News


వెల్లువెత్తుతున్న లిక్విడిటీతోనే మార్కెట్‌ ర్యాలీ

Wednesday 19th February 2020
Markets_main1582104950.png-31934

ప్రపంచ వడ్డీ రేట్లు తగ్గే చాన్స్‌ తక్కువే
పసిడి ధరలు మరింత పెరగకపోవచ్చు
సుందరం ఎంఎఫ్‌ ఎండీ సునీల్‌ అంచనాలు

అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడులకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దీంతో ఇండియావంటి ప్రత్యామ్నాయాలవైపు విదేశీ ఇన్వెస్టర్లు చూస్తున్నారు. ఇక దేశీయంగా చూస్తే ఇక్కడ కూడా ఈక్విటీల పోలిస్తే ఇతర సాధనాలలో పెద్దగా పెట్టుబడి అవకాశాలు కనిపించడంలేదు. దీంతో దేశీ మార్కెట్లు లిక్విడిటీ కారణంగా ర్యాలీ చేస్తున్నాయంటున్నారు సుందరం మ్యూచువల్‌ ఫండ్‌ ఎండీ, సీఈవో సునీల్‌ సుబ్రమణ్యం. ఒక ఇంటర్వ్యూలో వడ్డీ రేట్లు, పసిడి ధరలు తదితర పలు అంశాలపై సుబ్రమణ్యం వ్యక్తం చేసిన అభిప్రాయాలను చూద్దాం...

ప్రపం‍చవ్యాప్తంగా పెట్టుబడులకు అంతగా అవకాశాలు కనిపించడంలేదు. దీంతో ఇండియావంటి మార్కెట్లవైపు విదేశీ ఇన్వెస్టర్లు దృష్టిసారిస్తున్నారు. అలాగని ఇక్కడ కూడా ఈక్విటీలతో పోలిస్తే ఆకర్షణీయ ప్రత్యామ్నాయ సాధనాలు కనిపించడంలేదు. దీంతో స్టాక్‌ మార్కెట్లలోకి నిధులు ప్రవహిస్తున్నాయి. ఫలితంగా మార్కెట్లలో లిక్విడిటీ వల్ల ర్యాలీ నెలకొన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల సిప్‌(ఎస్‌ఐపీ) పెట్టుబడులు సైతం పెరుగుతున్నాయి. అమెరికా, జపాన్‌ వంటి దేశాలు నెలకు 75-100 బిలియన్‌ డాలర్లను వ్యవస్థలోకి పంప్‌చేస్తున్నాయి. అయితే అంతర్జాతీయంగా ఇప్పటికే కనిష్టాల వద్ద ఉన్న వడ్డీ రేట్లు మరింత నీరసించే అవకాశాలు తక్కువే. అలాగని పసిడి ధరలు సైతం​మరింత బలపడేందుకు ఆస్కారం లేదు. వెరసి డాలర్ల నిధులు ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల వైపు చూడక తప్పదు. ఇందువల్లనే ఈ ఏడాది దేశీ మార్కెట్లలో రెండు నెలల్లోనే 3 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు తరలి వచ్చాయి. ఇది ర్యాలీకి దోహదం చేస్తోంది. దేశీయంగానూ రిజర్వ్‌ బ్యాంక్‌ కొత్తతరహా విధానాలతో లిక్విడిటీ పెంపునకు దారి చూపింది. తద్వారా ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే చర్యలు చేపట్టింది. 

