News


కొన్ని షేర్లే పెరగడమనే ప్రక్రియ కొనసాగదు

Saturday 5th October 2019
Markets_main1570272844.png-28740

స్టాక్‌ పోలరైజేషన్‌పై సమీర్‌ అరోరా
మార్కెట్లో కొన్ని స్టాకులపైనే మదుపరులు ఎక్కువ మక్కువ చూపడం, మిగతావి పేలవ ప్రదర్శన జరపడమనే ప్రక్రియ(పెట్టుబడులు కేంద్రీకృతం కావడం)ఎక్కువ కాలం ఉండదని ప్రముఖ ఫండ్‌ మేనేజర్‌ సమీర్‌ అరోరా అభిప్రాయపడ్డారు. మార్కెట్‌ గమనం కొనసాగాలంటే పోలరైజేషన్‌(కేంద్రీకరణ) దీర్ఘకాలం ఉండకూడదని, క్రమంగా పరిధి విస్తృతం కావాల్సిఉంటుందన్నారు. ప్రస్తుతం ఎక్కువ మంది ఇన్వెస్టర్లు కొన్ని లార్జ్‌క్యాప్స్‌పైనే మక్కువ చూపుతున్నారు. ప్రభుత్వం కార్పొరేట్‌ టాక్స్‌ కోతలు ప్రకటించిన అనంతరం సూచీలు జరిపిన ర్యాలీలో ఇలాంటి కేంద్రీకరణ కనిపిస్తోంది. కేవలం కొన్ని స్టాకుల్లో మాత్రమే పెట్టుబడుల వెల్లువ కొనసాగింది. ప్రస్తుతం నిఫ్టీ తన పదేళ్ల సరాసరి కన్నా 15 శాతం ప్రీమియంతో ట్రేడవుతోంది. కానీ అందులోని పలు స్టాకులు తమ వాల్యూషన్లకు డిస్కౌంట్‌లో ట్రేడవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇన్వెస్టర్లు మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ సూత్రం అవలంబించాలని అరోరా సూచించారు. ఈ సూత్రం ప్రకారం వివిధ రంగాలకు చెందిన విభిన్న స్టాకులను ఎంచుకోవాల్సిఉంటుంది. 
తాము కొన్ని అధిక వాల్యూషన్ల స్టాకుల్లో పెట్టుబడులు పెట్టామని, కానీ ఇదే సమయంలోనే బాగా తక్కువ వాల్యూషన్లున్న స్టాకులను ముఖ్యంగా కొన్ని ప్రైవేట్‌ బ్యాంకుల షేర్లను కొనుగోలు చేశామని ఆయన వివరించారు. తక్కువ పీఈ ఉన్న సమయంలో పెట్టుబడులు పెడితే దీర్ఘకాలం సుస్థిర రాబడులుంటాయన్నారు. అదే సమయంలో విభిన్న పారమితులను సరిచూసుకొని పనికిరాని స్టాకులను ఏరిపారేయాలన్నారు. అలాగే  ఇప్పటికే విపరీతంగా ప్రదర్శన జరిపిన షేర్ల కన్నా భవిష్యత్‌లో దూసుకుపోయే కంపెనీలను ఎంచుకోవాలని సూచించారు. విదేశీ మార్కెట్లతో పోలిస్తే మన ఎకానమీలో ఎఫ్‌ఐఐల మీద పన్ను, డీడీటీ అనే రెండు అంశాలు భిన్నమైనవని, ఈ రెండు అంశాలు తొలగిస్తే ప్రధాని చెప్పినట్లు విదేశీ ఈక్విటీ ఎకానమీలతో మన ఎకానమీ సమతుల్యత సాధిస్తుందని తెలిపారు. ఈ దిశగానే ఎఫ్‌ఐఐలపై పన్ను తొలగించారని భావిస్తున్నామని, ఇదే వరుసలో డీడీటీ సైతం తొలగించాల్సిఉందని అభిప్రాయపడ్డారు. కొత్త ప్రభుత్వం అందరూ ఊహించినట్లే సంస్కరణల పథంలోనే కొనసాగుతోందని, క్రమంగా ఎఫ్‌పీఐలు ఇండియా బాట పడతాయని ఆయన అంచనా వేశారు. You may be interested

సెన్సెక్స్‌ 37,950పైన స్థిరపడితేనే...

Monday 7th October 2019

కార్పొరేట్‌ పన్ను తగ్గింపు కారణంగా గత నెల మూడోవారంలో జరిగిన ర్యాలీలో వచ్చిన లాభాల్ని పట్టుమని పదిరోజులు కూడా మార్కెట్‌ నిలుపుకోలేకపోయింది. పన్ను తగ్గింపు ప్రయోజనం లేకుండా పెరిగిన షేర్లు తగ్గడం సహజమేగానీ, ఆ ప్రయోజనం పొందే షేర్లు సైతం గతవారం చివర్లో అమ్మకాల ఒత్తిడికి లోనుకావడం ఆశ్చర్యం కల్గించేదే. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ షేర్లను మొండి బకాయిలు, జీడీపీ బలహీన వృద్ధి అంచనాల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు సైతం

డిజిన్వెస్ట్‌మెంట్‌ను వేగవంతం చేసిన ప్రభుత్వం

Saturday 5th October 2019

ప్రభుత్వరం‍గ సంస్థలలోని తమ వాటాను వేగంగా విక్రయించేందుకు ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినేట్‌, డిజిన్వెస్ట్‌మెంట్‌ పక్రియను వేగతరం చేసేందుకు ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం ఆర్థిక శాఖ కింద పనిచేస్తున్నా ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌(డీఐపీఏఎం) శాఖను డిజిన్వెస్ట్‌మెంట్‌ పక్రియలో కీలక డిపార్ట్‌మెంట్‌గా మార్చింది. డిజిన్వెస్ట్‌మెంట్‌ పక్రియలో ఎదురవుతున్న సమస్యలను అధిగమనించేందుకు, వేగంగా ఈ పక్రియను పూర్తిచేసేందుకు, మంత్రుల

Most from this category