News


ప్రపంచ మార్కెట్ల దెబ్బ- సెన్సెక్స్‌ బోర్లా

Thursday 30th January 2020
Markets_main1580380307.png-31344

సెన్సెక్స్‌ 285 పాయింట్లు పతనం
94 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ
ఫార్మా కౌంటర్లు కుదేల్‌
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ డీలా

జనవరి డెరివేటివ్‌ సిరీస్‌ చివరి రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు బోర్లాపడ్డాయి. ఇందుకు పలు అంశాలు కారణంకాగా.. సెన్సెక్స్‌ 285 పాయింట్లు పతనమైంది. 41,000 పాయింట్ల దిగువన 40,914 వద్ద ముగిసింది. ఇదేవిధంగా నిఫ్టీ 94 పాయింట్లు కోల్పోయి 12,036 వద్ద స్థిరపడింది. కరోనా వైరస్‌ ఆందోళనలతో మరోసారి ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. దీనికితోడు కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ అత్యయిక పరిస్థితిని ప్రకటించనున్నట్లు వెలువడిన వార్తలు సెంటిమెంటును దెబ్బతీసినట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి బడ్జెట్‌పై అంచనాలతో ముందురోజు లాభపడిన మార్కెట్లు తిరిగి డీలాపడ్డాయి. అమ్మకాలు పెరగడంతో సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 40,830 వద్ద కనిష్టాన్ని తాకింది. తొలుత ఒక దశలో 41,380 వద్ద గరిష్టానికీ చేరింది. ఇక నిఫ్టీ సైతం 12,150-12,011 పాయింట్ల మధ్య ఊగిసలాడింది.  

ఫార్మా వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 2-1.3 శాతం మధ్య క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఆర్‌ఐఎల్‌, హిందాల్కో, విప్రొ, జీ, సిప్లా, బీపీసీఎల్‌, గెయిల్‌, ఇండస్‌ఇండ్‌ 5-2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. అయితే బజాజ్‌ ఆటో, ఐసీఐసీఐ, పవర్‌గ్రిడ్‌, ఐషర్‌, ఎన్‌టీపీసీ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 1.6-0.5 శాతం మధ్య బలపడ్డాయి.

డిష్‌ టీవీ డౌన్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో డిష్‌ టీవీ, గోద్రెజ్‌ సీపీ, పిరమల్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌, కాల్గేట్‌, ఎన్‌బీసీసీ, అరబిందో, శ్రీరామ్‌ ట్రాన్స్‌, గ్లెన్‌మార్క్‌ 8.5-5 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోపక్క ఎస్కార్ట్స్‌ 9.3 శాతం దూసుకెళ్లగా.. జూబిలెంట్‌ ఫుడ్‌, మణప్పురం, ముత్తూట్‌, పిడిలైట్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, ఈక్విటాస్‌, పీఎఫ్‌సీ 5-1 శాతం మధ్య ఎగశాయి. మార్కెట్లను మించుతూ బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.4-1 శాతం చొప్పున తిరోగమించాయి. ట్రేడైన షేర్లలో 1616 నష్టపోగా.. 815 మాత్రమే లాభపడ్డాయి.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1014 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1521 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1358 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌ రూ. 712 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన విషయం విదితమే.  You may be interested

వైరస్‌పై మార్కెట్‌ భయాలు తాత్కాలికమే!

Thursday 30th January 2020

మార్కెట్లు మరలా పుంజుకుంటాయంటున్న నిపుణులు చైనాలో కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రపంచ మార్కెట్లను అల్లకల్లోలం చేస్తోంది. వైరస్‌ భయాలతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనాలవైపు దృష్టి సారిస్తున్నారు. దేశీయ సూచీలు సైతం ఈ మేరకు నెగిటివ్‌గా స్పందిస్తున్నాయి. గురువారం నిఫ్టీ దాదాపు 94 పాయింట్లు పతనమైంది. ప్రస్తుతం నిఫ్టీ కీలక 12100 పాయింట్ల దిగువకు వచ్చింది. కానీ ఇలాంటి అంటువ్యాధుల భయాలు ప్రబలినప్పుడు వచ్చే పతనాలు తాత్కాలికమేనని, మార్కెట్లు తదనంతర దశలో

గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ షేరులో ఆగని పతనం

Thursday 30th January 2020

సిగిరెట్‌ తయారీ సంస్థ గాడ్‌ఫ్రేఫిలిప్స్‌ షేరు వరుసగా పతనమవుతూనే ఉంది. గురువారం ఇంట్రాడేలో షేరు దాదాపు 6 శాతం క్షీణించింది. ముగింపు సమయానికి దాదాపు 4.65 శాతం క్షీణించి రూ. 1190 వద‍్ద క్లోజయింది. దీంతో మూడు సెషన్లలో షేరు దాదాపు 18 శాతం క్షీణించినట్లయింది. కంపెనీలో ప్రమోటర్ల వాటాను అమ్ముతామన్న లలిత్‌ మోదీ ప్రకటన షేరులో కరెక‌్షన్‌ తెచ్చింది. అయితే ప్రమోటర్‌గ్రూప్‌ వాటాలు అమ్మక ప్రకటనను కంపెనీ ఖండించింది.

Most from this category