మిడ్‌, స్మాల్‌ క్యాప్స్!
దేశీ మార్కెట్లలో ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పడుతున్న సంకేతాలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. పరిస్థితులు మరీ అంత అధ్వాన్నంగా ఏమీలేవు. అయితే వృద్ధి బాట పట్టకపోయినా మందగమనానికి బ్రేకులు పడుతున్నట్లు కనిపిస్తోంది. ఇది ముఖ్యమైన సానుకూల అంశంగా చెప్పవచ్చు. లార్జ్‌క్యాప్స్‌తో పోలిస్తే మార్కెట్లు చౌకగా ట్రేడవుతున్నాయి. కొన్ని రంగాలకే ర్యాలీ పరిమితంకాగా.. చాలా కౌంటర్లు డిస్కౌంట్లలో ట్రేడవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఇతర కౌంటర్లలో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాగా.. వ్యవస్థలో అధిక లిక్విడిటీ కొనసాగుతూ దీర్ఘకాలంగా తక్కువ వృద్ధి నమోదవుతూ ఉంటే వేల్యూ ఇన్వెస్ట్‌మెంట్స్‌, దీర్ఘకాలిక అవకాశాలవైపు పెట్టుబడులు చూస్తుంటాయి. దీంతో రక్షణాత్మక పెట్టుబడులవైపు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతారు. ఇందువల్లనే బ్యాంక్‌ డిపాజిట్లు, బంగారం లేదా కొద్దిపాటి లార్జ్‌ క్యాప్స్‌ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. జీఎస్‌టీ, డీమానిటైజేషన్‌ తదితర సంస్కరణల తదుపరి పెద్ద కంపెనీలు మరింత పుంజుకుంటే చిన్న సంస్థలు బలహీనపడ్డాయి. దీంతో సహజంగానే స్టాక్‌ మార్కెట్లలోనూ 15-20 లార్జ్‌క్యాప్స్‌ ర్యాలీ చేస్తూ వచ్చాయి. అయితే మరిన్ని రంగాలు వెలుగులోకి రావడం ద్వారా ఇది 40-50 స్టాక్స్‌కు విస్తరిస్తోంది. ఈ రంగాలలో కొన్ని మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ సైతం ఆకర్షణీయంగా కనిపిస్తు‍న్నాయి. లిక్విడిటీ అంటే ‍ప్రధానంగా ఎఫ్‌ఐఐలు, సావరిన్‌ వెల్త్‌ ఫండ్స్‌, ఈటీఎఫ్‌లు లార్జ్‌క్యాప్స్‌కే ప్రాధాన్యత ఇస్తున్నాయి.

వేల్యూ ఇన్వెస్టింగ్‌?
వేల్యూ  ఇన్వెస్టింగ్‌ విషయానికి వస్తే.. నిజానికి ఇటీవల అనూహ్య పరిస్థితులు నెలకొన్నాయి. చౌకలో కొనుగోలు చేయడం, ఖరీదుగా ఉన్నవాటిని విక్రయించడం వంటి ప్రాథమిక సూత్రాల ట్రెండ్‌ కనిపించడంలేదు. అయితే దీర్ఘకాలంలో ఫండమెంటల్స్‌కే ప్రాధాన్యత ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం నుంచి యూ షేప్‌డ్‌ రికవరీ కనిపిస్తుంది. ఈలోపు రేసులో వెనకబడకుండా ఉండాలంటే మార్కెట్లకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. దీర్ఘకాలంలో పెట్టుబడి విలువను పెంచుకునే అంశంలో ఫం‍డ్స్‌ ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రతీ మ్యూచువల్‌ ఫండ్‌ దీర్ఘకాలానికి కొంతమేర పెట్టుబడులను కేటాయిస్తాయి. స్వల్ప కాలంలో ట్రెండ్‌కు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ దీర్ఘకాలంలో వేల్యూ ఆధారిత వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. ఈ విషయంలో ఇన్వెస్టర్లు సొంత ఆలోచనలకంటే ఫండ్స్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేయడం మేలు చేకూర్చుతుంది.You may be interested

ట్రంప్‌ పర్యటనలో భారీ ఆయిల్‌ డీల్‌ ?

Wednesday 19th February 2020

అమెరికా దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఫిబ్రవరి 24న భారత్‌ రానున్న నేపథ్యంలో ఏయే రంగాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరుగుతాయని మార్కెట్‌ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. అయితే క్రూడ్‌ ఆయిల్‌ డీల్‌ జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేగాక అమెరికాలోని అతిపెద్ద ఆయిల్‌ సరఫరా కంపెనీలు ఇండియాలో భారీ దిగుమతులకు ఆఫర్లు, డిస్కౌంట్‌లు ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఒక్కో బ్యారెల్‌పై 5 డాలర్ల డిస్కౌంట్‌ ఉండవచ్చని

వోడాఫోన్‌ 48 శాతం ర్యాలీ

Wednesday 19th February 2020

వోడాఫోన్‌ ఐడియా షేరు బుధవారం మిడ్‌సెషన్‌ సమయానికి 48శాతం లాభపడింది. నేడు బీఎస్‌ఈలో ఇండెక్స్‌లో ఈ షేరు రూ.3.20 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఈ కంపెనీకి సంబంధించిన బ్యాంక్‌ గ్యారెంటీలను ప్రభుత్వం నగదుగా మార్చుకోకపోవొచ్చనే అంచనాలతో ఇన్వెస్టర్లు ఈ షేరు కొనుగోలుకు మొగ్గుచూపారు. అలాగే గడిచిన ఏడు రోజుల్లో 42శాతం నష్టాన్ని చవిచూసిన నేపథ్యంలో జరిగిన షార్ట్‌ కవరింగ్‌ చేయడం కూడా షేరు ర్యాలీ చేసింది. ఒకదశలో 48.18శాతం లాభపడి రూ.4.49 వద్ద

Most from this category