఎమ్‌కే గ్లోబల్‌ ఫండ్‌ మేనేజర్‌ సచిన్‌ షా అన్నారు. ఇప్పటి వరకు ప్రధాన సూచీల్లోని స్టాక్స్‌ ఏ విధంగా అయితే ర్యాలీ చేశాయో.. అదే విధంగా మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ విభాగంలో మెరుగైన, సమర్థవంతమైన నిర్వహణ కలిగినవి ర్యాలీ చేస్తాయన్న అభిప్రాయాన్ని షా వ్యక్తం చేశారు. కనుక ప్రధాన సూచీలకు వెలుపల ఈ విధమైన నాణ్యమైన కంపెనీలను గుర్తించి ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా రాబడులు ఆర్జించొచ్చని సూచించారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.  

 

  • ఏటా ర్యాలీ చేసే, నష్టపోయే స్టాక్స్‌ ఉంటుంటాయి. అయితే, 2020లో మరిన్ని స్టాక్స్‌ ర్యాలీ చేయనున్నాయి. గడిచిన రెండేళ్లలో మార్కెట్‌ ర్యాలీ కొన్ని స్టాక్స్‌కే పరిమితమైంది. టాప్‌ 20 స్టాక్స్‌కు వెలుపల మొత్తం మార్కెట్‌ క్యాప్‌ గత రెండేళ్లలో ప్రతికూలంగా ఉంది. భద్రత మార్జిన్‌ అధికంగా ఉండే స్థాయిలకు ఈ స్టాక్స్‌ విలువలు చేరాయి. ఆర్థిక రంగంలో కొంత రికవరీ చోటు చేసుకుంటే ఈ స్టాక్స్‌కు ఇన్వెస్టర్ల నుంచి మద్దతు లభిస్తుంది.
  • 2020 మరింత సంస్కరణల సంవత్సరంగా ఉంటుంది. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు రూపంలో మొదటి పెద్ద సంస్కరణ ఇప్పటికే చూసేశాం. తర్వాతి పెద్ద సంస్కరణలు ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, వ్యవక్తిగత ఆదాయపన్ను తగ్గింపు రూపంలో ఉంటాయి. ఈ సంస్కరణలు సహజ ఉత్సాహాన్ని తిరిగి నెలకొల్పి, ఆర్థిక వ్యవస్థలో మొత్తం మీద వినియోగాన్ని పునరుద్ధరిస్తాయి.
  • నిధుల వ్యయాలు తక్కువగా ఉండడం, మెరుగైన ఆస్తుల నాణ్యత, స్థిరీకరణ వంటి అంశాలతో ‍ప్రైవేటు బ్యాంకులు ప్రయోజనం పొందుతాయి. బలమైన రిటైల్‌ ఫ్రాంచైజీలు కలిగిన పెద్ద ప్రైవేటు బ్యాంకులు చక్కని వృద్ధితోపాటు, రాబడులను పెంచుకోగలవు. చాలా ప్రభుత్వరంగ బ్యాంకుల టైర్‌ -1 క్యాపిటల్‌ గతేడాదిలో ఉన్న 8-9 శాతంతో పోలిస్తే ప్రస్తుతం మెరుగ్గా 11-13 శాతం స్థాయిలో ఉంది. రుణాల విషయంలో రానున్న త్రైమాసికాల్లో మంచి పనితీరు చూపిస్తే, తిరిగి ఇన్వెస్టర్ల నమ్మకాన్ని ఇవి చూరగొటాయి. దీంతో వీటి ప్రస్తుత వ్యాల్యూషన్ల నుంచి చూస్తే మంచి రాబడులకు అవకాశం ఉంది.
  • దేశీయ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి నికర పెట్టుబడుల రాక తగ్గడం ఇటీవలే (నవంబర్‌లో) చూశాం. సిప్‌ పెట్టుబడులు మాత్రం చక్కగానే ఉన్నాయి. అయితే, మున్ముందు పెట్టుబడుల రాక మంచిగా ఉండే అవకాశమే ఉంది. ఒకవేళ ఇటీవలి పరిస్థితి (నవంబర్‌ నాటి) మారకపోతే మార్కెట్‌లో ఉత్సాహం తగ్గొచ్చు. ఈటీఎఫ్‌ పెట్టుబడులు అమెరికా-చైనా ట్రేడ్‌ యుద్ధం పరిణామాలపై ఆధారపడి ఉంటాయి.You may be interested

ఎఫ్‌ఐఐల వాటాలు పెరిగిన స్టాక్స్‌..?

Monday 23rd December 2019

విదేశీ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) 2019 మొదటి మూడు త్రైమాసికాల్లో భారత ఈక్విటీ మార్కెట్లలో రూ.30,000 కోట్ల పెట్టుబడులు కుమ్మరించి, 141 కంపెనీల్లో వాటాలు పెంచుకున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ 141 స్టాక్స్‌ల్లో కేవలం 18 స్టాక్స్‌ ఈ ఏడాది 50 శాతం వరకు ర్యాలీ చేశాయి. టెలికం, ఫైనాన్స్‌, హెల్త్‌కేర్‌, ఐటీ, ఇన్సూరెన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, అగ్రి స్టాక్స్‌లో పెట్టుబడుల అవకాశాలను ముందుగా గుర్తించి వీరు ఇన్వెస్ట్‌ చేయడం

‘నాణ్యమైన స్టాక్స్‌ ర్యాలీ ఇప్పట్లో ముగియకపోవచ్చు’

Monday 23rd December 2019

జీడీపీ వృద్ధి 4.5 శాతం స్థాయిలో ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు తప్పకుండా పెట్టబడులు పెట్టాలని సూచించారు క్రెడిట్‌సూసే ఆసియా పసిఫిక్‌ ప్రాంత ఈక్విటీస్ట్రాటజీ కోహెడ్‌ నీలకాంత్‌మిశ్రా. భారత ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ ఇకముందూ కొనసాగుతుందన్నారు. ఇందుకు ఎన్నో కారణాలున్నాయని, దేశీయ పెట్టుబడుల రాక గత 12 నెలల కాలంలో 20 బిలియన్‌ డాలర్లుగా ఉందని, ఇది ఇక ముందూ కొనసాగుతుందని అంచనా వేశారు. ఇప్పటి నుంచి పెట్టుబడుల రాక కొంత తగ్గొచ్చేమో

Most from this category