News


‘విస్తృత భాగస్వామ్యంతోనే ర్యాలీ’

Tuesday 14th January 2020
Markets_main1579023903.png-30928

బాగా క్షీణించిన స్టాక్స్‌ మళ్లీ ఈ ధరల్లో లభించవేమోనన్న భయం (ఫోమో)తో వినియోగ రంగంలోని స్టాక్స్‌ కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు ఆరాట పడుతుండొచ్చని క్యాపిటల్‌మైండ్‌ వ్యవస్థాపకుడు దీపక్‌షెనాయ్‌ అభిప్రాయపడ్డారు. చాలా స్టాక్స్‌ ఇప్పటికీ ర్యాలీ మొదలు పెట్టాల్సి ఉందన్నారు. మార్కెట్‌ ర్యాలీ అర్థవంతంగా ఉండాలంటే అది విస్తృత భాగస్వామ్యంతో ఉండాలన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై తన అభిప్రాయాలు తెలియజేశారు. 

 

ప్రైవేటు బ్యాంకుల్లో వీటికి ప్రాధాన్యం..
సిటీ యూనియన్‌ బ్యాంకు, బంధన్‌ బ్యాంకును అమితంగా ఇష్టపడుతున్నాం. బంధన్‌ బ్యాంకు చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. గృహ్‌ ఫైనాన్స్‌ రూపంలో కొత్త వ్యాపారం తోడయింది. ఎన్‌పీఏ గణాంకాలు మెరుగ్గానే ఉన్నాయి. బ్యాంకుకు ఉన్న 14-15 శాతం నికర వడ్డీ మార్జిన్లు ఎంతో అనుకూలం. బ్యాంకు నిధుల వ్యయాలు కూడా తగ్గిపోతున్నాయి. ఈ దృష్ట్యా బంధన్‌ బ్యాంకు మంచి స్టాక్‌. 

 

వినియోగ స్టాక్స్‌కు డిమాండ్‌..?
గత ఏడాది కాలంగా ఈ స్టాక్స్‌ ర్యాలీ చేయలేదు. దీంతో ఈ కంపెనీల షేర్లలో కదలిక మొదలు కాగానే ఫోమో నెలకొంది. ఈ పరిణామం మ్యూచువల్‌ ఫండ్స్‌ లేదా ఇనిస్టిట్యూషన్లు పాల్గొనడం వల్ల కాదు. అధిక నెట్‌వర్త్‌ కలిగిన ఇన్వెస్టర్లు (హెచ్‌ఎన్‌ఐ), రిటైల్‌ ఇన్వెస్టర్లు వీటిల్లో కొన్నింటి కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇది మంచిదే. అర్థవంతమైన ర్యాలీ జరగాలంటే అది విస్తృతంగానే ఉండాలి. నిఫ్టీ-50 ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిల్లో ఉంటే, నెక్ట్స్‌-50 ఇప్పటికీ 2018 గరిష్ట స్థాయికి 20-25 శాతం దిగువనే ట్రేడవుతోంది. మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ బాగా నష్టపోయి ఉన్నాయి. అందరు ఇన్వెస్టర్లు పాల్గొననంత వరకు ఇది ర్యాలీ అవదు. అప్పటి వరకు కొనుగోళ్ల మార్కెట్‌గానే ఉంటుంది. చాలా పేపర్‌ కంపెనీలు 4-8 పీఈ మధ్యే ట్రేడవుతున్నాయి. అలాగే, ఆటో ఉపకరణాల కంపెనీలు 6-8 పీఈ మధ్య ట్రేడవుతున్నాయి. ఏదో ఒక రోజు ఇవి ర్యాలీ చేస్తాయి. అందుకే వీటి కొనుగోలుకు ఆసక్తి నెలకొంది. 

 

మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌..
మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ వాటి ఫండమెంటల్స్‌కు తగ్గట్టు ర్యాలీ చేయడం లేదు. జేకే పేపర్‌ ఈపీఎస్‌ రెండేళ్ల క్రితం రూ.10. ఇప్పుడు రూ.25. ఈపీఎస్‌ 150 శాతం పెరిగినా కానీ షేరు ధర 2017 నవంబర్‌ స్థాయిలోనే ఉంది. ఏషియన్‌ పెయింట్స్‌ వార్షికంగా 13-15 శాతం చొప్పున వృద్ధి చెందొచ్చు. 80పీఈ వద్ద ట్రేడవుతోంది. వృద్ధి తక్కువగా ఉన్నా కానీ పీఈ పెరిగిపోతోంది. కానీ, జేకే పేపర్‌ విషయంలో ఇది జరగడం లేదు. మిడ్‌క్యాప్‌లో నెలకొన్న పరిస్థితి ఇది. ఎందుకంటే ఇనిస్టిట్యూషన్ల కొనుగోళ్లు తగ్గిపోయాయి. మేమయితే లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేసి ఉన్నాం. You may be interested

బాగా పడిన ఈ స్టాక్స్‌లో ఏవి నయం?

Tuesday 14th January 2020

గతేడాది మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో చాలా వరకు ఇన్వెస్టర్ల పెట్టుబడులను హరించివేసినవే. గత నెల రోజులుగా ఈ విభాగాల్లోని ‍స్టాక్స్‌లో కదలిక వచ్చింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, ‍స్మాల్‌క్యాప్‌లో 14 స్టాక్స్‌ వాటి ఏడాది గరిష్ట ధరల నుంచి 30-73 శాతం వరకు నష్టపోయాయి. ఆ స్టాక్స్‌ ఏవి, వాటిల్లో పెట్టుబడులను పరిశీలించొచ్చా..? అన్నదానిపై నిపుణుల అభిప్రాయాలను చూద్దాం..   52 వారాల గరిష్ట స్థాయిల నుంచి హెచ్‌ఈజీ షేరు 73 శాతం తక్కువలో

మరో కొత్త రికార్డు ముగింపు

Tuesday 14th January 2020

సెన్సెక్స్‌, నిఫ్టీ సరికొత్త గరిష్టాలకు ఇంట్రాడేలో 42,000 సమీపానికి సెన్సెక్స్‌ 12,374 వద్ద నిఫ్టీ ఇంట్రాడే గరిష్టం ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ వెనకడుగు అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరనున్న పరిస్థితులు అటు అమెరికా ఇండెక్సులతోపాటు..ఇటు దేశీ స్టాక్‌ మార్కెట్లకు జోష్‌నిస్తున్నాయి. దీంతో సోమవారం అమెరికా మార్కెట్లు సరికొత్త రికార్డులను సాధించగా.. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌, నిఫ్టీ చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. సెన్సెక్స్‌ 93 పాయింట్లు పెరిగి 41,953 వద్ద నిలవగా.. నిఫ్టీ 33 పాయింట్లు

Most from this category